|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రెండో పెళ్లి తర్వాత రీఎంట్రీ.. ఫోటోలు షేర్‌ చేసిన బ్యూటీ

Published: 12-11-2025, 10:55 PM
రెండో పెళ్లి తర్వాత రీఎంట్రీ.. ఫోటోలు షేర్‌ చేసిన బ్యూటీ

అమలాపాల్, వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా పేరుగాంచిన నటి. ‘మైనా’ వంటి చిత్రాలతో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు. దర్శకుడు విజయ్‌తో మొదటి వివాహం, నిర్మాతగా మారిన తర్వాత, ప్రస్తుతం జగత్ దేశాయ్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. అమ్మతనం తర్వాత ఆమె మళ్లీ నటనకు సిద్ధమవుతుండటం అభిమానులను ఖుషీ చేస్తోంది.

Key Points

1

అమలాపాల్ జగత్ దేశాయ్‌ను రెండో పెళ్లి చేసుకుని, నటనకు దూరంగా ఉన్నారు.

2

ఈ దంపతులకు ఇళయ్ అనే మగబిడ్డ ఉన్నారు.

4

కేరళ చికిత్సతో తన అందాలకు మెరుగు పెడుతూ, కొత్త ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అమలాపాల్ సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితం

అమలాపాల్‌(Amala Paul).. ఆ పేరే ఒక సంచలనం అని చెప్పవచ్పు. వివాదాలకు కేరాఫ్‌ అనే చెప్పాలి. ఆదిలోనే చర్చనీయాంశమైన కథా పాత్రల్లో నటించిన అమలాపాల్‌.. ‘మైనా’ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత  ప్రముఖ హీరోలతో నటించే అవకాశాలు వరించడంతో స్టార్‌ హీరోయిన్‌గా రాణించారు. అలా విక్రమ్‌ హీరోగా నటించిన దైవతిరుమగళ్ (నాన్న)..  విజయ్‌కు జంటగా తలైవా వంటి భారీ చిత్రాల్లో నటించారు. ఎక్కువగా తమిళ్‌లోనే కనిపించిన ఈ బ్యూటీ తెలుగులోనూ ఇద్దరమ్మాయిలతో, నాయక్‌ వంటి చిత్రాల్లో నటించి బహుభాషా నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

రెండో పెళ్లి, అమ్మతనం తర్వాత రీఎంట్రీ సన్నాహాలు

అయితే,  కథానాయకిగా బిజీగా ఉండగానే దర్శకుడు విజయ్‌తో 2014లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వారి వివాహ బందం ఎక్కువ కాలం సాగలేదు. మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఆ తరువాత చిత్రాల్లో నటించడం మొదలెట్టిన అమలాపాల్‌ నిర్మాతగానూ అవతారమెత్తి మలయాళంలో ఒక చిత్రం చేశారు. ఆ తరువాత జగత్‌ దేశాయ్‌ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుని నటనకు దూరంగా ఉంటూ వచ్చారు. వీరికి ఇళయ్‌ అనే మగబిడ్డ ఉన్నారు. దీంతో ఇప్పుడు మళ్లీ నటించడానికి సిద్ధం అవతున్నట్లు సమాచారం.

కొత్త ఫోటోలు, అభిమానుల్లో సంతోషం

అందుకోసం తీవ్రంగా కసరత్తు చేస్తూ.., కేరళ  చికిత్స సాయంతో తన అందాలకు మెరుగు పెడుతున్నారు. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. అంతే కాకుండా నటించడానికి కథలను వింటున్నట్లు తెలిసింది. దీంతో అమలాపాల్‌ సెకెండ్‌ ఇన్నింగ్‌ ఖాయం అంటున్నారు సినీ వర్గాలు. కాగా సమాచారంతో ఆమె అభిమానులను ఖుషీ అవుతున్నారు.

అమలాపాల్ తన రెండవ పెళ్లి, మాతృత్వం తర్వాత తిరిగి సినిమా రంగంలోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు, కథలు వింటున్నారన్న వార్త ఆమె అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అమలాపాల్ సెకండ్ ఇన్నింగ్స్ విజయవంతం కావాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.