|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అక్కినేని ఇంట షాకింగ్ నిజాలు! నాగ్‌పై అమల సంచలన కామెంట్స్! టాలీవుడ్‌లో దుమారం!

Published: 21-03-2026, 5:35 AM
అక్కినేని ఇంట షాకింగ్ నిజాలు! నాగ్‌పై అమల సంచలన కామెంట్స్! టాలీవుడ్‌లో దుమారం!
  • నాగార్జునకి అమ్మాయిలు అభిమానులుండటం సహజం, జెలసీగా ఫీలవ్వను: అమల కామెంట్స్!
  • పబ్‌లో మరో హీరోయిన్‌తో నాగ్‌ అంటూ వచ్చిన వార్తల్లో అసలు నిజం బయటపెట్టిన అమల!
  • సింగపూర్‌లో నాగ్‌ను మరో అమ్మాయితో చూసి నిలదీసిన అభిమాని, షాక్ అయిన అమల!
  • నాగార్జునపై నాకు నమ్మకం ఉంది, ఆయన్ని అనుమానించను అని తెలిపిన అమల!

నాగార్జున, అమలల వైవాహిక జీవితం గురించి ఎన్నో రూమర్లు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో అమల చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆమె ఏం చెప్పారో తెలుసుకుంటే షాక్ అవుతారు.

నాగార్జునపై వస్తున్న రూమర్స్‌పై అమల రియాక్షన్!

నాగార్జున, అమల ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అంతకు ముందే నాగార్జునకి పెళ్లి అయ్యింది. హీరో వెంకటేష్‌ సిస్టర్‌ లక్ష్మీని ఆయన వివాహం చేసుకున్నారు. వీరికి నాగ చైతన్య జన్మించారు. ఆ తర్వాత కొన్ని రోజులకే విడిపోయారు. అనంతరం అమలతో ప్రేమలో పడ్డారు నాగ్‌. వీరిద్దరు కలిసి `కిరాయి దాదా`, `చినబాబు`, `శివ`, `నిర్ణయం` వంటి చిత్రాల్లో నటించారు. వరుసగా కలిసి సినిమాలు చేయడంతో ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకున్నారు. వీరికి కొడుకు అఖిల్‌ జన్మించారు.

దాదాపు 34ఏళ్లుగా వైవాహిక జీవితం గడుపుతున్నారు. అయితే నాగార్జునకి సంబంధించిన తరచూ రూమర్లు వస్తుంటాయి. హీరోయిన్లతో ఎఫైర్‌, ఆ హీరోయిన్‌తో పబ్‌కి వెళ్లాడు, ఈ హీరోయిన్‌తో ఫారెన్‌ వెళ్లారనే వార్తలు వినిపిస్తుంటాయి. ముఖ్యంగా టబుతో రిలేషన్‌ అని చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఓ సందర్భంలో దీనిపై నాగార్జున స్పందించారు. టబు బెస్ట్ ఫ్రెండ్‌ అని, అమలకి కూడా తెలుసు అని తెలిపారు. ఈ క్రమంలో అమల కూడా రియాక్ట్ అయ్యింది. హీరోయిన్లతో నాగార్జున తిరుగుతున్నారనే వార్తలపై ఆమె స్పందించింది.

సింగపూర్‌లో నాగ్‌ను నిలదీసిన అభిమాని.. అసలేం జరిగిందంటే?

నాగార్జున మన్మథుడు, ఆయన్ని అమ్మాయిలు, హీరోయిన్లు ఇష్టపడుతుంటారు. ఎప్పుడైనా జెలసీగా ఫీలయ్యారా? అనే ప్రశ్నకి అమల రియాక్ట్ అయ్యింది. నేనేమీ ఆయన్ని వెంటపడి పట్టుకోలేదని తెలిపింది. ఇద్దరం ప్రేమించుకుని ఒక అండర్ స్టాండింగ్‌తో మ్యారేజ్‌ చేసుకున్నామని, ఆయనపై తనకు నమ్మకం ఉందని, తాను అనుమానించను అని వెల్లడించారు అమల. ఈ సందర్భంగా ఆమెనే రెండు సంఘటనలు పంచుకున్నారు. నాగార్జునపై వచ్చిన రూమర్స్ ని ఆమె వెల్లడించారు.

ఒకసారి నాగార్జున పబ్‌కి వెళ్లాడట. ఓ హీరోయిన్ తో నాగ్‌ పబ్‌కి వెళ్లాడని ఒక జర్నలిస్ట్ వార్త రాశాడట. ఇలా మ్యారేజ్‌ అయినా, మరో హీరోయిన్‌తో పబ్‌కి వెళ్లినట్టు రాయడంతో అది చర్చనీయాంశం అయ్యింది. అయితే ఆ వార్త చదివి అమల నవ్వుకుందట. కారణం ఏంటంటే ఆ హీరోయిన్‌ ఎవరో కాదు తనే అట. ఆ టైమ్‌లో నాగ్‌తో పబ్‌లో ఉన్నది తానే అని వెల్లడించారు. అంతేకాదు మరో సంఘటనని కూడా ఆమె వెల్లడించారు. ఓ సారి నాగ్‌, అమల సింగపూర్‌ ట్రిప్‌కి వెళ్లారట. ఆ సమయంలో అమల గుడ్డుకొట్టించుకొని ఉందట. సింగపూర్‌లో ఓ తమిళ వ్యక్తి నాగార్జునని చూసి, ఆశ్చర్యపోయాడట. మరో అమ్మాయితో తిరుగుతున్నాడేంటి అని ఆశ్చర్యపోయి, నిలదీశాడట.

పబ్‌లో హీరోయిన్‌తో నాగ్‌.. అసలు నిజం చెప్పిన అమల!

నాగార్జున మీకు పెళ్లి అయ్యిందనే విషయం తెలుసా? అన్నాడట. ఆమెని కాదని ఇలా తిరగడమేంటి? అని ప్రశ్నించాడట. దీంతో అమల షాక్‌ అయ్యిందట. ఈమె ఎవరో కాదు, నా భార్య అమలనే సరిగ్గా చూడండి అన్నాడట. అది తన ముందే జరిగిందని, ఇలాంటివి సంఘటనలు చాలా చూశానని, నాగార్జున విషయంలో తనకు అనుమానాలు లేవని తెలిపింది. అంతేకాదు ఎప్పుడూ మనం పట్టుకొని ఉండలేమని, అలా ఉంటే అది ప్రేమనే కాదు అని, అంతేకాదు అలాంటి రిలేషన్‌ ఎప్పుడూ నిలవదని తెలిపారు అమల. ఒకరిపై ఒకరికి ఉండాల్సిన నమ్మకమే, ప్రేమ, భార్యాభర్తల రిలేషన్‌ అని వెల్లడించారు. ఆర్కే టాక్‌ షోలో ఆమె ఈ విషయాన్ని పంచుకున్నారు. ఈ వీడియో క్లిప్‌ ఇప్పుడు వైరల్‌ అవుతుంది.

అమల చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.