|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బిగ్ బాస్ లవర్స్ కి పూనకాలే! సీజన్ 10 షురూ ఎప్పుడో తెలుసా? హోస్ట్ గా ఆ స్టార్ హీరో ఫిక్స్!

Published: 14-02-2026, 9:35 PM
బిగ్ బాస్ లవర్స్ కి పూనకాలే! సీజన్ 10 షురూ ఎప్పుడో తెలుసా? హోస్ట్ గా ఆ స్టార్ హీరో ఫిక్స్!
  • బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులు, త్వరలో ప్రారంభం కానుందని సమాచారం!
  • తెలుగులో బిగ్ బాస్ అడుగుపెట్టి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సీజన్ చాలా స్పెషల్ గా ఉండనుంది.
  • గత సీజన్ల కంటే ఈసారి సెలబ్రిటీలను తీసుకురావడానికి భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం.
  • బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో మాజీ విన్నర్స్ ఎంట్రీ ఇచ్చే అవకాశం, వైల్డ్ కార్డ్ ద్వారా పంపించే ఆలోచనలో టీమ్!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఇది నిజంగా పండగే! బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 త్వరలో మీ ముందుకు రాబోతోంది. ఈసారి ఎవరు హోస్ట్? ఎప్పుడు ప్రారంభం? అనే విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

బిగ్ బాస్ సీజన్ 10: ముహూర్తం ఖరారు?

తెలుగు బుల్లితెరపై బ్లాక్ బస్టర్ హిట్ రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఒకటి. నిజానికి ఈ కాన్సెప్ట్ మనది కాదు… ఫారెన్ నుంచి దిగుమతి చేసుకున్నది. హాలీవుడ్ లో బిగ్ బ్రదర్ గా, బాలీవుడ్ లో బిగ్ బాస్ గా స్టార్ట్ అయ్యి.. తెలుగు తెరపైకి కాస్త లేట్ గా ఎంట్రీ ఇచ్చింది బిగ్ బాస్ షో. వచ్చీ రావడంతోనే ఫస్ట్ సీజన్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బిగ్ బాస్… ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా 9 సీజన్లు కంప్లీట్ చేసుకుందీ. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కోసం తెలుగు ప్రేక్షకులు, బిగ్ బాస్ ప్రేమికులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వారి కోరిక తీర్చడానికి ఈసారి బిగ్ బాస్ కాస్త త్వరగానే స్టార్ట్ చేస్తారన్న టాక్ వినిపిస్తోంది.

ఈసారి బిగ్ బాస్ చాలా స్పెషల్ గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. తెలుగులోకి బిగ్ బాస్ అడుగు పెట్టి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. ఈసీజన్ ను మరింత అద్భుతంగా తీర్చిదిద్దాలని టీమ్ ప్రయత్నిస్తున్నారట. అందుకోసం ఇప్పటి నుంచే పని మొదలు పెట్టినట్టు సమాచారం.

గత 9 సీజన్లలో లేనంత రేంజ్ లో సెలబ్రిటీలను ఈ సీజన్ లోకి తీసుకునేందుకు ట్రై చేస్తున్నారట. అందుకోసం భారీగా రెమ్యునరేషన్లు కూడా ఆఫర్ చేస్తున్నట్టు సమాచారం. బిగ్ బాస్ సీజన్ 9 బ్లాక్ బస్టర్ అవ్వడం.. బిగ్ బాస్ టీమ్ లో ఉత్సాహం రెట్టింపుఅయ్యింది. దాంతో ఈసారీ సీజన్ ను మరింత ప్రత్యేకంగా మార్చాలని ప్రయత్నిస్తున్నారు.

బిగ్ బాస్ సీజన్ 10 లో మాజీ బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు ఓ వార్త వైరల్ అవుతోంది. అయితే వాళ్లను వైల్డ్ కార్డ్ ద్వారా లోపలకు పంపించి.. ఆడియన్స్ కు కొత్త ఎక్స్ పీరియన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తారని తెలుస్తంది. ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 మాత్రం సాలిడ్ గా ఉండబోతున్నట్టు సమాచారం. అందుకోసం కాంట్రవర్సియల్ స్టార్స్ ను కూడా రంగంలోకి దింపబోతున్నారట టీమ్. సీజన్ 9 లోనే రచ్చ టీమ్ ను దింపాలిన అనుకున్నారు. సామాన్యులు .. సెలబ్రిటీలు కాన్సెప్ట్ ను వర్కౌట్ చేశారు.

హోస్ట్ గా నాగార్జున ఉంటారా? లేదా?

బిగ్ బాస్ తెలుగు సీజన్స్ లో మొదటి సీజన్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆతరువాత సెకండ్ సీజన్, 6,7 సీజన్లు పెద్దగా అలరించలేకపోయాయి. దాంతో సీజన్ 8 ని కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేసి బెటర్ అనిపించుకున్నారు. ఎదో ఒక విధంగా సీజన్ 8ను సక్సెస్ చేశారు. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మాత్రం బ్లాక్ బస్టర్ టీఆర్పీలతో రచ్చ రచ్చ చేశారు.

అన్ని సీజన్ల కంటే మించి ఈ సీజన్ సక్సెస్ సాధించింది. సామాన్యులు సెలబ్రిటీలు కాన్సెప్ట్ బాగా వర్కౌట్ అయ్యింది. బిగ్ బాస్ హౌస్ లో ఈరెండు వర్గాల మధ్య ఫైటింగ్ గట్టిగానే జరిగింది. సెలబ్రిటీలు, సామాన్యుల మధ్య పోటీ ఓ రేంజ్ లోసాగింది. చివరకు సామాన్యుడిగా హౌస్ లోకి వెళ్లిన కళ్యాణ్ పడాల విన్నర్ గా నిలిచాడు. ఇక ఇప్పుడు సీజన్ 10 పై విపరీతమైన ఆసక్తి నెలకొంది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ను గట్టిగా ప్లాన్ చేస్తున్నారట టీమ్. అంతే కాదు ఈసారి కాస్త త్వరగానే ఈ సీజన్ ను అందించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గత సీజన్ పై కూడా ఇలాంటి మాటలే వినిపించాయి. కుదిరితే సమ్మర్ లోనే స్టార్ట్ అవ్వచ్చు అని కూడా అన్నారు. కాని బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 సెప్టెంబర్ లో మొదలయ్యింది.

ఈసారి బిగ్ బాస్ లో స్పెషల్ ఎట్రాక్షన్స్!

ఇక ఈసారి కూడా త్వరగానే స్టార్ట్ చేస్తారు అన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కు సబంధించిన పనులు మొదలయినట్టు సమాచారం. సమ్మర్ లో ఈ షో స్టార్ట్ కాకపోతే.. జూన్ లో అనౌన్స్ చేసి.. అగస్ట్ లో అయినా మొదలు పెడతారేమో అని బుల్లితెర ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.

ఇక బిగ్ బాస్ హౌస్ ను నడిపించాలంటే ఆ హోస్ట్ కు చాలా ఓపిక ఉండాలి, హౌస్ లో ఉన్న సెలబ్రిటీలపై కమాండ్ కూడా ఉండాలి. ఆ విషయంలో ఎన్టీఆర్ , నాగార్జున సక్సెస్ అయ్యారు. కాని సెకండ్ సీజన్ ను హోస్ట్ చేసిన నాని మాత్రం సరిగ్గా చేయలేకపోయాడు. ఇక మూడో సీజన్ నుంచి 9వ సీజన్ వరకూ విజయవంతంగా బిగ్ బాస్ ను నడిపిస్తున్నారు కింగ్ నాగార్జున.అయితే ఒకటీ రెండు సీజన్లు నాగార్జున కూడా కొంచెం తడబడ్డాడు. దాంతో హోస్ట్ గా నాగార్జునను తప్పిస్తారని రూమర్లు వినిపించాయి.

లాస్ట్ రెండు బిగ్ బాస్ సీజన్ల విషయంలో.. విజయ్ దేవరకొండ, బాలకృష్ణ పేర్లు వైరల్ అయ్యాయి. కానీ.. బిగ్ బాస్ సీజన్ 8 తో పాటు 9 సీజన్ ను బ్లాక్ బస్టర్ హిట్ చేశాడు కింగ్ నాగార్జున. దాంతో భారీగా ప్లాన్ చేస్తోన్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కూడా నాగార్జునానే హోస్ట్ గా కొనసాగించబోతున్నట్టు తెలుస్తోంది. లాస్ట్ సీజన్ భారీ సక్సెస్ తో .. ఈసారి రెమ్యునరేషన్ కాస్త గట్టిగానే డిమాండ్ చేస్తున్నాడట టాలీవుడ్ మన్మధుడు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గురించి వస్తున్న ఈ వార్తలు అభిమానులకు ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.