
📌 Key Points
- అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
- క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీలో మొదటి అడుగు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
- గ్రీన్ ఎనర్జీ ద్వారా డేటా సెంటర్లకు విద్యుత్ సరఫరా చేయనున్నారు.
- ఏపీలో తొలి క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుకు ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సహకారం అందించనున్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. జాతీయ క్వాంటం మిషన్ ద్వారా దీనిని అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. ఐటీ మరియు ఇతర రంగాల్లో రాష్ట్రాన్ని ముందు ఉంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
క్వాంటం వ్యాలీతో అమరావతి భవితవ్యం
అమరావతి క్వాంటం వ్యాలీ క్వాంటం హార్డ్ వేర్ ఉత్పత్తి ఎకోసిస్టంపై రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. జాతీయ క్వాంటం మిషన్ ద్వారా చేపట్టిన కార్యాచరణను ఏపీ తొలిగా అందిపుచ్చుకుని అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేసిందన్నారు.
గతంలో ఐటీని, ఇప్పుడు క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీని ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ గా వినియోగించుకుంటున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఐటీలో నిపుణుల్ని తయారు చేయడానికి ఇంజనీరింగ్ కాలేజీలు, ట్రిపుల్ ఐటీలను కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నామన్నారు. గతంలో వేగవతంమైన టెక్నాలజీ కోసం బ్యాండ్ విడ్త్ లాంటి మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో లేవన్నారు.
జాతీయ స్థాయిలో ఈ విధానాలను తీసుకువచ్చేలా చేసి వాటిని సద్వినియోగం చేసుకున్నామని చెప్పారు. అప్పుడు చేసిన విజన్ ఇప్పుడు ఫలితాలు ఇస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఐటీతో పాటు ఫార్మా రంగాన్ని కూడా అందిపుచ్చుకుని జీనోమ్ వ్యాలీని ఏర్పాటు చేశామన్నారు. వంద దేశాలకు జీనోమ్ వ్యాలీలో ఉత్పత్తి అయిన వ్యాక్సీన్‌ను కరోనా సమయంలో సరఫరా చేయగలిగామన్నారు.
‘గ్రీన్, క్లీన్ ఎనర్జీ దిశగానూ ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్తోంది. ఇది గేమ్ చేంజర్ గా మారుతుంది. మైక్రో గ్రిడ్స్ ద్వారా విద్యుత్ రంగంలోనూ పెద్ద ఎత్తున వ్యయం తగ్గించేలా చర్యలు చేపడుతున్నాం. డేటా సెంటర్లకు కూడా గ్రీన్ ఎనర్జీనే సరఫరా చేస్తాం. స్పేస్ టెక్నాలజీ, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, మెడ్ టెక్ జోన్స్ ఏర్పాటు చేస్తున్నాం. అవేర్ ద్వారా రియల్ టైమ్ డేటాను సేకరించటం, రియల్ టైమ్ లో నిర్ణయాలు జరగాలి. సంజీవని ప్రాజెక్టుతో వ్యక్తిగత డిజిటల్ హెల్త్ రికార్డులను తయారు చేస్తున్నాం. పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ కూడా తెచ్చాం.’ అని చంద్రబాబు అన్నారు.
సాంకేతికతలో ఆంధ్రప్రదేశ్ ముందంజ
ఏఐ డాక్టర్, ఏఐ ట్యూటర్, ఏఐ అగ్రానమిస్ట్ లాంటి సేవలు పౌరులకు అందించాల్సి ఉందన్నారు చంద్రబాబు. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అనేది ఎప్పుడూ సఫలీకృతం అవుతుందని, ఐటీ ద్వారా ఇప్పుడు సంపద సృష్టి జరుగుతోందన్నారు. నాలెడ్జి ఎకానమీ, సేవల రంగం పెరగటం ద్వారా దేశానికి ప్రయోజనం కలుగుతోందన్నారు.
‘ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సహకారంతో తొలి క్వాంటం కంప్యూటర్ ను ఏపీలో ఏర్పాటు చేస్తున్నాం. రాజధాని అమరావతిలో 8 టవర్లను నిర్మించి క్వాంటం టెక్నాలజీని ప్రోత్సహిస్తాం. క్వాంటం కంప్యూటర్ హార్డ్ వేర్ను దిగుమతి కాదు ఇక్కడే తయారు చేసుకోవాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నాం. దేశీయంగా క్వాంటం కంప్యూటర్‌ను రెండేళ్ల కాలవ్యవధిలో తయారు చేసుకోవాలని భావిస్తున్నాం. దీనికి అవసరమైన క్వాంటం పరికరాలు, టెక్నాలజీ, క్రయోజనిక్స్, అల్గారిథమ్స్ ఇలా మనమే తయారు చేసుకుందాం.’ అని ముఖ్యమంత్రి అన్నారు.
క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీతో అమరావతి ఇక భవిష్యత్ నగరం, అత్యుత్తమ లివబుల్ సిటీగా మారుతుందన్నారు చంద్రబాబు. ఇక అమరావతి అన్‌స్టాపబుల్-అమెరికన్ సిలికాన్ వ్యాలీతో పోలిస్తే క్వాంటం వ్యాలీకి చాలా వేగం ఎక్కువ అని తెలిపారు. టెక్నాలజీని, భాగస్వామ్యాలను అందించాలని నేషనల్ క్వాంటం మిషన్‌ను కోరుతున్నామని సీఎం చెప్పారు. అమరావతి క్వాంటం వ్యాలీ దేశ భవిష్యత్తు, దేశ ప్రగతి ప్రేరకమని చెప్పారు.
గ్రీన్ ఎనర్జీకి ప్రభుత్వం ప్రోత్సాహం
సంజీవని ప్రాజెక్టుపై ఉండవల్లిలో క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పరిధిలోని నారావారి పల్లెలో సమర్థంగా అమలు చేస్తున్న సంజీవని ప్రాజెక్టును జులైలోపు రాష్ట్రంలో అమలు అయ్యేలా చూడాలని చంద్రబాబు చెప్పారు. వచ్చే ఏడాదిలోగా ఏపీలో 56.40 లక్షల మందికి వైద్య పరీక్షలు జరపాలన్నారు.
‘మెరుగైన ప్రజారోగ్యం కోసం అందరూ ఉద్యమంలా కృషి చేయాలి. సంజీవని ప్రాజెక్టును జులైలోగా రాష్ట్రమంతటా అమలయ్యేలా చూడాలి. ఏప్రిల్ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు ప్రజల్లోకి వెళ్లాలి. ప్రతీ నెలా నాలుగో శనివారం స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్‌మెంట్ గ్రామసభలు, హెల్త్ క్యాంప్‌లు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.’ అని చంద్రబాబు అన్నారు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాంకేతిక పరిజ్ఞానంలో అగ్రగామిగా నిలపడానికి చేస్తున్న కృషి ఫలిస్తుందని ఆశిద్దాం. క్వాంటం వ్యాలీ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని ఆశిద్దాం.


