
📌 Key Points
- TGPSC డైట్ లెక్చరర్ 2026 ఉద్యోగాలకు నేటి నుంచే ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం.
- రాష్ట్రవ్యాప్తంగా 86 డైట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
- అభ్యర్థులు జూలై 29, 2026 లోపు tgpsc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు రుసుము OC/BCలకు రూ.1000, SC/ST/PWDలకు రూ.500.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త! TGPSC డైట్ లెక్చరర్ 2026 ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ప్రక్రియ, ముఖ్య తేదీలు
TGPSC DIET Lecturer Recruitment 2026 : తెలంగాణలో ప్రభుత్వ కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు, ముఖ్యంగా విద్యా రంగంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ పరిధిలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థలలో (DIET) ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను నిర్వహిస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూలై 29, 2026 వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://www.tgpsc.gov.in ద్వారా మాత్రమే తమ దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డైట్ కళాశాలల్లో మొత్తం 86 ఖాళీలను భర్తీ చేయనున్నారు. విద్యా సంస్థల అవసరాలకు అనుగుణంగా ఈ పోస్టులను రెండు కేటగిరీలుగా వర్గీకరించారు.
ఖాళీలు, అర్హతలు, వయోపరిమితి
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 01 జూలై 2026 నాటికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే గరిష్ట వయోపరిమితిని 44 సంవత్సరాలుగా నిర్ణయించారు. తెలంగాణ ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన కేటగిరీల అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
అర్హులైన అభ్యర్థులు ముందుగా టీజీపీఎస్సీ వెబ్‌సైట్ ( https://www.tgpsc.gov.in ) లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) పూర్తి చేసుకోవాలి. ఇప్పటికే ఓటీఆర్ ఉన్నవారు తమ వివరాలను అప్‌డేట్ చేసుకుని, డైట్ లెక్చరర్ అప్లికేషన్ లింక్ ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ముగిసే సమయానికి సాంకేతిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున….. అభ్యర్థులు గడువు ముగియడానికి ముందే అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
దరఖాస్తు రుసుము, ఇతర వివరాలు
అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కింద ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఈ ఫీజు రూ. 500 గా నిర్ణయించారు. దీనితో పాటు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న అభ్యర్థులందరూ అదనంగా రూ. 120 పరీక్ష రుసుము చెల్లించాల్సి ఉంటుంది. నిరుద్యోగ అభ్యర్థులకు మాత్రం ఈ రూ. 120 పరీక్ష రుసుము నుంచి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
ఈ నోటిఫికేషన్ ద్వారా విద్యా రంగంలో స్థిరపడాలనుకునే వారికి గొప్ప అవకాశం లభించింది. గడువు ముగియడానికి ముందే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


