|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆడిషన్స్ లో అవమానాలు! అమర్ దీప్ సంచలన వ్యాఖ్యలు! వెండితెరపై నిరూపించుకుంటానంటూ శపథం!

Published: 05-02-2026, 8:30 AM
ఆడిషన్స్ లో అవమానాలు! అమర్ దీప్ సంచలన వ్యాఖ్యలు! వెండితెరపై నిరూపించుకుంటానంటూ శపథం!
  • అమర్ దీప్ చౌదరి హీరోగా ‘సుమతి శతకం’ సినిమాతో వెండితెరకు పరిచయం కానున్నారు.
  • సినిమా అవకాశాల కోసం ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు ఛీ కొట్టారని అమర్ తెలిపారు.
  • తన కష్టంతోనే ఈ స్థాయికి వచ్చానని, ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదని అమర్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
  • రవితేజ అభిమానినని, ఆయన పేరు వాడుకుని పాపులారిటీ పొందలేదని అమర్ స్పష్టం చేశారు.

బుల్లితెర నటుడు అమర్ దీప్ చౌదరి త్వరలో ‘సుమతి శతకం’ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన తన సినీ ప్రయాణంలో ఎదురైన అవమానాలు, కష్టాల గురించి ఎమోషనల్‌గా మాట్లాడారు. రవితేజ అభిమానిగా తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

వెండితెరపై అమర్ దీప్ చౌదరి

Amardeep Chowdary: బుల్లితెర నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అమర్ దీప్ చౌదరి (Amardeep chowdary )ప్రస్తుతం వెండితెర హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా మంచి సక్సెస్ అందుకున్న ఈయనకు బిగ్ బాస్ కార్యక్రమంలో అవకాశం వచ్చింది. ఇలా బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో రన్నర్ గా నిలిచిన అమర్ ఈ కార్యక్రమం అనంతరం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన హీరోగా సినిమా అవకాశాలను అందుకొని వెండితెరపై ప్రేక్షకులను సందడి చేయటానికి సిద్ధమవుతున్నారు. ఇక ఈయన హీరోగా నటించిన సుమతి శతకం (Sumathi Sathakam) అనే సినిమా ఆరో తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా వేగవంతం చేస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా చిత్ర బృందం ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా అమర్ మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా అమర్ మాట్లాడుతూ నేను ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఒక సాధారణ యూట్యూబర్ గా తన జీవితాన్ని ప్రారంభించానని తెలిపారు. అయితే సినిమాలు సీరియల్స్ ఆడిషన్ కోసం తాను ఎన్నో ఆఫీసులకు వెళ్లానని, ఇలా ఆడిషన్ కి వెళ్లి ఛీ కొట్టించుకున్నానని తెలిపారు. ఇలాంటివన్నీ సర్వసాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలోనూ జరుగుతాయి ఇవన్నీ చెప్పి మళ్లీ నేను సింపతి తెచ్చుకోవాలని మాత్రం అనుకోలేదు. నేను కేవలం నా కష్టంతో మాత్రమే ఇక్కడిదాకా వచ్చానని తెలిపారు.

ఆడిషన్స్‌లో ఎదురైన అనుభవాలు

నాకు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేదు. నాకున్న బ్యాక్ గ్రౌండ్ నా కష్టం మాత్రమేనని ఈయన తెలిపారు. ఇలా నా టాలెంట్ నమ్ముకుని తాను మెల్లిమెల్లిగా అవకాశాలు అందుకుంటూ సుమతి శతకం సినిమా వరకు వచ్చానని ఈయన తెలియజేశారు. ఇక ఈ సినిమాని ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని ఆశ భావం వ్యక్తం చేస్తున్నానంటూ అమర్ తెలియజేశారు. ఇకపోతే అమర్ రవితేజ అభిమాని అనే సంగతి అందరికీ తెలిసిందే.. అయితే తాను రవితేజ పేరు చెప్పుకొని పాపులారిటీ సొంతం చేసుకోలేదని సింధూరం సినిమా సమయం నుంచి తాను రవితేజకు అభిమానిని ఈయన తెలియజేశారు.

వెండితెరపై అమర్ సక్సెస్ కొట్టేనా?

సినిమా అవకాశాలపై అమర్ కామెంట్స్

ఇలా తన కెరీర్ గురించి కెరియర్ లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి అమర్ మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అమర్ బుల్లితెర నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. మరి వెండితెరపై అమర్ నటన ఎలా ఉండబోతోంది హీరోగా ఈయన సక్సెస్ అందుకుంటారా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇక సుమతి శతకం సినిమా విషయానికి వస్తే ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ ప్రేమ కథ సినిమాగా రాబోతోందని తెలుస్తోంది.. ఈ సినిమాలో అమర్ జోడిగా శైలి చౌదరి హీరోయిన్ గా నటించి సందడి చేశారు.

అమర్ దీప్ తన కష్టంతో ఎదిగిన విధానం స్ఫూర్తిదాయకం. ‘సుమతి శతకం’ సినిమాతో ఆయన వెండితెరపై ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి. ఆయన ప్రయత్నానికి అందరూ అండగా నిలవాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.