|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నిజాయితీపరుడు దొంగగా మారితే? పృథ్వీరాజ్ ‘ఐ, నోబడీ’ రిలీజ్ డేట్ ఫిక్స్!

Published: 06-07-2026, 1:41 PM
నిజాయితీపరుడు దొంగగా మారితే? పృథ్వీరాజ్ 'ఐ, నోబడీ' రిలీజ్ డేట్ ఫిక్స్!
  • పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘ఐ, నోబడీ’ యాక్షన్ సైకో థ్రిల్లర్. రిలీజ్ డేట్ ఖరారు.
  • నిస్సాం బషీర్ దర్శకత్వంలో, నేషనల్ అవార్డ్ విన్నర్ పార్వతి తిరువోతు కీలక పాత్రలో.
  • బ్యాంకు ఉద్యోగి రాజు దొంగతనం కేసులో ఇరుక్కుని, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే కథ.
  • శ్రీ స్రవంతి మూవీస్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు.

పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన యాక్షన్ సైకో థ్రిల్లర్ ‘ఐ, నోబడీ’ రిలీజ్ డేట్ ఖరారైంది. బ్యాంకు ఉద్యోగి దొంగగా మారితే అనే ఆసక్తికరమైన కథాంశంతో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సలార్ తర్వాత పృథ్వీరాజ్ నుంచి వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం.

పృథ్వీరాజ్ సుకుమారన్ కొత్త సినిమా

I Nobody : పృథ్వీరాజ్ సుకుమారన్..మల్లూ వుడ్ లో బాగా పాపులర్ అయిన ఈ పేరు కొంతకాలం వరకు తెలుగులో ఎక్కువ మందికి తెలీదనే చెప్పాలి. కాని ఈ పేరు ప్రభాస్ సలార్ తో ఒక్కసారిగా తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైపోయింది.ఆ సినిమాలో వరదరాజ మన్నార్‌గా పృథ్వీరాజ్ చూపిన నటన ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది. ఇక ఆ తర్వాత వచ్చిన ఆడు జీవితం సినిమాతో తెలుగు మార్కెట్ ని కూడా బాగానే క్యాప్చర్ చేశాడు.కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా లూసిఫర్ వంటి ఇండస్ట్రీ హిట్ తో దర్శకుడిగానూ మంచి పేరే తెచ్చుకున్నాడు.ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో జక్కన్న తెరకెక్కిస్తున్న వారణాసిలో పృథ్వీరాజ్ కుంబ అనే పాత్రలో కనిపించనున్న సంగతి తెల్సిందే.

రిలీజ్ చేస్తున్న శ్రీ స్రవంతి మూవీస్, మైత్రీ మూవీ మేకర్స్

ఇవి ఇలా ఉండగా తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ నుంచి వస్తున్న లేటెస్ట్ వస్తున్ యాక్షన్ సైకో థ్రిల్లర్ సినిమా ‘ఐ, నోబడీ’.నిస్సాం బషీర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మమ్ముట్టితో రోషాక్ అనే మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను తెరకెక్కించింది నిస్సాం బషీరే అని స్పెషల్ గా చెప్పక్కర్లేదు కూడా,ఇక ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటు నేషనల్ అవార్డ్ విన్నర్ పార్వతి తిరువోతు లీడ్ చేయడం ఇక్కడ విశేషం.ఇక ఈ సినిమాని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌసెస్ శ్రీ స్రవంతి మూవీస్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి ఈ సినిమాని రిలీజ్ చేస్తుండటంతో సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

‘ఐ, నోబడీ’ కథా నేపథ్యం

సగటు మనిషి చుట్టూ అల్లిన ఈ క్రైమ్ సస్పెన్స్ డ్రామా

ఇక ఇప్పటికే సినిమా నుండి వదిలిన టీజర్, ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి అప్లాజ్ తెచ్చుకోవడంతో సినిమా పై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు మేకర్స్. అందులో కనిపిస్తున్న ఇంటెన్సిటీ, సస్పెన్స్ ఎలిమెంట్స్ సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్లాయనే చెప్పాలి.ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే .. రాజు అనే ఒక సాదాసీదా బ్యాంకు ఉద్యోగి చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది.ఆ బ్యాంక్ లో ఒక పెద్ద దొంగతనం జరగడం, అది ఉద్యోగిగా పని చేస్తున్న రాజు పై పడటం,తో సినిమా కథ ఒక్కసారిగా టర్న్ తీసుకుంటుంది.అనుకోని విధంగా కేసు మీద పడటంతో రాజు తనని తను ఎలా నిర్దోషిగా నిరూపించుకున్నాడు,ఎలా తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు ,అనేదే ఈ సినిమా కథ. ఒక సగటు మనిషి చుట్టూ అల్లిన ఈ క్రైమ్ సస్పెన్స్ డ్రామాలో ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా కుదిరాయని ఇండస్ట్రీ టాక్.

రిలీజ్ డేట్, అంచనాలు

బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కాసులు కురిపిస్తుందో !

ఇక థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా జూలై 9వ తేదీన మలయాళంలో గ్రాండ్‌గా రిలీజ్ అవుతుండగా, మరుసటి రోజైన జూలై 10న ప్రపంచవ్యాప్తంగా తెలుగు వెర్షన్ థియేటర్లలో విడుదల కానుంది.అయితే పృథ్వీరాజ్ సుకుమారన్‌కు తెలుగు రాష్ట్రాలో ఉన్న క్రేజ్ కారణంగా ఈ సినిమాని ఒక రోజు ముందే అంటే జూలై 9వ తేదీ సాయంత్రం నుంచే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో భారీ ఎత్తున పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేశారట మేకర్స్. చూడాలి మరి ఐ, నోబడీ’అంటూ వస్తున్న బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కాసులు కురిపిస్తుందో !

నిస్సాం బషీర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ టీజర్లు, ట్రైలర్‌లతో ఇప్పటికే మంచి స్పందన పొందింది. పృథ్వీరాజ్ నటన, ఉత్కంఠభరితమైన కథాంశం సినిమా విజయాన్ని నిర్ణయిస్తాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.