
📌 Key Points
- అమర్ దీప్ చౌదరి ‘సుమతీ శతకం’ మూవీ ఫిబ్రవరి 6న విడుదల!
- మైత్రీ మూవీస్ ద్వారా గ్రాండ్ రిలీజ్ అవుతున్న ‘సుమతీ శతకం’!
- సైలీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం!
- చిన్నప్పటి కష్టాలను గుర్తు చేసుకున్న అమర్ దీప్ ఎమోషనల్ స్పీచ్ వైరల్!
బుల్లితెర నటుడు అమర్ దీప్ చౌదరి ‘సుమతీ శతకం’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆయన పడిన కష్టాల గురించి తెలుసుకొని అభిమానులు షాక్ అవుతున్నారు.
అమర్ దీప్ చౌదరి ఎమోషనల్ కామెంట్స్ వైరల్!
సీరియల్స్‌తో ఫేమస్ అయిన అమర్ దీప్ చౌదరి (Amardeep Chowdary) నటిస్తున్న తాజా చిత్రం ‘సుమతీ శతకం’ (Sumathi Satakam). ఎం. ఎం. నాయుడు (MM Naidu) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సైలీ చౌదరి (Saylim Chaudhari) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ మూవీను ఫిబ్రవరి 6న మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో తాజాగా ప్రెస్ మీట్ పెట్టగా.. అక్కడ అమర్ దీప్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.
‘సుమతీ శతకం’ మూవీ విశేషాలు!
ఆయన మాట్లాడుతూ.. ‘అన్నా నేను బేసిక్‌గా ఏమీ లేని స్థాయి నుంచే స్టార్ట్ అయ్యాను. యూట్యూబర్‌గా స్టార్ట్ అయిన జీవితం 13 సంవత్సరాలు అక్కడక్కడ చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ ఆడిషన్స్‌కు వెళుతూ ‘ఛీ’ కొట్టించుకోవడం ఇవన్నీ కామన్ ఇవన్నీ నా లైఫ్లో జరిగాయి. ఇవన్నీ చెప్పి నేను మళ్లీ సింపతీ తెచ్చుకోవాలని అనుకోవట్లేదు. ఏరా మళ్లీ సింపతీ క్రియేట్ చేసుకుంటున్నావ్ అంటూ మళ్లీ నన్ను వేసుకుంటారు కాబట్టి నాకొద్దు. నాకష్టం నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చింది.
ఫిబ్రవరి 6న గ్రాండ్ రిలీజ్!
వెనకాల ఏ గ్రౌండ్ లేదు. ఓన్లీ ఒకే ఒక గ్రౌండ్ ఉంది.. అదే నా కష్టం. నాకొక టాలెంట్ ఉంది అనే గ్రౌండ్ తప్ప ఏ గ్రౌండ్ లేదు. అలా చిన్న చిన్నగా ఎక్కడా నేను ప్రూవ్ చేసుకోవచ్చో, ఎక్కడ నాకొక గుర్తింపు వస్తదో అని ఉన్న ప్రతి చోట ఫుల్ ఫిల్ చేసుకుంటూ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ వచ్చిన తర్వాత వచ్చిన ఒకే ఒక మహత్తరమైన అవకాశం సుమతీశతకం నాకు మాత్రమే’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టంట వైరల్‌గా మారాయి.
అమర్ దీప్ ఎమోషనల్ స్పీచ్ అందరినీ కదిలించింది. ‘సుమతీ శతకం’ మూవీ ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


