
📌 Key Points
- అమర్దీప్ నటించిన ‘సుమతీ శతకం’ ఫిబ్రవరి 6న విడుదల కానుంది.
- రవితేజ బిగ్ బాస్ స్టేజ్ పై అమర్దీప్ కి అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు.
- సినిమాలోని పాటలకు సుభాష్ ఆనంద్ సంగీతం అందించారు.
- రవితేజ ‘సుమతీ శతకం’ టీజర్ చూసి అమర్దీప్ ను మెచ్చుకున్నారు.
అమర్దీప్ హీరోగా నటించిన ‘సుమతీ శతకం’ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రవితేజ సినిమా టీజర్ చూసి ప్రశంసలు కురిపించారు. బిగ్ బాస్ హౌస్ లో రవితేజ పై అమర్దీప్ అభిమానం అందరికీ తెలిసిందే.
అమర్దీప్ కు రవితేజ ప్రోత్సాహం
Sumathi Sathakam Amardeep:అమర్దీప్(Amardeep).. సీరియల్ నటుడిగా కెరియర్ మొదలుపెట్టి.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో కంటెస్టెంట్ గా పాల్గొని టైటిల్ విజేత కావాల్సిన ఈయన కొన్ని కారణాలవల్ల రన్నరప్ గా నిలిచి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇకపోతే ఈయనకు మాస్ మహారాజా రవితేజ (Raviteja)అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో రవితేజ పై ఉన్న ఇష్టంతో.. అమర్దీప్ చేసిన త్యాగం అందరినీ కలచివేసింది. ఈ ఒక్క షో తో అమర్దీప్ కి రవితేజ అంటే ఎంత ఇష్టమో అందరికీ అర్థమయిపోయింది. పైగా రవితేజ తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చినప్పుడు తనకు అవకాశం ఇస్తానని హామీ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతో తనకు టైటిల్ విన్నర్ కూడా అవసరం లేదని.. తన అభిమాన హీరో సినిమాలో ఒక్క చిన్న అవకాశం వచ్చినా చాలు అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు అమర్దీప్.
అలాంటి అమర్దీప్ తాజాగా ‘సుమతీ శతకం’ అనే సినిమాతో ఫిబ్రవరి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నారు. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మాణంలో ఎంఎం నాయుడు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. అమర్దీప్ చౌదరి హీరోగా, శైలీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ,టీజర్ , పాటలు ప్రేక్షకుల నుండి విపరీతమైన ఆదరణను సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా ఈ పాటలలో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుండి మంచి అభినందనలు కూడా లభించాయి. దీనికి తోడు సుభాష్ ఆనంద్ సంగీతం అందించిన పాటలకు మరింత ప్రాముఖ్యత పెరిగింది.
‘సుమతీ శతకం’ చిత్రం విడుదల
తిరుపతి లోని ఒక కళాశాలలో ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా.. కంటెంట్ చూసిన మాస్ మహారాజ రవితేజ స్పందిస్తూ..” అమర్దీప్ నీ సినిమా సుమతీ శతకం చిత్ర టీజర్, ట్రైలర్ ఇంకా ఇతర కంటెంట్ చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని, నీ సినిమా భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ ప్రశంసలు కురిపించారు.
ఇకపోతే రవితేజ ప్రత్యేకంగా తన సినిమాకు సంబంధించిన కంటెంట్ ను చూసి ఇలా ప్రశంసలు కురిపించడంతో అమర్దీప్ ఎగిరి గంతేస్తున్నారు. ఇంతకంటే ఇంకేం కావాలి అని సంతోషపడుతున్నారు. అయితే ఇది చూసిన అమర్దీప్ అభిమానులు మాత్రం రవితేజ మాస్టారు కేవలం ప్రశంసల వరకేనా? అవకాశం ఏమైనా ఇస్తారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే గతంలో బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తన సినిమాలో అవకాశం ఇస్తానని రవితేజ హామీ ఇచ్చారు.
అభిమానుల్లో ఆసక్తికర చర్చ
అలాంటి రవితేజ ఇప్పుడు అమర్దీప్ సినిమాకు ప్రశంసలు కురిపిస్తుండడంతో అవకాశం కూడా కల్పించాలని కోరుతున్నారు. మరి కొంతమంది హీరోగానే అమర్దీప్ సినీ రంగప్రవేశం చేశారు కదా ఈయనకు ఇంకా రవితేజ సినిమాలో అవకాశం అవసరం లేదు అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి ఫిబ్రవరి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సుమతీ శతకంతో హీరోగా అమర్దీప్ సక్సెస్ అందుకోవాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
మొత్తానికి రవితేజ ప్రశంసలు అమర్దీప్ కు ఎంతో బూస్ట్ ఇచ్చాయి. అయితే, అభిమానులు మాత్రం రవితేజ ఆయనకు నిజంగా అవకాశం ఇస్తారా లేదా అని ఎదురు చూస్తున్నారు. వేచి చూడాల్సిందే!


