
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ఎదురుచూస్తున్నారా? అయితే ఇది మీకు శుభవార్త! అమెజాన్ ప్రైమ్ డే 2026 సేల్ జూలై 4న ప్రారంభమై జూలై 6 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, నో-కాస్ట్ EMI వంటి అద్భుతమైన డీల్స్ అందుబాటులో ఉంటాయి. మీ ఫేవరెట్ ఫోన్‌ను తక్కువ ధరకే సొంతం చేసుకోండి.
Key Points
అమెజాన్ ప్రైమ్ డే 2026 సేల్ జూలై 4 నుంచి 6 వరకు జరుగుతుంది.
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా, వన్‌ప్లస్ 13 వంటి ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు.
ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌లపై 10% తక్షణ డిస్కౌంట్.
నో-కాస్ట్ EMI, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ప్రైమ్ డే స్మార్ట్‌ఫోన్ డీల్స్
Amazon Prime Day 2026 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? భారత మార్కెట్లో అమెజాన్ ప్రైమ్ డే 2026 ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం.. జూలై 4 నుంచి జూలై 6 వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఈ వార్షిక సేల్ ఈవెంట్ స్మార్ట్‌ఫోన్‌లు, వేరబుల్స్, ఆడియో డివైజ్‌లు, హోం అప్లియన్సెస్ మరిన్నింటిపై 72 గంటల పాటు డిస్కౌంట్లను అందిస్తుంది.
కొనుగోలుదారులు సాధారణ మార్కెట్ ధరల కన్నా చాలా తక్కువ ధరకే కొనేసుకోవచ్చు. డైరెక్ట్ ప్రైస్ కట్స్, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్ నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్లను పొందవచ్చు. ఈ సేల్‌కు ముందు, శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా, ఐక్యూ 15, వన్‌ప్లస్ 13, రెడ్‌మి A7 ప్రో 5జీ వంటి స్మార్ట్‌ఫోన్‌లపై అమెజాన్ ఎర్లీ డీల్స్‌ను అందిస్తోంది.
బ్యాంక్ ఆఫర్లు, EMI వివరాలు
ఈ స్మార్ట్‌ఫోన్ ఆఫర్లలో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5జీపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ధర రూ. 1,29,999 నుంచి తగ్గి ఇప్పుడు రూ. 89,999 ధరకే లభిస్తోంది. ఇతర ఫోన్ల డీల్స్‌లో వన్‌ప్లస్ 13 రూ. 54,999కి, వన్‌ప్లస్ N6 రూ. 21,999కి, వన్‌ప్లస్ నార్డ్ CE6 రూ. 29,999కి, ఐక్యూ నియో 10 రూ. 41,999కి లభ్యమవుతున్నాయి.
Read Also : Flipkart GOAT Sale 2026 : ఇది కదా డిస్కౌంట్.. ఆపిల్ ఐఫోన్ 17 చాలా చీప్ గురూ.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?
టాప్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులు
ఈ స్మార్ట్‌ఫోన్‌లపై అడ్వాన్స్ డీల్స్ : అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు ప్రత్యేకంగా అర్హత గల ప్రొడక్టులపై ఇన్ స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్స్ పొందవచ్చు. ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లు, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.
అలాగే, అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లు కూడా 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. నేరుగా ధర తగ్గింపుతో పాటు రూ. 66వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, 12 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్స్ పొందవచ్చు. అమెజాన్ ప్రైమ్ డే 2026కు ముందు కొన్ని అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి..
అమెజాన్ ప్రైమ్ డే 2026 స్మార్ట్‌ఫోన్ ప్రియులకు గొప్ప అవకాశం. అద్భుతమైన డీల్స్‌తో పాటు బ్యాంక్ ఆఫర్లు, EMI సౌకర్యాలు వినియోగదారులకు మరింత ప్రయోజనం చేకూరుస్తాయి. మీ బడ్జెట్‌లో నచ్చిన ఫోన్‌ను సొంతం చేసుకోవడానికి ఇదే సరైన సమయం.


