
📌 Key Points
- అమీషా పటేల్ 50 ఏళ్లు వచ్చినా పెళ్లికి రెడీ అంటోంది.
- తనలో సగం వయసున్న కుర్రాళ్లు డేటింగ్‌కి పిలుస్తున్నారని వెల్లడి.
- పవన్ కళ్యాణ్ ‘బద్రి’తో టాలీవుడ్‌కి ఎంట్రీ, ‘గదర్ 2’తో బౌన్స్ బ్యాక్.
- వయసు కేవలం నంబర్ అని, మానసిక పరిపక్వత ముఖ్యమని అభిప్రాయం.
నటి అమీషా పటేల్ తన పెళ్లి, డేటింగ్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 50 ఏళ్లు దాటినా పెళ్లికి సిద్ధమంటున్న ఆమె, తనలో సగం వయసు కుర్రాళ్లు డేటింగ్‌కి ఆహ్వానిస్తున్నారని వెల్లడించింది. వయసు కేవలం నంబర్ మాత్రమే అని ఆమె అభిప్రాయపడింది.
అమీషా పెళ్లి, డేటింగ్ కామెంట్స్
హీరోయిన్లు చాలా మంది యాభై ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోయారు. అలా ఒంటరిగా ఉన్న హీరోయిన్‌లలో అమీషా పటేల్ ఒకరు. ఆమె ఏజ్ 50 ఏళ్లు. అయినా ఇప్పటికీ ఒంటరిగానే ఉంది. ఆ మధ్య తనకు పెళ్లిపై ఆసక్తి లేదని చెప్పింది. డేటింగ్‌పై ఆసక్తిని వెల్లడించింది. తాజాగా ఆమె పెళ్లి కి రెడీ అంటోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకుంది. తనలో సగం ఏజ్ ఉన్న కుర్రాళ్లు కూడా డేటింగ్‌కి రమ్మంటున్నారని చెప్పింది.
ఆమె మాట్లాడుతూ, `నా వయసులో సగం ఉన్న కుర్రాళ్లు కూడా ఇప్పుడు నన్ను డేటింగ్‌కి పిలుస్తున్నారు. ఈ విషయంలో నేను ఓపెన్‌గానే ఉన్నాను. వయసు అనేది కేవలం నెంబర్ మాత్రమే. మానసిక పరిపక్వత, పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే ఎవరినైనా ఎంచుకోవడానికి నేను సిద్ధమే. పెళ్లి చేసుకునేందుకు రెడీనే` అని చెప్పింది అమీషా పటేల్. ప్రస్తుతం ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో నెటిజన్ల నుంచి డేటింగ్, మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తున్నాయి.
సగం ఏజ్ కుర్రాళ్ల డేటింగ్ ప్రపోజల్స్
తాము చాలా విశాలహృదయంతో ఉన్నామని, డేటింగ్ చేయడానికి రెడీనే అంటున్నారు. రచ్చ రచ్చ చేస్తున్నారు. మొత్తంగా అమీషా పటేల్ ఇప్పుడు సోషల్ మీడియా అటెన్షన్ తనవైపుకి తిప్పుకుందని చెప్పొచ్చు. అమీషా పటేల్.. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన `బద్రి` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో పవన్‌తో రొమాన్స్ చేసి మెప్పించింది. మంచి విజయాన్ని అందుకుంది. కానీ ఆ తర్వాత వరుసగా పరాజయాలు వెంటాడాయి. `బద్రి` తర్వాత అమీషా పటేల్ `నాని`, `నరసింహుడు`, `పరమవీర చక్ర` చిత్రాల్లో నటించింది. ఈ మూవీస్ ఆడలేదు. దీంతో తెలుగుకి దూరమయ్యింది. కేవలం బాలీవుడ్ కే పరిమితమయ్యింది.
అమీషా పటేల్ కెరీర్, గదర్ 2 విజయం
ఆ మధ్య `ఆకతాయి` అనే సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఇక చాలా ఏళ్ల తర్వాత `గదర్ 2` చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుంది. బౌన్స్ బ్యాక్ అయ్యింది. అయినా ఒకటి అర ఆఫర్లతోనే సరిపెట్టుకుంటోంది. కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. గ్లామర్ విందుని వడ్డిస్తూ నెటిజన్లని ఆకర్షిస్తోంది. యాభై ఏళ్లలోనే 20ఏళ్ల అమ్మాయిలా మెరిసిపోతుంది. తన అందంతో అందరిని ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోఇప్పుడు ఆమె పెళ్లికి రెడీ అనడం విశేషం.
మొత్తంగా, అమీషా పటేల్ వయసుతో సంబంధం లేకుండా ప్రేమ, పెళ్లి పట్ల తన వైఖరిని స్పష్టంగా వెల్లడించింది. ఆమె బోల్డ్ కామెంట్స్ నెట్టింట చర్చనీయాంశంగా మారి, అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.


