|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చాబహార్ పోర్టుపై అమెరికా దాడి: భారత్కు షాక్!

Published: 09-07-2026, 3:44 PM
చాబహార్ పోర్టుపై అమెరికా దాడి: భారత్కు షాక్!

అమెరికా, ఇరాన్ మధ్య రెండో రోజూ దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా తొలిసారిగా చాబహార్ పోర్టుపై దాడి చేయడం భారత్కు కీలక పరిణామం. ఈ దాడుల్లో 14 మంది మరణించగా, వంద మంది గాయపడ్డారు.

Key Points

1

అమెరికా 90 మిలిటరీ టార్గెట్లను ధ్వంసం చేసింది.

2

చాబహార్ పోర్టు, బుషెహర్ అణు కేంద్రం సమీపంలో దాడులు.

4

ఇరాన్ కువైట్, ఖతర్లోని అమెరికా బేస్లపై దాడి చేసింది.

చాబహార్ పోర్టుపై తొలిసారి దాడి

అమెరికా, ఇరాన్ మధ్య రెండో రోజూ దాడులు కొనసాగాయి. అమెరికా సుమారు 90 మిలిటరీ టార్గెట్లను ధ్వంసం చేసినట్టు వెల్లడించగా.. చాబహార్ పోర్టు, బుషెహర్ అణు విద్యు్త్ కేంద్రం సమీపంలోనూ దాడులు జరిగాయని ఇరాన్ పేర్కొంది. రెండు రోజులపాటు జరిగిన దాడుల్లో 14 మంది మరణించారని, సుమారు వంద మంది గాయపడినట్టు వెల్లడించింది. ఇప్పటి వరకు పశ్చిమ ఇరాన్‌వైపే కేంద్రీకృతమైన దాడులను ఈశాన్య ప్రాంతానికీ అమెరికా దాడులను విస్తరించింది. తొలిసారి చాబహార్ పోర్టుపై దాడి జరిపింది. అంతేకాదు, సీజ్‌ఫైర్ జరిగినప్పటి నుంచి తొలిసారిగా ఇరాన్ మౌలిక సదుపాయాలను లక్ష్యం చేసుకుని ఎటాక్ చేసింది. ఈ దాడులకు ప్రతిగా ఇరాన్ పశ్చిమాసియాలోని కువైట్, ఖతర్ దేశాల్లోని అమెరికా బేస్‌లపై ఇరాన్ దాడులు చేసింది. జోర్డన్‌పైకీ సుమారు 14 క్షిపణులు ప్రయోగించగా.. వాటిని అడ్డుకున్నట్టు ఆ దేశం వెల్లడించింది. కాగా, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించడానికి మధ్యవర్తులు ఖతర్, పాకిస్తాన్ దేశాలు ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం. అమెరికా, ఇరాన్‌లు సంయమనం పాటించాలని, అవగాహన ఒప్పందాన్ని అమలు చేయాలని కోరాయి.

భారత్‌కు కీలకమైన చాబహార్‌పై దాడి

ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడిగా ఇరాన్‌పై మొదలుపెట్టిన దాడులు.. తొలుత ప్రభుత్వ మార్పు.. ఆ తర్వాత హోర్ముజ్ జలసంధి రక్షణ కోసం జరిగే దాడులుగా మారిపోయాయి. ఈ దాడులు చాలా వరకు పశ్చిమ ఇరాన్, హోర్ముజ్ జలసంధి చుట్టూనే కేంద్రీకతమయ్యాయి. కానీ, తొలిసారి ఇరాన్ ఈశాన్యం వైపునకూ దాడులను విస్తరించి చాబహార్ పోర్టును టార్గెట్ చేసుకుంది. హోర్ముజ్ జలసంధికి సంబంధం లేని గల్ఫ్ అఖాతంలో అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, భారత్‌ల వైపుండే ఈ పోర్టుపై దాడి చేసింది. చాబహార్ పోర్టు నిర్మాణానికి భారత్ సహాయం చేసింది. అయితే, అమెరికా ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి భారత ఈ ప్రాజెక్టు ప్రత్యక్ష నిర్వహణ నుంచి వైదొలగింది. చాబహార్ ఫ్రీజోన్‌లోని తన వాటాను ఓ స్థానిక ఇరాన్ సంస్థకు బదిలీ చేసింది. ఫలితంగా ఇరాన్‌పై విధించే ఆంక్షల నుంచి భారత్ తప్పించుకుంది. కానీ, చాబహార్‌కు జరిగే నష్టం భారత వ్యూహాత్మక నిర్ణయాలను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. ఆసియా, మధ్యాసియా దేశాలతో వాణిజ్యం చేయాలంటే భారత్ తప్పకుండా పాకిస్తాన్‌ గుండా చేయాల్సి వచ్చేది. పాకిస్తాన్‌తో ఉన్న వైరుధ్యం వల్ల ఇది మనకు మైనస్‌గా మారింది.

ఇరాన్ ప్రతీకార దాడులు

ఆ సమయంలోనే ఇరాన్‌కు చెందిన చాబహార్ పోర్టు నిర్మాణంలో భాగమైంది. ఈ పోర్టు ద్వారా పాకిస్తాన్‌ను టచ్ కాకుండా నేరుగా భారత్ నుంచి అఫ్గానిస్తాన్‌కు సరుకులు సరఫరా చేయవచ్చు. అక్కడి నుంచి మధ్యాసియా దేశాలకు, యూరప్ వరకూ చేరవేయవచ్చు. అంతేకాదు, సీపెక్‌లో భాగంగా పాకిస్తాన్‌ జలాల్లో చైనా గ్వాదర్ పోర్టు నిర్మించింది. ఫలితంగా ఈ గల్ఫ్ జలాల్లో చైనా ఆధిపత్యానికి ప్రయత్నించింది. కానీ, ఈ ఆధిపత్యానికి గండిపెడుతూ గ్వాదర్ పోర్టుకు అభిముఖంగా.. సుమారు 100 కి.మీల దూరంలో చాబహార్ పోర్టు భారత్‌కు వ్యూహాత్మక అస్త్రంగా కలిసి వస్తు్న్నది. ఈ పోర్టు నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే భారత్‌కు వ్యూహాత్మకంగా కీలకంగా మారనుంది. కాబట్టి, చాబహార్ పోర్టుపై అమెరికా దాడి నేరుగా మన దేశానికి సవాల్ విసరకపోవచ్చుగానీ.. భవిష్యత్‌లో మన వ్యూహాత్మక ప్రయోజనాలకు గండిపెట్టే ముప్పు ఉన్నది.

ఇరాన్‌లోని ఏకైక పౌర వినియోగ అణు కేంద్రంపై అమెరికా దాడి చేసినట్టు ఇరాన్ పేర్కొంది. ఈ అణు విద్యుత్ కేంద్రం ఇరాన్‌లోని సుమారు 20 మిలియన్ల ఇళ్లకు విద్యుత్ అందిస్తున్నది. ఈ అణు విద్యుత్ కేంద్రం సరిహద్దు ప్రాంతంపై దాడి జరిగిందని, అయితే, అణు విద్యుత్ కేంద్రానికి నష్టం జరగలేదని ఇరాన్ వెల్లడించింది. కాగా, అమెరికా జరిపిన దాడుల్లో 14 మంది మరణించినట్టు ఇరాన్ ఆరోగ్య శాఖ పేర్కొంది. అణ్వాయుధం కారణంతో మొదలైన ఈ యుద్ధం నేడు హోర్ముజ్ జలసంధిని నియంత్రణలోకి తీసుకునే లక్ష్యం వైపు మళ్లింది. హోర్ముజ్‌లో యుద్ధానికి ముందటి పరిస్థితులు ఎప్పటికీ ఉండబోవని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చి స్పష్టం చేశారు. ఇరాన్‌కు సమీపంగా ఉండే మార్గాల్లోనే నౌకలు వెళ్లాలని ఇరాన్ డిక్టేట్ చేస్తుండగా.. ఒమన్ సమీపంగా వెళ్లే మార్గాన్ని అమెరికా తన నియంత్రణలో ఉంచుకుంది. హోర్ముజ్‌లోని నౌకలపై జరిగిన దాడులతో ఇరాన్‌పై అమెరికా ఎటాక్ చేయడం మొదలుపెట్టింది.

భారత వ్యూహాత్మక ప్రయోజనాలపై ప్రభావం

ఈ దాడులు మరింత తీవ్రమవుతాయి: ట్రంప్ వార్నింగ్

హోర్ముజ్‌లో ఇరాన్ దాడి చేసిన ప్రతిసారి అంతకు మించి, తీవ్రంగా ప్రతిదాడులు జరుగుతాయని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ చేసిన ప్రతి ఒక్క దాడికి.. 20 రెట్లు దాడులు ఎదుర్కొవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తాము చేసిన దాడులతో ఇరాన్ ఇది వరకే డీల్‌ కోసం వేడుకుంటున్నదనీ, తనకు ఫోన్లు వచ్చాయని వివరించారు.

చాబహార్ పోర్టుపై దాడి భారత వ్యూహాత్మక ప్రయోజనాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించడానికి ఖతర్, పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేస్తున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.