
నిస్వార్థ ప్రేమకు ప్రతీక అయిన తల్లి గొప్పతనాన్ని చాటే ‘అమ్మ’ అనే షార్ట్ ఫిల్మ్ మే 11న యూట్యూబ్‌లో విడుదలవుతోంది. భరతనాట్య కళాకారిణి ఇంద్రాణి దావులూరి ప్రధాన పాత్రలో నటించారు.
Key Points
భరతనాట్య కళాకారిణి ఇంద్రాణి దావులూరి ప్రధాన పాత్రలో
మదర్స్ డే సందర్భంగా మే 11న యూట్యూబ్ రిలీజ్
హరీష్ బన్నాయ్ దర్శకత్వం, కేవీ. భరద్వాజ్ సంగీతం
అమ్మ షార్ట్ ఫిల్మ్ విడుదల తేదీ
ఏమీ యాచించని నిస్వార్థ ప్రేమమూర్తి అమ్మ. అలాంటి ఓ తల్లి కథతో సందేశాత్మక తెరకెక్కుతోన్న షార్ట్ ఫిల్మ్ అమ్మ. ప్రముఖ భరతనాట్య కళాకారిణి ఇంద్రాణి దావులూరి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ షార్ట్ ఫిల్మ్ మదర్స్ డే సందర్భంగా మే 11న యూట్యూబ్ లో రిలీజ్ అవుతోంది. ఈ షార్ట్ ఫిల్మ్‌కు కథ, స్క్రీన్ ప్లే అందిస్తూనే హరీష్ బన్నాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. డైలాగ్స్‌ను కూడా సమకూర్చాడు.
అమ్మ అంటే ఆలనా, అమ్మ అంటే ఆప్యాయత, అమ్మ అంటే అనురాగం. అలాంటి అమ్మ విలువను గుర్తిస్తూ ప్రతి ఒక్కరిలో ఆలోచనను రేకెత్తించేలా ఈ షార్ట్ ఫిల్మ్ ఉండబోతున్నట్లు మేకర్స్ చెబుతోన్నారు.
ఇంద్రాణి దావులూరి ప్రధాన పాత్ర
ఈ షార్ట్ ఫిల్మ్‌లో ఇంద్రాణి దావులూరి అమ్మ పాత్రలో కనిపించబోతున్నది. ఆమె నటన హైలైట్‌గా ఉండబోతున్నట్లు చెబుతోన్నారు. నిస్వార్థంగా తన కుటుంబాన్ని, పిల్లలను ప్రేమించే ఓ తల్లి జీవితాన్ని మనసులు కదిలించేలా హృద్యంగా ఈ షార్ట్ ఫిల్మ్‌లో చూపించబోతున్నట్లు ఇంద్రాణి దావులూరి చెప్పింది.
డైరెక్టర్ హరీష్ బన్నాయ్ మాట్లాడుతూ, “మనకి కష్టం వస్తే కన్నీరు కార్చే అమ్మకే బాధ కలిగిస్తే ఆమె పడే ఆవేదన ఎలా ఉంటుంది? కొవ్వొత్తిలా కరిగి మనకు దారి చూపించే అమ్మకు మనం ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం? అనే కాన్సెప్ట్ తో ఈ షార్ట్ ఫిల్మ్‌ను రూపొందించినట్లు పేర్కొన్నారు. అమ్మ గొప్పతనాన్ని, త్యాగాన్ని తెలియజేస్తూ ఎమోషనల్ సాగుతుంది.” అని తెలిపారు.
కథాంశం మరియు సినిమాటోగ్రఫీ
అమ్మ షార్ట్ ఫిల్మ్‌లో ఇంద్రాణి దావులూరితో పాటు సాంబి, సుధా కొండపు, రీనా బొమ్మసాని కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. కేవీ. భరద్వాజ్ సంగీతం అందించిన ఈ ఫార్ట్ ఫిల్మ్‌కు కార్తీక్ కళ్లూరి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.
ఇంద్రాణి దావులూరిప్రధాన పాత్రలో నటించిన అందెల రవమిది సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. నాట్యం ప్రధానంగా తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్ కు ముందే పలు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకుంది. విక్రమ్, తనికెళ్లభరణి, ఆదిత్య మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ మూవీని ఇంద్రాణి దావులూరి స్వయంగా నిర్మిస్తోంది. గతంలో యామిని శర్మ పేరుతో తెలుగు, మలయాళ భాషల్లో పలు సినిమాలు చేసింది ఇంద్రాణి దావులూరి.
మదర్స్ డే సందర్భంగా విడుదలవుతున్న ఈ షార్ట్ ఫిల్మ్, తల్లి ప్రేమను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవడానికి ప్రేరేపిస్తుంది. ఇంద్రాణి దావులూరి అద్భుతమైన నటనతో ఈ చిత్రం ఆకర్షణీయంగా ఉంటుందని అంచనా.


