
📌 Key Points
- పోదనూర్-ధన్‌బాద్ మధ్య నడిచే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్తుంది.
- ఈ రైలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలను కలుపుతుంది.
- ఈ ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్, జనరల్ బోగీలతో పాటు దివ్యాంగుల కోసం ప్రత్యేక కోచ్‌లు ఉన్నాయి.
- కోయంబత్తూరు, రేణిగుంట, విజయవాడ, రాజమండ్రి సహా పలు స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.
ఆంధ్రప్రదేశ్ మీదుగా పోదనూర్ నుండి ధన్‌బాద్ వరకు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నడుస్తుంది. ఈ రైలు సర్వీసు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా మరియు జార్ఖండ్ రాష్ట్రాలను కలుపుతూ ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రూట్ మ్యాప్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ రాకపోకలు సాగించనుంది. పోదనూర్ (కోయంబత్తూరు) – ధన్‌బాద్ మధ్య ప్రకటించిన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ను బుధవారం ప్రారంభించారు.ఈ అమృత్ భారత్ ట్రైన్ సర్వీస్….. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా మరియు జార్ఖండ్ రాష్ట్రాలను అనుసంధానం చేస్తోంది.
పోదనూర్ (కోయంబత్తూరు) – ధన్‌బాద్ మధ్య ప్రకటించిన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ టైమింగ్స్, హాల్డింగ్ స్టేషన్ల వివరాలను రైల్వేశాఖ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.
స్టేషన్లలో హాల్టింగ్ వివరాలు
పోదనూర్ (కోయంబత్తూరు) – ధన్‌బాద్ (ట్రైన్ 16619) శనివారం ఉదయం 6.15 గంటలకు బయల్దేరుతుంది. 06:30 నిమిషాలకు కోయంబత్తూర్ స్టేషన్ కు చేరుకుంటుంది. మధ్యాహ్నం 15:05 నిమిషాలకు ఏపీలోని రేణిగుంట స్టేషన్ కు చేరుకుంటుంది.అంతేకాకుండా నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, ఝార్సుగూడ మీదుగా ధన్ బాద్ చేరుకుంటుంది. ఇక ధన్ బాద్ – పోదనూర్ (ట్రైన్ నెంబర్ 16620) మధ్య నడిచే అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ బుధవారం తేదీల్లో అందుబాటులో ఉంటుంది.
ఈ అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో 8 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 11 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు, 1 పాంట్రీ కార్ (ఆహార సదుపాయం), సెకండ్ క్లాస్ కోచ్‌లు (దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా రూపొందించినవి) ఉంటాయి.
రైలులో ప్రయాణ సౌకర్యాలు
కోయంబత్తూరు, తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్‌పేట, కాట్పాడి, తిరుత్తణి, రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, సింహాచలం నార్త్, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, రాయఘడ్, మునిగుడ, రాంఛీ, మురి, బోకారో స్టీల్ సిటీ, చంద్రాపుర స్టేషన్లలో హాల్టింగ్ ఉంటుంది. ఇక ఈ ట్రైన్ స్టాపేజీ టైమింగ్స్ కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే నోటిఫై చేయనున్నట్లు రైల్వేశాఖ ఓ ప్రకటన ద్వారా పేర్కొంది.
సాధారణ ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ రైళ్లలో స్లీపర్ క్లాస్ బోగీలు, జనరల్ బోగీలు, ఛార్జింగ్ పాయింట్లు, బయోటాయిలెట్లు, సీసీటీవీ కెమెరాలు వంటి ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు పేద, మధ్యతరగతి ప్రయాణికులకు తక్కువ టికెట్ ధరతో అధునాతన సౌకర్యాలతో కూడిన ప్రయాణం… ఈ అమృత్ భారత్ ట్రైన్ ద్వారా పొందొచ్చు.
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ పేద మరియు మధ్యతరగతి ప్రయాణికులకు తక్కువ ధరలో మంచి ప్రయాణ అనుభూతిని అందించడానికి రూపొందించబడింది. ఛార్జింగ్ పాయింట్లు, బయోటాయిలెట్లు వంటి సౌకర్యాలు ఉన్నాయి.


