|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నవీన్ పొలిశెట్టి ‘రాజు’ మూవీ కలెక్షన్ల సునామీ! రెండు రోజుల్లో రికార్డు బ్రేకింగ్ వసూళ్లు!!

Published: 16-01-2026, 5:00 AM
నవీన్ పొలిశెట్టి 'రాజు' మూవీ కలెక్షన్ల సునామీ! రెండు రోజుల్లో రికార్డు బ్రేకింగ్ వసూళ్లు!!
  • నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ మూవీ సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్!
  • రెండు రోజుల్లో రూ.41 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన ‘అనగనగా ఒక రాజు’!
  • మొదటి రోజు కలెక్షన్స్: ఏకంగా రూ.20 కోట్లకు పైగా వసూళ్లు!
  • మీనాక్షి చౌదరి ఫిమేల్ లీడ్ రోల్‌లో అదరగొట్టిన ‘అనగనగా ఒక రాజు’ మూవీ!

టాలీవుడ్ సెన్సేషన్ నవీన్ పొలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.

నవీన్ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్!

టాలీవుడ్ హీరో న‌వీన్ పొలిశెట్టి (Naveen Polishetty) న‌టించిన తాజా చిత్రం అన‌గ‌న‌గా ఒక రాజు (Anaganaga Oka Raju). ఈ సినిమాకు మారి(Mari) ద‌ర్శ‌క‌త్వం వ‌హించగా.. సితార ఎంట‌ర్‌టైన్ మెంట్స్ నిర్మించింది. ఇక ఈ మూవీలో మీనాక్షి చౌదరి(Meenakshi Choudary) ఫిమేల్ లీడ్ రోల్‌లో కనిపించింది. మిక్కీ జే మేయర్‌ సంగీతం అందించిన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా.. జ‌న‌వరి 14న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.

దీంతో కలెక్షన్స్(Anaganaga Oka Raju Collection) కూడా అదే రేంజ్‌లో రాబడుతోంది ఈ సినిమా. మొదటి రోజు ఏకంగా రూ.20 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టగా.. రెండు రోజుల్లో ఏకంగా రూ.41 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది ఈ మూవీ. ఇక ఈ విషయాన్ని మూవీ టీమ్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.

రెండు రోజుల్లో భారీ వసూళ్లు!

సంక్రాంతి విన్నర్ ‘అనగనగా ఒక రాజు’!

నవీన్ పొలిశెట్టి సినిమా కలెక్షన్ల ఊచకోత కొనసాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.