|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ పెళ్లి: వదిన వచ్చేసింది! ఆనంద్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Published: 27-02-2026, 4:35 AM
విజయ్ పెళ్లి: వదిన వచ్చేసింది! ఆనంద్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్ వైరల్!
  • విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో జరిగింది.
  • ఆనంద్ దేవరకొండ తన సోదరుడి పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
  • రష్మికను వదినగా పొందినందుకు ఆనంద్ సంతోషం వ్యక్తం చేశారు.
  • గీతాగోవిందం సినిమాతో విజయ్, రష్మికల మధ్య ప్రేమ చిగురించింది.

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ వెడ్డింగ్ ఎట్టకేలకు జరిగింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

విజయ్, రష్మికల వివాహం

Anand Devarakonda: టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ వెడ్డింగ్ విరోష్ వెడ్డింగ్ ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. రష్మిక మందన్న (Rashmika Mandanna) విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉంటూ వీరి ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంతో ఒకటి చేశారు. ఫిబ్రవరి 26వ తేదీ ఉదయ్ పూర్ ఐటీసీ మోమోంటోస్ రిసార్ట్ లో వీరి వివాహపు వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు, అభిమానులు ఈ జంటకు అభినందనలు తెలియచేస్తున్నారు.

రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లి బంధంతో ఒకటి కావడంతో విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) ఈ పెళ్లి ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది రష్మిక విజయ్ దేవరకొండతో ఆనంద్ దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. ఎన్నోసార్లు బయటకు వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ తనని ఒకటే ప్రశ్న వేసేవారు. ‘వదిన ఎలా ఉన్నారు?’ అంటూ అలా అడిగినప్పుడు ఎలాంటి సమాధానం చెప్పాలో తెలియక చాలా ఇబ్బంది పడ్డాను కానీ ఈరోజు మా అన్నయ్య పెళ్లి చేసుకున్నాడు. ఎంతో దయగల, పాజిటివ్ గా ఉండే వ్యక్తి నాకు వదినగా వచ్చింది. వాళ్ళిద్దరూ జీవితాంతం ఇలాగే నవ్వుతూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ఆనంద్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

ఆనంద్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్

ఆనంద్ దేవరకొండ రష్మిక గురించి తెలియజేస్తూ ఆమెను వదిన అంటూ పిలవడంతో విజయ్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండ అభిమానులు కూడా రష్మికను వదిన అంటూ పిలుస్తున్న విషయం తెలిసిందే. ఇన్ని రోజులు విజయ్ దేవరకొండ రష్మిక రిలేషన్ గురించి ఎన్నో రకాల రూమర్లు బయటకు వచ్చాయి అయితే ఆ రూమర్లను నిజం చేస్తూ ఈ జంట పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇక విజయ్ దేవరకొండ రష్మిక మొదటిసారి గీతాగోవిందం సినిమా సమయంలోనే కలవడం ఈ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిన సంగతి తెలిసిందే.

వదినగా రష్మికపై ఆనంద్ కామెంట్స్

ఇక ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో మరోసారి వీరిద్దరూ జంటగా డియర్ కామ్రేడ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అప్పటినుంచి వీరిద్దరి రిలేషన్ పై ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి. ఇలా వీరి రిలేషన్ పైకి ఎన్ని రూమర్లు వచ్చినా స్పందించని ఈ జంట ఏకంగా పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఈ దంపతులు జీవితాంతం ఇలా ఎంతో సంతోషంగా గడపాలంటూ అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా వీరి పెళ్లి ఫోటోల పై స్పందిస్తూ అభినందనలను తెలియజేస్తున్నారు. ఫిబ్రవరి 26వ తేదీ పెళ్లి చేసుకున్న ఈ జంట మార్చి 4వ తేదీ ఘనంగా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ రిసెప్షన్ వేడుకలో భాగంగా పలువురు సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కూడా హాజరు కాబోతున్నారు.

మొత్తానికి విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లితో ఇరువురి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆనంద్ దేవరకొండ చేసిన పోస్ట్ వైరల్ అవ్వడంతో ఈ వార్త మరింత ట్రెండింగ్‌లోకి వచ్చింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.