
మలయాళ సినిమా నటి అనంతిక సనీల్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు ‘మ్యాడ్’ సినిమాతో పరిచయమైంది. తన నటనతో పాటు, కరాటే, నృత్యం వంటి విభిన్న ప్రతిభలతో ఆకట్టుకుంటున్న ఆమె రాజకీయాలపైనా ఆసక్తి చూపుతోంది.
Key Points
అనంతిక సనీల్ కుమార్ కరాటే బ్లాక్ బెల్ట్ హోల్డర్.
మొహినియాట్టం, కలరిపట్టు నేర్చుకుంది.
బయో టెక్నాలజీ చదివి, ప్రస్తుతం లా కోర్స్ చదువుతుంది.
35 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించాలని ఆమె ఆశ.
అనంతిక సనీల్ కుమార్ యొక్క బహుముఖ ప్రతిభ
Ananthika Sanilkumar : కొంతమంది సినీ సెలబ్రిటీలకు నటనతో పాటు వేరే విద్యల్లో కూడా ప్రవేశం ఉంటుంది. తాజాగా హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్ కి చాలా రంగాల్లో ప్రవేశం ఉందని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. మ్యాడ్ సినిమాతో తెలుగులో ఫేమ్ తెచ్చుకుంది మలయాళీ భామ అనంతిక. ఆ తర్వాత వేరే భాషల్లో లాల్ సలాం, రైడ్ సినిమాల్లో కనిపించింది. ఇప్పుడు తెలుగులో ఫిమేల్ ఓరియెంటెడ్ కథతో 8 వసంతాలు అనే సినిమాతో రాబోతుంది.
ఫణింద్ర నర్శెట్టి దర్శకత్వంలో అనంతిక మెయిన్ లీడ్ గా తెరకెక్కుతున్న 8 వసంతలు సినిమా జూన్ 20న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు అనంతిక మీడియాతో మాట్లాడుతూ తన గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపింది.
రాజకీయాల్లోకి ప్రవేశించాలనే ఆమె ఆశ
Also See : Ananthika Sanilkumar : అనంతిక.. పద్దతిగా, క్యూట్ గా లేటెస్ట్ ఫొటోలు..
అనంతిక ఆల్రెడీ కరాటేలో బ్లాక బెల్ట్ తీసుకుంది. మలయాళం ఫేమస్ డ్యాన్స్ మొహినియాట్టం కూడా నేర్చుకొని పలు ప్రదర్శనలు ఇచ్చింది. కేరళ మార్షల్ ఆర్ట్స్ కలరిపట్టు కూడా నేర్చుకుంది. ఇలా మూడు డిఫరెంట్ విద్యలు నేర్చుకోవడమే కాక చదువులో బయో టెక్నాలజీ చదివింది. అంతే కాకుండా ఇప్పుడు లా కోర్స్ చదువుతుంది. ఓ 35 ఏళ్ళు వచ్చాక రాజకీయాల్లోకి వస్తానని, అదే తన డ్రీమ్ అని, అందుకే లా కోర్స్ చదువుతున్నాను అని తెలిపింది అనంతిక.
సినిమా ప్రస్థానం నుంచి రాజకీయాల వరకు
ఇక అనంతిక అసలు సినిమాలోకి వద్దామనుకోలేదట. అనుకోకుండా ఓ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ గా ఛాన్స్ రావడంతో వెళ్తే అక్కడ కెమెరామెన్ చూసి నటిగా ట్రై చేయమన్నాడట. అప్పట్నుంచి ట్రై చేయడంతో వచ్చిన మంచి అవకాశాలు సెలెక్ట్ చేసుకుంటుంది అని తెలిపింది.
అనంతిక సనీల్ కుమార్ అనేక రంగాలలో తన ప్రతిభను చాటుకుంటూ, సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ తన సత్తా చాటాలని ఆశిస్తున్నారు. ఆమె భవిష్యత్తు కెరీర్ చూడటానికి ఆసక్తికరంగా ఉంది.


