|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పట్టు చీరలో మహారాణిని తలపిస్తున్న పవన్ కళ్యాణ్ బ్యూటీ.. ఎట్లా పుట్టావు ఇంత అందంగా అంటూ కామెంట్స్

Published: 17-07-2025, 3:22 AM
పట్టు చీరలో మహారాణిని తలపిస్తున్న పవన్ కళ్యాణ్ బ్యూటీ.. ఎట్లా పుట్టావు ఇంత అందంగా అంటూ కామెంట్స్

వకీల్ సాబ్ సినిమాతో పరిచయమైన యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ళ తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పట్టుచీరలో మెరిసిపోయిన ఆమె అందం అందరినీ ఆకట్టుకుంది.

Key Points

1

అనన్య నాగళ్ళ ఇన్‌స్టాగ్రామ్‌లో పట్టుచీరల ఫోటోలు వైరల్

2

మూడు రకాల పట్టుచీరల్లో అందంగా కనిపించింది

4

వకీల్ సాబ్ సినిమాతో పరిచయం, ఇతర సినిమాల వివరాలు

అనన్య నాగళ్ళ వైరల్ ఫోటోలు

యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల(Ananya Nagalla) మనందరికీ సుపరిచితమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన ‘వకీల్ సాబ్’(Vakeel Saab) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు ఫస్ట్ మూవీనే మంచి ఫేమ్ తెచ్చిపెట్టింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిలో నటిస్తూ మెప్పిస్తుంది. అంతేకాకుండా హీరోయిన్‌గా కూడా రాణిస్తోంది. అలా గత ఏడాది ‘తంత్ర’(Tantra), ‘పొట్టేల్’(Pottel), ‘శ్రీకాకుళం షెర్లాక్ హోల్మ్స్’(Srikakulam Sherlock Holmes), ‘డార్లింగ్’(Darling) వంటి సినిమాల్లో నటించి అలరించింది. ప్రస్తుతం ఒకటి రెండు ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతోంది.

పట్టుచీరలో అందంగా కనిపించిన అనన్య

అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అంద చందాలతో అదరహో అనిపిస్తుంది. అంతేకాకుండా తన పర్సనల్ లైఫ్ విషయాలను, సినిమాలకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో అనన్య పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ఈ బుట్టబొమ్మ తన ఇన్‌స్టా(Instagram)లో కొన్ని శారీ పిక్స్ షేర్ చేసింది. అందులో బ్లాక్, గ్రీన్, రెడ్ కలర్ ఉన్న 3 చీరలు కట్టుకొని దర్శనమిచ్చింది. ట్రెడిషనల్‌గా రెడీ అయి మహారాణిలా అనిపించింది. ఇక వాటికి ‘మీ గర్ల్ 3 వేర్వేరు చీరల్లో ఉంది.. ఇందులో మీకు ఏది ఎక్కువ నచ్చింది’ అంటూ రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు ఇంత అందంగా ఎలా పుట్టావే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

నెటిజన్ల ప్రశంసలు, కామెంట్లు

A post shared by Ananya nagalla (@ananya.nagalla)

అనన్య నాగళ్ళ అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తన సినిమా ప్రస్థానంతో పాటు, సోషల్ మీడియాలో కూడా అభిమానులతో దగ్గరగా ఉంటూ ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.