
పచ్చళ్ల వ్యాపారంతో అక్క అలేఖ్య ఫేమస్ అయితే.. ఫిట్‌నెస్ వీడియోలతో చెల్లి రమ్య పాపులర్ అయింది. బిగ్‌బాస్‌లో వైల్డ్‌కార్డ్‌గా అడుగుపెట్టిన రమ్య మోక్ష కేవలం రెండు వారాల్లోనే ఎలిమినేట్ అవడం చర్చనీయాంశంగా మారింది. తనుజను టార్గెట్ చేయడం, బంధాలు పెట్టుకోకపోవడం ఆమె నిష్క్రమణకు ప్రధాన కారణాలు. మరి ఆమె బిగ్‌బాస్‌లో ఎంత సంపాదించిందో చూద్దాం.
Key Points
రమ్య మోక్ష బిగ్‌బాస్ వైల్డ్‌కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చి కేవలం రెండు వారాల్లోనే ఎలిమినేట్ అయ్యింది.
హౌస్‌లో బంధాలు పెట్టుకోకపోవడం, తనుజను టార్గెట్ చేయడం ఆమె నిష్క్రమణకు ప్రధాన కారణాలు.
కల్యాణ్, తనుజపై నోరు జారడం, అతి ఆటిట్యూడ్ చూపించడంతో బయట నెగెటివిటీ పెరిగింది.
గేమ్‌పై కాకుండా తనుజపై ఎక్కువ ఫోకస్ చేయడం ఆమె ఎలిమినేషన్‌కు దారితీసింది.
నో ట్రాక్స్, నో బాండ్స్: బిగ్‌బాస్ వ్యూహం బెడిసికొట్టింది
పచ్చళ్ల వ్యాపారంతో అక్క అలేఖ్య ఫేమస్ అయితే.. ఫిట్‌నెస్ వీడియోలతో చెల్లి రమ్య పాపులర్ అయింది. పైగా వర్కవుట్స్ అంటూ గ్లామర్ వీడియోలు షేర్ చేయడంతో ఓ పక్క తిడుతూనే ఆమెను ఫాలో అయ్యారు చాలామంది. సోషల్ మీడియాలో విపరీతైమన నెగిటివిటీ తెచ్చుకున్న రమ్యకు బిగ్‌బాస్ ఛాన్స్ వచ్చింది. కెరీర్ మీద ఫోకస్ పెట్టమన్నారుగా.. వచ్చేస్తున్నా అంటూ వైల్డ్‌కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చింది. కానీ రెండువారాల్లోనే ఎలిమినేట్ అయింది. అందుకు గల కారణాలేంటో చూసేద్దాం..
నో ట్రాక్స్ బిగ్‌బాస్ హౌస్‌లో బంధాలు పెట్టుకోవడానికి రాలేదంది రమ్య . అన్నట్లుగానే ఫేక్ రిలేషన్స్, లవ్ ట్రాకుల జోలికి వెళ్లలేదు. కానీ ఇది ఒకరకంగా ఆమెకు మైనసే అయింది. ఎందుకంటే ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న సంజనా సేవ్ అవడానికి కారణం.. ఇమ్మాన్యుయేల్‌తో తనకున్న బంధమే! ఇమ్మూ నామినేషన్స్‌లో లేడు కాబట్టి అతడి ఓట్లన్నీ ఆమెకు వేశారు. అలా సంజనా సేవ్ అయింది.
స్వయంకృతాపరాధం: తనుజ టార్గెట్, నెగెటివిటీ
అదే ముఖ్య కారణం రమ్య ( Ramya Moksha ) ఎలిమినేషన్‌కు ఆమె స్వయంకృతాపరాధం ముఖ్య కారణం. తను వచ్చీరావడంతో కుంభస్థలాన్ని కొట్టాలనుకుంది. తనూజ, కల్యాణ్‌లపై నోటికొచ్చినట్లు మాట్లాడింది. తనపై కల్యాణ్ చెయ్యేస్తే కిందపడేసి తొక్కుతానంది. తనూజను స్ట్రాంగ్ పాయింట్స్‌తో నామినేట్ చేసింది. కానీ చెప్పే విధానం సరిగా లేదు, హద్దులు దాటి మాట్లాడటంతో అది తనూజకే ప్లస్ అయింది. పైగా ఓసారి.. పక్కకెళ్లి ఆడుకోపో అని తనూజకు టిష్యూ పేపర్‌పై రాసివ్వడం చూసేవారికి కాస్త ఓవర్‌గా అనిపించింది.
అది మర్చిపోతే ఎలా? తనూజ ( Thanuja Puttaswamy ) ఎలిమినేషనే టార్గెట్‌గా పెట్టుకుంది. కానీ, తనూజను కిందకు లాగాలంటే ముందు తాను హౌస్‌లో ఉండాలన్న విషయం మర్చిపోయింది. ఇప్పటికే బయటున్న నెగెటివిటీ చాలదన్నట్లు తనూజ- కల్యాణ్‌లపై నోరు జారడం.. దాన్ని నాగార్జున తప్పుపట్టినా మరేం పర్లేదన్నట్లుగా ప్రవర్తించడం, హైపర్ ఆది వచ్చినప్పుడు కూడా కాస్త యాటిట్యూడ్ చూపించడంతో విపరీతమైన నెగెటివిటీ మూటగట్టుకుంది. గేమ్‌పై కన్నా తనూజపైనే ఎక్కువ ఫోకస్ చేసి.. ఆమెను ఢీ కొట్టాలని చూసి బొక్కబోర్లాపడింది.
బిగ్‌బాస్‌లో రమ్య మోక్ష రెమ్యునరేషన్ వివరాలు
రెమ్యునరేషన్ ఇలా పదేపదే తనూజను టార్గెట్ చేయడం ఆమె అభిమానులకు అస్సలు నచ్చలేదు. ఇంకేముంది, నామినేషన్స్‌లో ఎవరు బలహీనంగా ఉంటారో వారికి ఓట్లు గుద్ది.. రమ్యను డేంజర్ జోన్‌లో పడేశారు. నామినేషన్స్‌లో తప్ప గేమ్‌లో పెద్దగా కనిపించలేదు. దీంతో రమ్య మోక్ష ఎలిమినేట్ అయింది. ఆమెకు వారానికి రూ.1.50 -2 లక్షల మేర పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన రెండువారాలకుగానూ దాదాపు రూ.4 లక్షల మేర రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం.
బిగ్‌బాస్ హౌస్‌లో రమ్య మోక్ష ప్రయాణం వ్యూహాత్మక లోపాలను స్పష్టం చేసింది. బంధాల కన్నా వివాదాలపై దృష్టి పెట్టడం ఆమె ఎలిమినేషన్‌కు దారితీసింది. అతి తక్కువ సమయంలోనే ప్రస్థానం ముగియడంతో, బిగ్‌బాస్‌లో ఆమె సంపాదన కూడా పరిమితమే అయ్యింది.


