|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అక్కినేని హీరో ‘లెనిన్’ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో చిందులేయనున్న బాలీవుడ్ బ్యూటీ.. వద్దు బాబోయ్ అంటున్న నెటిజన్లు

Published: 01-06-2025, 9:17 AM
అక్కినేని హీరో ‘లెనిన్’ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో చిందులేయనున్న బాలీవుడ్ బ్యూటీ.. వద్దు బాబోయ్ అంటున్న నెటిజన్లు

బాలీవుడ్ నటి అనన్య పాండే తాజాగా అక్కినేని అఖిల్ నటించే ‘లెనిన్’ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో కనిపించనుందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ విషయంపై వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

Key Points

1

అనన్య పాండే ‘లెనిన్’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు వార్తలు

2

అఖిల్ హీరోగా నటిస్తున్న ‘లెనిన్’ సినిమా రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుంది

4

అనన్య పాండే స్పెషల్ సాంగ్‌కు నెటిజన్ల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతోంది

అనన్య పాండే స్పెషల్ సాంగ్

బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Pandey)‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ (Student of the Year)చిత్రంతో ఇండస్ట్రీకి వచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి అనతి కాలంలోనే ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. తెలుగులో ‘లైగర్’ మూవీలో నటించింది.. కానీ అంతగా కలిసి రాలేదు. దీంతో మళ్లీ బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది. ఇక ఇటీవల కంట్రోల్, కేసరి చాప్టర్-2 (Kesari Chapter-2)వంటి చిత్రాలతో వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, అనన్య పాండే ఓ బంపర్ ఆఫర్ అందుకున్నట్లు సమాచారం. అక్కినేని అఖిల్(Akhil) నటిస్తున్న ‘లెనిన్’(Lenin) సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు సమాచారం.

మురళీ కిషోర్ అబ్బూరి (Murali Kishore Abburi)దర్శకత్వం వహిస్తుండగా.. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై అక్కినేని హీరో నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ సినిమాలో డీ గ్లామరస్ లుక్‌‌లో కనిపించనున్నాడు. ఇక ఇందులో అఖిల్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో అనన్య స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు అస్సలు వద్దు అని అంటున్నారు నెటిజన్లు.

లెనిన్ సినిమా వివరాలు

నెటిజన్ల ప్రతిస్పందన

అనన్య పాండే ‘లెనిన్’లో స్పెషల్ సాంగ్ చేయడంపై నెటిజన్ల అభిప్రాయాలు వ్యతిరేకంగా ఉన్నాయి. సినిమా విడుదల తర్వాత ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.