
📌 Key Points
- మంచు విష్ణు-మనోజ్ మధ్య కుటుంబ తగాదాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.
- మనోజ్ ఇటీవల ఒక సినిమా ఈవెంట్‌లో విష్ణుకు పరోక్షంగా గట్టి కౌంటర్ ఇచ్చారు.
- ఒకరిని కష్టపెట్టి ఎదిగితే కర్మ వదలదని మనోజ్ వ్యాఖ్యానించారు.
- మనోజ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మంచు సోదరులు విష్ణు, మనోజ్ మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఇటీవల ఒక ఈవెంట్‌లో పాల్గొన్న మంచు మనోజ్, తన అన్న విష్ణును ఉద్దేశిస్తూ పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కర్మ సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తూ, ఒకరిని కష్టపెట్టి ఎదగాలని కోరుకునే వారిని కర్మ వదిలిపెట్టదని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
మంచు కుటుంబంలో మరోసారి విభేదాలు: నేపథ్యం
మంచు ఫ్యామిలీలో గత కొద్ది కాలంగా గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. మంచు వారసులు విష్ణు(vishnu), మనోజ్(manoj) ఆస్తుల కారణంగా ఒకరిపై ఒకరు దాడి కూడా చేసుకున్నారు. అంతేకాకుండా వీరిద్దరు కేసులంటూ పోలీస్ స్టేషన్లకు దాకా వెళ్లారు. ఈక్రమంలోనూ మంచు మనోజ్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. తన భార్య ఇద్దరు పిల్లలతో రోడ్డున పడ్డాడు. దీంతో ఆయన అభిమానులు సాయం చేయడంతో తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటూనే అన్నతో గొడవలకు దిగాడు. వీరిద్దరు గత కొద్ది కాలంగా పలు ఈవెంట్స్‌లో పాల్గొన్న సమయాల్లో కౌంటర్లు వేసుకుంటున్నారు. గతంలో ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఇటీవల కాస్త గొడవలు తగ్గడంతో మంచు కుటుంబం కలిసిపోయారని అంతా భావించారు.
విష్ణుకు మనోజ్ పరోక్ష కౌంటర్: అసలేం జరిగింది?
ఈక్రమంలో.. తాజాగా, మంచు మనోజ్ ఓ సినిమా ఈవెంట్‌లో పాల్గొని విష్ణుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ‘‘దేవుడా సైన్సా అని ఉంటుంది. మన దేవుళ్లు, మన పురాన కథలు రామాయణం తీసుకుంటే.. 7100 సంవత్సరాలకు ముందు వాల్మికి గారు రాసిన రామయణంలో చాలా వెర్షన్స్ వచ్చాయి. కానీ నేను మాత్రం ఫస్ట్ వెర్షన్ గురించి మాట్లాడుతున్నాను. దాంట్లో చాలావరకు సైన్స్‌కు సంబంధించిన విషయాలు ఉంటాయి. పుష్పక విమానం, ది ప్యాలెస్ కట్టడానికి కానీ దేవుడి గుడులు కట్టడాన్ని అన్నింటిలో సైన్స్ ఉంది. దేవుడు కనిపించకపోవడానికి కారణం మనలోనే ఉంటాడు అంటారు. ఒకడిని కష్టపెట్టి మనం ఎదగాలి అనుకుంటే మనలో ఉన్న రాక్షసుడు యాక్టివేట్ అవుతాడు. అలాంటి వారిని కర్మ వదిలిపెట్టదు.
“కర్మ సిద్ధాంతం”పై మనోజ్ కీలక వ్యాఖ్యలు
నువ్వు నిద్రపోతున్నా లేదా పడుకున్నా ఆ సమయంలో ఒకడు నిన్ను కొరుక్కుని తినేస్తాడు. పది కోసం నిలబడాలి.. పదిమందికి సాయం చేయాలి అనుకున్నప్పుడు దేవుడు మనతోనే ఉంటాడు ఆశీర్వదిస్తాడు. మీరు పదిమంది కోసం నిలబడితే మీలోనే శివుడు ఉంటాడు. అందుకే బ్రతికుంటే శివం, చనిపోతే శవం అంటారు. ఇదే నేను నేర్చుకున్నది’’ అని అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ పోస్ట్ చూసిన వారంతా విష్ణును ఉద్దేశించి మాట్లాడాడు అని అంటున్నారు.
మనోజ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. మంచు కుటుంబంలో నెలకొన్న ఈ గొడవలపై ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. భవిష్యత్తులో ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.


