|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అనసూయ: ‘మళ్లీ ఇలాంటి అద్భుతమైన అవకాశం దొరికింది’: అనసూయ

Published: 25-07-2025, 11:41 AM
అనసూయ: 'మళ్లీ ఇలాంటి అద్భుతమైన అవకాశం దొరికింది': అనసూయ

టాలీవుడ్ నటి అనసూయ ఇటీవల తన కొత్త ఇంటి గృహప్రవేశం చేసింది. అంతేకాకుండా, తన కుమారుడి ఉపనయనం మరియు ఇద్దరు కుమారులకు సంప్రదాయబద్ధంగా స్నానం చేయించింది. ఈ సందర్భంగా ఆమె తన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంది.

Key Points

1

అనసూయ గృహప్రవేశం చేసింది.

2

కుమారుడికి ఉపనయనం నిర్వహించింది.

4

సంస్కృతి, సంప్రదాయాల ప్రాముఖ్యతను తెలిపింది.

అనసూయ గృహప్రవేశం

టాలీవుడ్ నటి అనసూయ రెండు నెలల క్రితమే నూతన గృహ ప్రవేశం చేసింది . తమ జీవితంలో మరో అధ్యాయం మొదలైందంటూ సోషల్ మీడియా వేదికగా ఫోటోలను షేర్ చేసింది . అంతేకాకుండా తమ కలల సౌధానికి శ్రీరామసంజీవని అని పేరు కూడా పెట్టుకుంది . కొత్తింట్లో సంప్రదాయ పద్ధతిలో హోమాలు, శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం, మరకత ​​లింగ రుద్రాభిషేకం నిర్వహించింది .

కుమారుడి ఉపనయనం

అయితే గృహ ప్రవేశం మరో సంప్రదాయ శుభకార్యం నిర్వహించింది . తన పెద్ద కుమారుడికి ఉపనయనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది . మన ఆధ్యాత్మిక , వైదిక సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుక ఫోటోలను కూడా షేర్ చేసింది . తాజాగా అనసూయ మరో సంప్రదాయం ఉట్టిపడేలా కుమారులిద్దరికీ స్నానాలు చేయించింది . మన సంస్కృతి ప్రతిబింబించేలా ప్రకృతి ఒడిలో కూర్చోబెట్టి నలుగు పెట్టి మరి స్నానం చేశారు . దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది .

సంప్రదాయాల పాటింపు

మన పూర్వీకులు/పెద్దలు మనల్ని అనుసరించమని చెప్పినా సంస్కృతి, సంప్రదాయం , ఆచారాలు పాటించాలని తెలిపింది . మన ఆచారాలను అనుసరించడంలో వచ్చే అపరిమితమైన విలువ, సారాంశం , అర్థం చేసుకుంటే అద్భుతంగా ఉంటుందని పోస్ట్ చేసింది . పిల్లలు పుట్టిన తొలినాళ్లలో ఈ ఆచారాలు పాటించానని తెలిపింది . మరోసారి ఇలాంటి అద్భుతమైన అవకాశం వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తోంది అనసూయ .

అనసూయ తన కుటుంబంతో కలిసి పాటిస్తున్న సంప్రదాయాలు, ఆచారాల గురించి తెలియజేస్తూ, మన సంస్కృతిని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో చాటుకుంది. ఈ ఆచారాల వెనుక ఉన్న అర్థాన్ని అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.