|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అనసూయకు గుడి కట్టిస్తానన్న అభిమాని! టాలీవుడ్‌లో సంచలనం! వైరల్ న్యూస్!

Published: 24-01-2026, 2:35 PM
అనసూయకు గుడి కట్టిస్తానన్న అభిమాని! టాలీవుడ్‌లో సంచలనం! వైరల్ న్యూస్!
  • యాంకర్ అనసూయకు గుడి కట్టనున్న అభిమాని మురళి శర్మ! సంచలన ప్రకటన!
  • కుష్బూ, సమంత తరహాలోనే అనసూయకు గుడి నిర్మాణం ఉంటుందన్న మురళి.
  • గుడి నిర్మాణానికి ప్రభుత్వ సహాయం కోరిన అనసూయ అభిమాన సంఘం అధ్యక్షుడు.
  • సోషల్ మీడియాలో అనసూయపై ట్రోలింగ్ నేపథ్యంలో అభిమాని సంచలన నిర్ణయం!

టాలీవుడ్ యాంకర్ అనసూయ గురించి ఒక సంచలన వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమెకు ఒక అభిమాని గుడి కట్టడానికి సిద్ధమయ్యాడు. అసలు ఈ వార్తకు కారణం ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళ్దాం!

అనసూయకు గుడి కట్టడానికి కారణం ఏంటి?

టాలీవుడ్ స్టార్ నటి, ప్రముఖ యాంకర్ అనసూయ గురించి నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. నటుడు శివాజీ చేసిన కామెంట్ల తర్వాత అనసూయ గురించి పంచాయతీ కొనసాగుతోంది. ఇలాంటి నేపథ్యంలో యాంకర్ అనసూయ కోసం గుడి కట్టబోతున్నట్లు సంచలన ప్రకటన వచ్చింది. ఈ ప్రకటన చేసింది ఎవరో కాదు ఆమె అభిమాని అంటూ చెప్పుకునే తిరిగే మురళి శర్మ. నటుడు శివాజీ చేసిన కామెంట్ల నేప‌థ్యంలో అనసూయ భరద్వాజ్ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

మురళి శర్మ ప్రకటన వెనుక అసలు కథ ఏమిటి?

మా శరీరం మా ఇష్టం.. ఎలాంటి బట్టలు వేసుకుంటే నీకేంటి ? నొప్పి అన్న రేంజ్ లో అనసూయ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దీంతో అనసూయ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. కాంగ్రెస్ కు చెందిన‌ ఓ మహిళ నేత కూడా ఫైర్ అయ్యారు. ఈ గ్యాప్ లో అనసూయ అభిమాని అంటూ మురళి శర్మ రచ్చ రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. అనసూయ అభిమాన సంఘం అధ్యక్షుడిని అంటూ చాలా మీడియాలో హైలెట్ అయ్యాడు మురళీ శర్మ. ఇప్పుడు ఆయనే గుడి కడతానని ప్రకటన చేశాడు.

గుడి నిర్మాణం ఎక్కడ? ఎప్పుడు?

ఓ యూట్యూబ్ ఛానల్ కు తాజాగా అనసూయ అభిమాని మురళి శర్మ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా యాంకర్ అనసూయ కోసం గుడి కట్టబోతున్నట్లు వెల్లడించారు. కుష్బూ, సమంతకు ఉన్నట్లుగానే యాంకర్ అనసూయకు కూడా గుడి కడతామన్నారు. అభిమానులందరూ ఏకమై ఓ నిర్ణయానికి వచ్చి ఎక్కడ కట్టాలని దానిపైన నిర్ణయం తీసుకుంటామని కూడా వెల్లడించారు. దీనికి ప్రభుత్వం సహాయాన్ని కూడా ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలోనే మురళి శర్మ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

అనసూయకు గుడి కట్టే విషయం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంపై మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.