|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నా భర్త, పిల్లలు నన్ను జడ్జ్ చేయరు.. ఆ బట్టలు వేసుకుంటే తల్లిగా బిహేవ్ చేయనట్లేనా, అనసూయ బోల్డ్ కామెంట్స్

Published: 30-07-2025, 10:28 PM
నా భర్త, పిల్లలు నన్ను జడ్జ్ చేయరు.. ఆ బట్టలు వేసుకుంటే తల్లిగా బిహేవ్ చేయనట్లేనా, అనసూయ బోల్డ్ కామెంట్స్

యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ తన డ్రెస్సింగ్ స్టైల్ గురించి వచ్చిన విమర్శలపై తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేస్తున్న వారికి ఆమె కౌంటర్ ఇచ్చారు.

Key Points

1

అనసూయ తన డ్రెస్సింగ్ సెన్స్ గురించి విమర్శలకు సమాధానం ఇచ్చింది.

2

ఆమె భర్త, పిల్లలు ఆమెను ఎప్పుడూ జడ్జ్ చేయరని అన్నారు.

4

తనకు నచ్చినట్లుగా బ్రతకడానికి తనకు స్వేచ్ఛ ఉందని అన్నారు.

అనసూయకు వచ్చిన విమర్శలు

నటి, యాంకర్ అనసూయ తరచుగా వార్తల్లో, వివాదాల్లో ఉండడం చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాలో నిత్యం ఏదో విధంగా అనసూయ గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. అనసూయ బుల్లితెర యాంకర్ గా, వెండితెరపై నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తన గ్లామర్ తో అనసూయ ఇంకా పాపులర్ అయింది. సోషల్ మీడియాలో అనసూయకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

అదే సమయంలో అనసూయ వివాదాల్లో కూడా చిక్కుకుంటూ ఉంటుంది. ఆమె డ్రెస్సింగ్ గురించి తరచుగా విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. ఇటీవల సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్ లో కొందరు మహిళలే తనని టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు అని అనసూయ తాజాగా స్పందించింది. తనని, తన డ్రెస్సింగ్ విధానాన్ని విమర్శించే వారికీ అనసూయ సోషల్ మీడియాలో కౌంటర్ ఇస్తూ పోస్ట్ పెట్టింది.

అనసూయ సమాధానం

ఇటీవల నాపై ఎవరు కామెంట్స్ చేస్తున్నప్పటికీ మౌనం వహిస్తున్నాను. కానీ నేను జీవిస్తున్న విధానంపై విమర్శలు పెరిగాయి. దీనితో స్పందించక తప్పడం లేదు. సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో కొందరు నన్ను టార్గెట్ చేస్తూ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. కొందరు మహిళలే నన్ను విమర్శిస్తున్నారు. వాళ్లెవరో నాకు తెలియదు. వారితో నాకు పరిచయం లేదు. అయినప్పటికీ నా వ్యక్తిత్వంపై కామెంట్స్ చేస్తున్నారు. నేను ధరిస్తున్న బట్టల ఆధారంగా నా వ్యక్తిత్వంపై కామెంట్స్ చేస్తున్నారు.

అవును నేను మహిళని, భార్యని, ఇద్దరు పిల్లలకు తల్లిని. నా స్టైల్ కి తగ్గట్లుగా బట్టలు ధరించడాన్ని నేను ఆస్వాదిస్తాను. అందం, స్టైల్, కాన్ఫిడెన్స్ అనేవి నా గుర్తింపులో భాగం అయ్యాయి. నేను ధరిస్తున్న బట్టల ఆధారంగా నేను తల్లిలా బిహేవ్ చెయ్యట్లేదు అని కొందరు విమర్శిస్తున్నారు. వాళ్ళకి నాదొక ప్రశ్న. తల్లి అయితే లైఫ్ లో మిగిలినవి అన్నీ వదిలేయాల్సిందేనా ?

తల్లిగా ఉండటం, స్టైలిష్ గా ఉండటం

నా భర్త, పిల్లలు నన్ను ప్రేమిస్తారు. నాకు సపోర్ట్ చేస్తారు. వాళ్లెప్పుడూ నన్ను జడ్జ్ చేయలేదు. నాకు నచ్చిన బట్టలు ధరిస్తున్నాను అంటే విలువలు కోల్పోయినట్లు కాదు. నాలాగా ఉండమని నేను ఎవ్వరికీ చెప్పను. నాకు నచ్చినట్లు బ్రతికే స్వేచ్ఛ నాకు ఉంది. మీకు నచ్చినట్లు మీరు ఉండండి అంటూ అనసూయ బోల్డ్ కామెంట్స్ చేసింది.

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

తన జీవనశైలికి తనకున్న స్వేచ్ఛను, కుటుంబ సపోర్టును అనసూయ నొక్కి చెప్పింది. తనని అర్థం చేసుకోమని, అందరూ తమకు నచ్చినట్లుగా జీవించాలని ఆమె కోరింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.