|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మీరు బెడ్ పై ప‌డుకుంటారా ? విజయ్ సేతుపతి బోల్డ్ కామెంట్స్ !

Published: 09-11-2025, 8:26 PM
మీరు బెడ్ పై ప‌డుకుంటారా ? విజయ్ సేతుపతి బోల్డ్ కామెంట్స్ !

తమిళ స్టార్ విజయ్ సేతుపతి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ ఆండ్రియా జర్మియాను ఉద్దేశించి “మీరు బెడ్ పై పడుకుంటారా?” అంటూ ఆయన చేసిన బోల్డ్ కామెంట్స్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Key Points

1

విజయ్ సేతుపతి హీరోయిన్ ఆండ్రియాపై బోల్డ్ కామెంట్స్

2

'మాస్క్' సినిమా ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు వైరల్

4

ఆండ్రియా అందాన్ని, యవ్వనాన్ని సేతుపతి ప్రశంసించారు

విజయ్ సేతుపతి సంచలన వ్యాఖ్యలు

దిశ‌, వెబ్ డెస్క్: విజయ్ సేతుపతి ( Vijay Sethupathi).. ఈ పేరు తెలియని వారు ఉండరు. తమిళ స్టార్ హీరో అయినప్పటికీ మన తెలుగులో కూడా విజయ్ సేతుపతి రాణిస్తున్నారు. విలన్ నుంచి హీరో స్థాయి వరకు అన్ని పాత్రలు చేస్తున్నారు విజయ్ సేతుపతి. అయితే అలాంటి విజయ్ సేతుపతి తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. మీరు బెడ్ పైన పడుకుంటారా ? అంటూ హీరోయిన్ ఆండ్రియా జర్మియా ( Andrea Jeremiah)ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆండ్రియా నటించిన మాస్క్ సినిమా ఈ నెల చివరలో రిలీజ్ కానుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ జరగగా, ఇందులో పాల్గొన్న విజయ్ సేతుపతి మాట్లాడారు. హీరోయిన్ ఆండ్రియాను ఉద్దేశించి ప్రశంసల వర్షం కురిపించారు. తాను చిన్నతనంలో బీచ్ లో ఓ విగ్రహాన్ని చూశానని, ఆ తర్వాత ఆండ్రియాను చూసినట్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు ఇప్పటికీ కూడా ఒకేలా కనిపిస్తున్నాయని ప్రశంసించారు. మీరు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారని కామెంట్ చేశారు. నా కొడుకు కూడా మిమ్మల్ని చూసి వావ్ అంటున్నాడని గుర్తు చేశారు. మీరు బెడ్ పైన పడుకుంటారా? ఫ్రిడ్జ్ లో పడుకుంటారా ? అంటూ విజయ్ సేతుపతి కామెంట్ చేశారు. దీంతో అక్కడే ఉన్న ఆండ్రియా తెగ నవ్వేశారు. అటు విజ‌య్ సేతుప‌తి చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి.

ఆండ్రియా అందంపై సేతుపతి ప్రశంసలు

వైరల్ అవుతున్న విజయ్ సేతుపతి కామెంట్స్

విజయ్ సేతుపతి ఆండ్రియా అందాన్ని ప్రశంసిస్తూ, చిన్నతనంలో చూసినట్లుగానే ఇప్పటికీ ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈ బోల్డ్ కామెంట్స్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నవ్వులు పూయించాయి, ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.