|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: మెగా హీరోపై మనసు పారేసుకున్న అనసూయ! పెళ్లై ఉండకపోతే అతనితోనే డేటింగ్ అంటోందా?

Published: 26-03-2026, 7:45 AM
షాకింగ్: మెగా హీరోపై మనసు పారేసుకున్న అనసూయ! పెళ్లై ఉండకపోతే అతనితోనే డేటింగ్ అంటోందా?
  • మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై మనసు పారేసుకున్న అనసూయ భరధ్వాజ్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్.
  • పెళ్లి కాకపోయి ఉంటే రామ్ చరణ్ తో డేటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండేదాన్నని తెలిపిన అనసూయ.
  • గతంలో రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని చాలా సందర్భాల్లో బయటపెట్టిన అనసూయ భరధ్వాజ్.
  • ప్రస్తుతం అనసూయ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అభిమానుల కామెంట్లతో హోరెత్తుతున్నాయి.

టాలీవుడ్ లో హాట్ టాపిక్! యాంకర్ అనసూయ సంచలన వ్యాఖ్యలు చేసింది. మెగా హీరోపై తనకున్న అభిమానాన్ని బయటపెట్టింది. పెళ్లి కాకుండా ఉంటే అతనితో డేటింగ్ చేసేందుకు కూడా సిద్ధమని తెలిపింది. ఆ హీరో ఎవరో తెలుసా?

అనసూయ మనసులో మెగా హీరో ఎవరు?

ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కవగా వినిపించిన పేరు అనసూయ భరధ్వాజ్. వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిందీ బ్యూటీ. బుల్లితెరపై కెరీర్ ను స్టార్ట్ చేసి.. వెండితెరపై వెలుగు వెలుగుతున్న అనసూయ.. తన నటన, అందంతో ఆకట్టుకుంటుంది. జబర్ధస్త్ కామెడీ షో యాంకర్ గా తన ప్రయాణం మొదలు పెట్టి.. స్టార్ యాంకర్ గా చాలా కాలం కొనసాగింది అనసూయ. ఆతరువాత సినిమాల్లో అవకాశాలు సాధించి.. బుల్లితెరకు గుడ్ బై చెప్పింది.

తెలుగు సినిమాల్లో అద్భుతమైన పాత్రలు చేస్తూ వస్తోంది అనసూయ. ఎవరికి రాని డిఫరెంట్ క్యారెక్టర్లు ఆమెకు వచ్చాయి. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త , పుష్పలో దాక్షాయణి పాత్ర.. ఇలా విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తుంది అనసూయ. కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా ప్రధాన పాత్రను పోషించింది అనసూయ. ఈమధ్య కాలంలో ఆమెకు అవకాశాలు తగ్గినట్టు కనిపిస్తోంది.

రామ్ చరణ్ అంటే ఎందుకంత ఇష్టం?

ఉన్నది ఉన్నట్టు..ముక్కు సూటిగా చెప్పడం, తనకు నచ్చిన పనిని ధైర్యంగా చేసి చూపించడం అనసూయకు అలవాటు. ఈక్రమంలోనే ఆమె కొన్ని కామెంట్స్ తో వివాదం అయ్యారు. స్టార్ యాక్టర్ శివాజి ఆడవారిపై చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇస్తూ… అనసూయ చేసిన కామెంట్స్ మరింత కాంట్రవర్సీకి దారి తీశాయి. అంతే కాదు అనసూయ ట్రోలింగ్ కు కూడా గురయ్యింది. గతంలో విజయ్ దేవరకొండ, కోటా శ్రీనివాసరావు లాంటి వారిపై అనసూయ కామెంట్స్ రచ్చ రచ్చగా మారిన సంగతి తెలిసిందే.

టీవీ షోలు, సినిమాల ద్వారా బాగా పాపులర్ అయిన అనసూయ.. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. దాంతో ఆమెకు సహజంగానే అభిమానులు భారీగా ఉన్నారు. ఆమె ఫాలోవర్లు లక్షల్లో ఉన్నారు. అనసూయ పెట్టే గ్లామర్ ఫోటోల కోసం ఎంతో మంది ఎదురుచూస్తుంటారు. రకరకాల కామెంట్స్ తో రెస్పాండ్ అవుతుంటారు. ఈ క్రమంలోనే అనసూయ ఏం మాట్లాడినా.. అది వైరల్ అవుతుంటుంది.

డేటింగ్ కామెంట్స్ వైరల్!

ఈక్రమంలో అనసూయ గతంలో చేసిన కామెంట్స్ కొన్ని వైరల్ అయ్యాయి. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తన అభిమాన హీరో గురించి వెల్లడించింది. తన లైఫ్ లో ఒకసారే ప్రేమలో పడ్డానని చెప్పిన అనసూయ.. తనకు ఒకే ఒక్క బాయ్ ఫెండ్ ఉన్నాడని.. అతనే తన భర్య అని వెల్లడించింది. తాను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకున్నట్టు తెలిపింది అనసూయ. ఒక వేళ పెళ్ళికాకుండా ఉంటే ఏ హీరోతో డేటింగ్ చేస్తారు అని ప్రశ్న ఎదురవగా.. ఏమాత్రం తడబడకుండా రామ్ చరణ్ పేరు చెప్పేసింది.

రామ్ చరణ్ అంటే తనకు ఎంతో అభిమానం అని అనసూయ చాలా సందర్భాల్లో వెల్లడించింది. ఒక వేళ పెళ్లి కాకుండే ఉండి ఉంటే.. చరణ్ తో డేటింగ్ చేసేదాన్ని అని అనసూయ తన క్రష్ ను వెల్లడించింది. ప్రస్తుతం కొన్ని టీవీ షొలకు జడ్జిగా వ్యవహరిస్తున్న అనసూయ.. అడపా దడపా సినిమాలు చేస్తోంది. ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ రోల్స్ మాత్రమే చేస్తూ వస్తోంది.

అనసూయ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ అభిమానులు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి. మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.