|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అనసూయ స్విమ్ సూట్ సంచలనం! ట్రోలర్స్‌కి షాకిచ్చి, నెటిజన్ల ఆగ్రహానికి గురైన యాంకర్!

Published: 26-12-2025, 11:51 PM
అనసూయ స్విమ్ సూట్ సంచలనం! ట్రోలర్స్‌కి షాకిచ్చి, నెటిజన్ల ఆగ్రహానికి గురైన యాంకర్!
  • అనసూయ స్విమ్ సూట్ వీడియోతో ట్రోలర్స్‌కు కౌంటర్ ఇచ్చింది.
  • దండోరా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో శివాజీ వ్యాఖ్యలు వివాదానికి కారణం.
  • నెటిజన్లు అనసూయ డ్రెస్సింగ్ స్టైల్‌పై మండిపడుతున్నారు.
  • నీళ్లలో ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటానని అనసూయ పోస్ట్.

టాలీవుడ్ నటి అనసూయ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల శివాజీ వ్యాఖ్యలతో మొదలైన వివాదంలో, ట్రోలర్స్ కౌంటర్లకు అనసూయ తన స్విమ్ సూట్ వీడియోతో బదులిచ్చింది. అయితే, ఇది నెటిజన్ల ఆగ్రహాన్ని మరింత పెంచి, ఆమెపై తీవ్ర విమర్శలకు దారితీసింది.

అనసూయ స్విమ్ సూట్ పోస్ట్: కౌంటరా, వివాదమా?

టాలీవుడ్ యాంకర్ కమ్ నటి అనసూయ(Anasuya) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ భామ జబర్దస్త్(Jabardasth) కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ షో ద్వారా ఎంతో పేరు సంపాదించుకుంది. అయితే గత మూడు రోజులుగా దండోరా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో యాక్టర్ శివాజీ చేసిన కామెంట్స్ పై కౌంటరిస్తూ సోషల్ మీడియాలో పలు పోస్టులు, వీడియోలు షేర్ చేస్తుంది. ఈ క్రమంలో నిన్న చీరలో ట్రెడిషనల్ ఫొటోస్ షేర్ చేయగా.. ఆ పోస్ట్ కింద అందరూ శివాజీ వల్లే ఈమె కూడా చేంజ్ అయిందని.. అది శివాజీ అంటే అని కామెంట్ల వర్షం కురిపించారు.

అయితే శారీ లుక్ త‌ర్వాత అన‌సూయ‌కి చాలా మంది కౌంట‌ర్స్ వేస్తున్న నేప‌థ్యంలో స్విమ్ షూట్ వీడియోని షేర్ చేసి త‌గ్గేదే లే అన్న‌ట్టు బ‌దులిచ్చింది. ఇక ఈ పోస్ట్‌కు ‘నీళ్లలో ఉన్నప్పుడు నేను చాలా సంతోషంగా ఉంటాను. నా ట్రావెల్ డేస్‌ని చాలా మిస్ అవుతున్నాను. త్వరలోనే ఒక హాలిడే ప్లాన్ చేయాలి’ అని రాసుకొచ్చింది.

శివాజీ వ్యాఖ్యలతో మొదలైన రచ్చ

ఇక అనసూయ త‌నని ట్రోల్ చేస్తున్నారు కాబ‌ట్టే, ఆమె కావాలనే ఇలా స్విమ్ షూట్‌లో ఉన్న వీడియోని పోస్ట్ చేసిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా.. దీన్ని చూసిన నెటిజన్లు శివాజీ హీరోయిన్ల గురించి మాట్లాడారని, యాంకర్ల గురించి కాదు కదా ఎందుకు నువ్వంత ఫీలవుతున్నావని, నీ డ్రెస్సింగ్ స్టైల్ చెండాలమని తిట్టిపోస్తున్నారు.

నెటిజన్ల ఆగ్రహం: అనసూయపై తిట్టిపోతలు

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

అనసూయ తన వ్యక్తిగత స్వేచ్ఛను చాటుకుంటూ స్విమ్ సూట్ వీడియోను పోస్ట్ చేసింది. అయితే, నెటిజన్లు ఆమె నిర్ణయాన్ని తప్పుపడుతూ, డ్రెస్సింగ్ స్టైల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.