|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నలిపేయాలని ఉందన్న నెటిజన్.. అనసూయ దిమ్మతిరిగే షాక్: రంగంలోకి సైబర్ క్రైమ్!

Published: 20-12-2025, 10:44 PM
నలిపేయాలని ఉందన్న నెటిజన్.. అనసూయ దిమ్మతిరిగే షాక్: రంగంలోకి సైబర్ క్రైమ్!
  • అనసూయ శారీ ఫోటోలకు ఓ నెటిజన్ నుండి దారుణమైన వల్గర్ కామెంట్ ఎదురైంది.
  • “మొన్న నిధి పాపను నలిపేసినట్టు.. నిన్ను కూడా నలిపేయాలి” అంటూ అసభ్యకర వ్యాఖ్య.
  • దీనిపై అనసూయ తీవ్రంగా స్పందించి తెలంగాణ పోలీస్, సైబర్ క్రైమ్‌ను ట్యాగ్ చేసి చర్యలు కోరింది.
  • ఇటీవల నిధి అగర్వాల్‌కి ఎదురైన వేధింపుల ఘటన మరువకముందే ఇది జరగడం ఆందోళన కలిగిస్తోంది.

యాంకర్ అనసూయపై ఓ నెటిజన్ చేసిన దారుణ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. “నిన్ను నలిపేయాలని ఉంది” అంటూ చేసిన కామెంట్‌పై అనసూయ తీవ్రంగా స్పందించింది. వెంటనే తెలంగాణ పోలీస్, సైబర్ క్రైమ్‌ను ట్యాగ్ చేసి చర్యలు కోరింది. ఇది సినీ ప్రముఖుల భద్రతపై ఆందోళనలను పెంచుతోంది.

అనసూయకు వల్గర్ కామెంట్: వెంటనే స్పందించిన యాంకర్

యాంకర్ అనసూయ(Anasuya Bharadwaj) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్ షో ద్వారా ఫుల్ ఫేమ్ రాబట్టుకున్న ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించగా.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‘రంగస్థలం’ తర్వాత అమ్మడు రేంజ్ మరింత పెరిగింది. ఇందులో రంగమ్మత్తగా నటించి ఊహించని క్రేజ్‌ను రాబట్టుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్‌గా కూడా నటించింది. ఇక పుష్ప, పుష్ప-2 వంటి మూవీస్‌లో ప్రధాన పాత్రలో కనిపించిన అనసూయ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. తనను ట్రోల్ చేసే వారికి స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తూ ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఎంత పట్టించుకోకుండా ఉన్నప్పటికీ కొన్ని కామెంట్స్ శృతి మించుతుండటంతో పోలీసులకు కంప్లైంట్ చేస్తుంది.

సైబర్ క్రైమ్‌ను ట్యాగ్ చేసిన అనసూయ

తాజాగా, అనసూయపై ఓ నెటిజన్ దారుణమైన కామెంట్ చేశాడు. దానికి తనదైన స్టైల్లో స్పందించిన ఆమె దిమ్మతిరిగే షాకిచ్చింది. రీసెంట్ గా అనసూయ శారీలో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దానికి, ఒక నెటిజన్స్ కామెంట్ చేస్తూ “మొన్న నిధి పాపను నలిపేసినట్టు.. నిన్ను కూడా నలిపేయాలి” అంటూ వల్గర్ కామెంట్ చేశాడు. ఆ కామెంట్ కి రియాక్ట్ అయిన అనసూయ సీరియస్ అయ్యింది. “ఇలాంటి వాళ్ళని ఎం చేయాలి. ఆరోజు పాపం నిధిని చూస్తే నాకే బాధేసింది. తెలంగాణ పోలీస్ కాస్త గమనించండి. వెంటనే యాక్షన్ తీసుకోండి”అంటూ తెలంగాణ పోలీస్, సైబర్ క్రైం పోలీస్ లను ట్యాగ్ చేసింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు వణుకుపుట్టేలా చేసిందని ప్రశంసలు కురిపిస్తున్నారు.

నిధి అగర్వాల్ ఘటనతో పోలిక: సెలబ్రిటీల భయం

కాగా.. ఇటీవల టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhi Agarwal)ఓ ఈవెంట్‌కు హాజరవ్వగా.. అక్కడ ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. కొంతమంది అభిమానులు ఆమెతో వల్గర్‌గా ప్రవర్తించారు. ఆమెను టచ్ చేయాలని ప్రయత్నించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అయ్యో పాపం అని నెటిజన్లు, సెలబ్రిటీలు ఆమెకు సపోర్ట్‌గా నిలిచారు. అయితే ఈ ఘటన మరవముందే.. లులూ మాల్‌కి వెళ్లిన నిధికి ఊపిరాడకుండా చేశారు. ఆమెను చుట్టుముట్టగా.. బాడీగార్డ్ ఆమెను సేఫ్‌గా తీసుకెళ్లారు. ఈ రెండు ఘటనలు సినీ సెలబ్రిటీలను భయపడేలా చేశాయి.

అనసూయపై జరిగిన ఈ ఘటన సెలబ్రిటీల ఆన్‌లైన్ భద్రతను మరోసారి చర్చనీయాంశం చేసింది. ఇలాంటి దారుణ వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ సంఘటన నొక్కి చెబుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.