
📌 Key Points
- అనసూయ ‘జబర్దస్త్’ ద్వారా పాపులర్ అయి సినిమాల్లోకి ప్రవేశించింది.
- ‘రంగస్థలం’, ‘పుష్ప’ వంటి చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
- తాజాగా అనసూయ పచ్చ చీరలో సంప్రదాయ ఫోటోలు షేర్ చేసింది.
- ఆమె అందంపై ‘ముట్టుకుంటే కందిపోతానంటూ’ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
టాలీవుడ్ నటి అనసూయ భరద్వాజ్ తన సోషల్ మీడియాలో ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిపోయారు. పచ్చ చీరలో అందంగా దిగిన ఆమె ఫోటోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఆమె అందాన్ని చూసి నెటిజన్లు ‘ముట్టుకుంటే కందిపోతావంటూ’ విభిన్న కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫోటోల పూర్తి వివరాలు, అనసూయ కెరీర్ ప్రస్థానంపై ఒక లుక్ వేద్దాం.
అనసూయ కెరీర్ ప్రస్థానం
టాలీవుడ్ యాంకర్ కమ్ నటి అనసూయ(Anasuya) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ భామ జబర్దస్త్(Jabardasth) కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ షో ద్వారా ఎంతో పేరు సంపాదించుకుంది. దీంతో ఈ చిన్నదానికి సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. అలా రామ్ చరణ్(Ram Charan) నటించిన ‘రంగస్థలం’(Rangasthalam) మూవీలో రంగమ్మత్తగా నటించి మెప్పించింది. దీంతో అక్కడి నుంచి ఆమె కెరీర్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ తర్వాత కూడా ‘పుష్ప’(Pushpa), ‘పుష్ప-2’(Pushpa-2) వంటి భారీ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.
ఇటీవల వచ్చిన అరి వంటి సినిమాల్లో.. కూడా ఆమె నటన ప్రత్యేకంగా నిలిచింది. ఇదిలా ఉంటే.. అనసూయ సోషల్ మీడియా(Social Media)లో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. నిత్యం ఫొటోలు, వీడియోలు పంచుకుంటూ.. తన అభిమానులతో తరచూ కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గామారింది.
సంప్రదాయ వస్త్రాల్లో అనసూయ మెరుపులు
తాజాగా అనసూయ తన సోషల్ మీడియాలో చీరలో ట్రెడిషనల్ ఫొటోస్ షేర్ చేసింది. అందులో గ్రీన్ కలర్ శారీకి మల్టీ కలర్ బ్లౌజ్‌తో పెయిరప్ చేసింది. ఇక పూలు పెట్టుకొని షార్ట్ నెక్లెస్‌ను వేసుకుంది. చెవులకు బుట్టాలు, చేతులకు గాజులు, వేలికి రింగ్, కొప్పు వేసుకుని వాటికి పూలు పెట్టుకుని చాలా అందంగా కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్‌గా మారగా.. వీటిని చూసిన నెటిజన్లు ముట్టుకుంటే కందిపోయేలా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.
వైరల్ అవుతున్న ఫోటోలు, నెటిజన్ల కామెంట్స్
A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)
మొత్తంగా, అనసూయ ట్రెడిషనల్ వేర్‌లోని ఫోటోలు ఆమె ఫ్యాన్స్‌కు పండుగ వాతావరణం తెచ్చాయి. ఆమె అందం, అభినయం ఎల్లప్పుడూ అభిమానులను ఆకట్టుకుంటాయి. ఈ తాజా ఫోటోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.


