|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న జై బాలయ్య సింగర్ అదితి భావరాజు.. కఠినమైన నిజాలతో దండోరా!

Published: 31-05-2025, 2:12 AM
హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న జై బాలయ్య సింగర్ అదితి భావరాజు.. కఠినమైన నిజాలతో దండోరా!

టాలీవుడ్ గాయని అదితి భావరాజు ‘దండోరా’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. గ్రామీణ తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కఠినమైన నిజాలను ప్రతిబింబిస్తుంది. అదితితో పాటు మరికొందరు నటీనటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

Key Points

1

జై బాలయ్య సింగర్ అదితి భావరాజు హీరోయిన్‌గా డెబ్యూ

2

‘దండోరా’ సినిమాతో తెలుగు తెరకు అడుగుపెడుతోంది

4

కఠినమైన నిజాలను, సామాజిక దుష్ప్రవర్తనలను చూపుతుంది

అదితి భావరాజు హీరోయిన్‌గా డెబ్యూ

టాలీవుడ్‌లో సింగర్‌గా మంచి పేరు తెచ్చుకుంది అదితి భావరాజు. ఎక్కువగా బాలకృష్ణ నటించిన అఖండ సినిమాలో జై బాలయ్య సాంగ్‌తో అదితి భావరాజు ఎక్కువ పాపులర్ అయింది. గాయనిగా సక్సెస్ అయిన అదితి భావరాజు హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న సినిమా దండోరా.

లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌ను స్థాపించి తొలి చిత్రం ‘క‌ల‌ర్‌ ఫోటో’తో అందరి దృష్టిని ఆక‌ర్షించిన డైన‌మిక్ ప్రొడ్యూస‌ర్ ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్ప‌నేని అనంతరం ‘ బెదురులంక 2012 ’ వంటి సూప‌ర్ హిట్ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు దండోరా సినిమాను ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్ప‌నేని నిర్మిస్తున్నారు.

దండోరా చిత్రానికి ముర‌ళీకాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గ్రామీణ తెలంగాణ నేప‌థ్యంలో రూపొందుతోన్న‘దండోరా’లో బ‌ల‌మైన ప్రేమ క‌థాంశంతో పాటు క‌ఠిన‌మైన నిజాలను, స‌మాజంలో కొన‌సాగుతోన్న సామాజిక దుష్ప‌ప్ర‌వ‌ర్త‌ల‌ను ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

‘దండోరా’ సినిమా విశేషాలు

జై బాలయ్య సింగర్ అదితి భావరాజు హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న దండోరా సినిమాలో శివాజీ , న‌వదీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, రాధ్య త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో మెప్పించ‌నున్నారు. ఇక ఎన్నో చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్స్‌ను ఆల‌పించిన అదితి బాలరాజు దండోరా చిత్రంలో న‌టనా ప్ర‌తిభ‌ను ప్ర‌ద‌ర్శించ‌నుంది. ఆమె ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.

‘దండోరా’ మూవీ ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. తెలంగాణ‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ప‌లు కీల‌క షెడ్యూల్స్‌ను పూర్తి చేశారు. ఇటీవ‌ల విడుద‌లైన మూవీ ఫ‌స్ట్ బీట్ టీజ‌ర్‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. దీంతో సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. రాబోయే రోజుల్లో సినిమా నుంచి మ‌రిన్ని ఆస‌క్తిక‌ర‌మైన విశేషాల‌ను తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు.

కథాంశం మరియు నటీనటులు

మురళీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న దండోరా సినిమాకు మార్క్ కె.రాబిన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. వెంకట్ ఆర్.శాఖ‌మూరి సినిమాటోగ్రాఫ‌ర్‌గా పని చేయగా.. సృజ‌న అడుసుమిల్లి ఎడిట‌ర్‌గా, క్రాంతి ప్రియం ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా, రేఖా బొగ్గార‌పు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా బాధ్యతలు చేపట్టారు.

అలాగే, ఎడ్వ‌ర్డ్ స్టీవెన్‌స‌న్ పెరెజి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా, కొండారు వెంక‌టేష్ లైన్ ప్రొడ్యూస‌ర్‌గా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తిస్తున్నారు. బియాండ్ మీడియా నుంచి నాయుడు సురేంద్ర కుమార్‌, ఫ‌ణి కందుకూరి మీడియా మేనేజ్‌మెంట్ పిఆర్ వ‌ర్క్‌ను.. టికెట్ ఫ్యాక్ట‌రీ మార్కెటింగ్ వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. సింగర్‌గా సక్సెస్ అయిన అదితి భావరాజు హీరోయిన్‌ గా ఎలా మెప్పిస్తుందో చూడాలి.

మొత్తంగా, ‘దండోరా’ సినిమా అదితి భావరాజుకు మంచి అవకాశాన్ని ఇస్తుందని అనిపిస్తుంది. సినిమాలోని కఠినమైన నిజాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.