|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హరీష్ శంకర్‌ను అవమానించిన యాంకర్.. ఉస్తాద్ భగత్ సింగ్ డిజాస్టర్‌పై సంచలన వ్యాఖ్యలు!

Published: 11-04-2026, 8:30 AM
హరీష్ శంకర్‌ను అవమానించిన యాంకర్.. ఉస్తాద్ భగత్ సింగ్ డిజాస్టర్‌పై సంచలన వ్యాఖ్యలు!
  • హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది.
  • సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో అభిమానులు నిరుత్సాహపడ్డారు.
  • పాపం ప్రతాప్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో యాంకర్ స్రవంతి హరీష్ శంకర్‌పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
  • స్రవంతి ‘పాపం హరీష్ శంకర్’ అని సంబోధించడంతో హరీష్ ఫీలైనట్లు తెలిపారు.

దర్శకుడు హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఆశించిన ఫలితం రాబట్టలేకపోయింది. దీంతో ఒక యాంకర్ హరీష్ శంకర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఉస్తాద్ భగత్ సింగ్ ఫలితంపై నిరాశ

Harish Shankar: దర్శకుడు హరీష్ శంకర్ పరిచయం అవసరం లేని పేరు. దర్శకుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన ఇటీవల కాలంలో తన సినిమాల ద్వారా ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నారు. చాలా రోజుల తర్వాత హరీష్ శంకర్(Harish Shankar) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మార్చి 19వ తేదీ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఉగాది పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పూర్తిగా ప్రేక్షకులను నిరాశపరిచింది.

హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ఈ సినిమాని గత మూడు సంవత్సరాల క్రితం ప్రకటించారు అయితే పవన్ రాజకీయాలలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నప్పటికీ ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని చెప్పాలి. మైత్రి మూవీ మేకర్స్ వారి నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా నిర్మాతలకు నష్టాలను మాత్రమే మిగిల్చిందని తెలుస్తోంది. ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కానీ నేపథ్యంలో అభిమానులు కూడా నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

యాంకర్ స్రవంతి కామెంట్స్‌తో షాక్

ఇదిలా ఉండగా తాజాగా హరీష్ శంకర్ తిరువీర్ హీరోగా నటించిన పాపం ప్రతాప్ అనే సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా యాంకర్ స్రవంతి హరీష్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. హరీష్ శంకర్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాగానే స్రవంతి పాపం హరీష్ శంకర్ గారు అంటూ మాట్లాడటంతో దర్శకుడు హరీష్ శంకర్ తెగ ఫీలయ్యారు.

డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైన ఉస్తాద్ భగత్ సింగ్..

హరీష్ శంకర్ రియాక్షన్ వైరల్

ఇక ఈ విషయం గురించి హరీష్ శంకర్ వేదికపై మాట్లాడుతూ తాను ఇక్కడికి రాగానే ఈ యాంకర్ గారు నన్ను పాపం హరీష్ అంటూ పిలిచారు. ఆమె అలా పిలవడంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అనుకున్న విధంగా సక్సెస్ కాకపోవడంతో అలాగా మాట్లాడాలనుకున్నాను అంటూ ఆయన ఫీల్ అయిన విషయాన్ని బయట పెట్టారు. అయితే ఈ సినిమా పాపం ప్రతాప్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరిని కూడా పాపం అంటూ సంబోధిస్తూ ఆహ్వానించారనే విషయం తెలిసి మన గురించి కాదనుకున్నాను అంటూ హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం హరీష్ శంకర్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈయన డైరెక్షన్ లో వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఏప్రిల్ 16వ తేదీ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమవుతున్నట్లు నెట్ ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది.

హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పరాజయం పాలవ్వడం, ఆపై యాంకర్ చేసిన కామెంట్స్ ఆయనను బాధించాయని తెలుస్తోంది. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.