|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మా సుధీర్‌ అన్న చూస్తే అయిపోతాడు.. యాంకర్‌ రష్మిని ఇలా చూసి ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్

Published: 31-10-2025, 12:22 PM
మా సుధీర్‌ అన్న చూస్తే అయిపోతాడు.. యాంకర్‌ రష్మిని ఇలా చూసి ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్

యాంకర్ రష్మి గౌతమ్ హాఫ్ శారీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె అందాన్ని చూసి ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా, ‘మా సుధీర్‌ అన్న చూస్తే అయిపోతాడు’ అంటూ నెటిజన్లు పెడుతున్న కామెంట్లు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఫోటోలు ఇంటర్నెట్‌లో చర్చకు దారితీశాయి.

Key Points

1

రష్మి గౌతమ్ హాఫ్ శారీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

2

సుధీర్‌ అన్న ఆమె అందం చూసి ఫిదా అవుతాడని ఫ్యాన్స్ క్రేజీ కామెంట్లు చేశారు.

4

జబర్దస్త్‌లో సుడిగాలి సుధీర్‌తో రష్మి జోడీకి మంచి క్రేజ్ ఉండేది.

రష్మి హాఫ్ శారీ అందాలు: నెటిజన్ల క్రేజీ కామెంట్స్

జబర్దస్త్ యాంకర్‌ రష్మి గౌతమ్‌ ఇప్పుడు సోషల్‌ మీడియా అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంది. హాఫ్‌ శారీలో దిగిన ఫోటోలను ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లని ఎంగేజ్‌ చేస్తున్నాయి.

హాఫ్‌ శారీ, వీ కట్‌ బ్లౌజ్‌ లో అందంగా ముస్తాబై కెమెరాకి పోజులిచ్చింది రష్మి గౌతమ్‌. ఆమె లుక్స్ మతిపోయేలా ఉన్నాయి. ఆమె కట్టుబొట్టు చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి. దీంతో నెటిజన్లు అక్కడే స్ట్రక్‌ అయిపోయారు. చూపు తిప్పుకోలేకపోతున్నారు.

రష్మి గౌతమ్‌ బ్యాక్‌ సైడ్‌ లుక్‌లో మరింతగా కట్టిపడేస్తోంది. ఆద్యంతం కనువిందు చేస్తోంది. ఆమె పోజులు కూడా అంతే కిర్రాక్‌ అనేలా ఉన్నాయి. దీంతో నెటిజన్లు, ఆమె అభిమానులు ఈ ఫోటోలను వైరల్‌ చేస్తున్నారు. క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.

సుధీర్‌ అన్నకు ఫిదా అంటూ ఫ్యాన్స్ వైరల్ కామెంట్స్

తాజాగా రష్మి గౌతమ్‌ ఫోటోలను చూసి అదిరిపోయే కామెంట్లు పెడుతున్నారు ఫ్యాన్స్. ఇలా సుధీర్‌ అన్న చూస్తే అయిపోతాడని, ఫిదా అయిపోవడం ఖాయమని అంటున్నారు. మరికొందరు కుందనపు బొమ్మలా ఉందంటున్నారు. ఏంజెల్‌లా ఉందని, చాలా అందంగా ఉందని, రోజు రోజు కి అందం పెరిగిపోతుందని అంటున్నారు. అంతేకాదు ఆమె అందాన్ని వర్ణిస్తూ కవిత్వం కూడా రాస్తుండటం విశేషం.

గత 12ఏళ్లుగా జబర్దస్త్ కామెడీ షోకి యాంకర్‌గా చేస్తోంది రష్మి గౌతమ్‌. అనసూయ మధ్యలో వచ్చిపోయినా, తాను మాత్రం కంటిన్యూ అవుతోంది. నిత్యం అలరిస్తూనే ఉంది. గ్లామర్‌తోనే కాదు, అభినయం, కామెడీతోనూ మెప్పిస్తోంది. ఎప్పటికీప్పుడు ఆడియెన్స్ కి కొత్తదనం అందించడంలో తనవంతు పాత్ర పోషిస్తోంది.

జబర్దస్త్ షోలో సుడిగాలి సుధీర్‌తో కలిసి చేసిన రచ్చ వేరే లెవల్‌. ఈ ఇద్దరు లవర్స్ గా మారి చాలా స్కిట్లు చేశారు. నవ్వించారు. అలరించారు. ప్రేమని వ్యక్తం చేశారు. పెళ్లి పీఠలు కూడా ఎక్కారు. షోలోనే అన్నీ అయిపోయాయా అనేంతగా హడావుడి చేయడం విశేషం. అందుకే ఈ జంటకి బుల్లితెరపై విపరీతమైన ఫాలోయింగ్‌ ఏర్పడింది.

రష్మి కెరీర్, సుధీర్‌తో స్పెషల్ బాండ్

ఇప్పుడు ఈ ఇద్దరు విడిపోయారు. వేర్వేరుగా షోస్‌ చేస్తున్నారు. మధ్యలో సుధీర్‌ సినిమాల్లోకి వెళ్లారు. దీంతో గ్యాప్‌ వచ్చింది. ఆ క్రేజ్‌ తగ్గిపోయింది. జబర్దస్త్ షో కూడా డల్ అయిపోయింది. అయినా తనవంతు బెస్ట్ ఇస్తూ అలరించే ప్రయత్నం చేస్తోంది రష్మి.

ప్రస్తుతం రష్మి గౌతమ్‌ `జబర్దస్త్` షోతోపాటు `శ్రీదేవి డ్రామా కంపెనీ`కి యాంకర్‌గా చేస్తోంది. జబర్దస్త్ షోకి క్రేజ్‌ తగ్గగా, శ్రీదేవి డ్రామా కంపెనీ మాత్రం మంచి ఆదరణ పొందుతోంది. ఇందులో హైపర్‌ ఆది కూడా ఉండటంతో  బాగా ఆకట్టుకుంటోంది. అదే సమయంలో రష్మి రచ్చ కూడా ఇందులో వేరే లెవల్‌ అని చెప్పొచ్చు.

మొత్తానికి, రష్మి గౌతమ్ తన తాజా ఫోటోషూట్‌తో అభిమానులను మరోసారి ఆకట్టుకుంది. ఆమె గ్లామర్, సుడిగాలి సుధీర్‌తో ఆమెకున్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్లు వార్తల్లో నిలుస్తున్నాయి. ఆమె సోషల్ మీడియాలో తన క్రేజ్‌ను కొనసాగిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.