|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

జాన్ అబ్రహాం ఆకలి ముందు హోటల్ ఓనర్ అవాక్కు! 64 చపాతీలు ఎలా తిన్నాడు?

Published: 07-07-2026, 4:11 PM
జాన్ అబ్రహాం ఆకలి ముందు హోటల్ ఓనర్ అవాక్కు! 64 చపాతీలు ఎలా తిన్నాడు?
  • జాన్ అబ్రహాం తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన సరదా ఫుడ్ ఇన్సిడెంట్‌ను పంచుకున్నారు.
  • ముంబైలోని ఓ గుజరాతీ థాలీ రెస్టారెంట్‌లో 64 చపాతీలు తిన్నాడు.
  • ఈ సంఘటన ‘ది కపిల్ శర్మ షో’లో వెల్లడై, ప్రస్తుతం వైరల్ అవుతోంది.
  • ప్రస్తుతం జాన్ అబ్రహాం ‘ఫోర్స్ 3’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

బాలీవుడ్ యాక్షన్ స్టార్ జాన్ అబ్రహాం తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన ఓ క్రేజీ ఫుడ్ ఇన్సిడెంట్‌ను పంచుకున్నారు. ‘ది కపిల్ శర్మ షో’లో ఆయన చెప్పిన ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒకేసారి 64 చపాతీలు తిని హోటల్ సిబ్బందిని ఎలా షాక్ చేశాడో తెలుసుకుందాం.

జాన్ అబ్రహాం క్రేజీ ఫుడ్ స్టోరీ

John Abraham: జాన్ అబ్రహం.. బాలీవుడ్ యాక్షన్ స్టార్ కమ్ ఫిట్ నెస్ ఐకాన్.అలాంటి ఈ హీరో సిల్వర్ స్క్రీన్ పై ఎంత గంభీరంగా కనిపిస్తాడో రియల్ లైఫ్ లో అంత సరదాగా ఉంటాడని విషయం మరోసారి ప్రూవ్ అయింది.మామూలుగా సెలబ్రిటీలు తమ డైట్ క్యాలరీల లెక్కల గురించే మాట్లాడుతుంటారు కానీ చాలా అబ్రహం మాత్రం తన లైఫ్ లో జరిగిన క్రేజీ ఫుడ్ ఇన్సిడెంట్ బయటపెట్టి అందరిని షాక్ కి గురి చేశాడు.బుల్లితెరపై పాపులర్ షో గా పేరొందిన  ది కపిల్ శర్మ షోలో జాన్ అబ్రహం పాల్గొన్న సందర్భంలో ఈ ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టాడు.

జాను అబ్రహం కెరియర్ మొదట్లో మోడలింగ్ మరియు ఫుట్బాల్ ఆడుతున్న సమయంలో జరిగిన కథ ఇది.ఒక రోజు ఫుట్బాల్ మ్యాచ్ ఆడిన తర్వాత బాగా ఆకలితో ఉన్న జాన్ ముంబైలోని ఒక ఫేమస్ గుజరాతి థాళి రెస్టారెంట్ కి వెళ్ళాడట.అక్కడ అం లిమిటెడ్ థాళి ఆఫర్ చూసి ఎలాగైనా కడుపునిండా తినాలని ఫిక్స్ అయిపోయాడట .గుజరాతీ థాలీల్లో వడ్డించే చపాతీలు  చాలా చిన్నగా ఉంటాయన్న సంగతి తెలిసిందే .అయితే చాలా అబ్రహం ఆకలి ముందు ఆ చపాతీలు అసలు సరిపోలేదు.దాంతో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 64 చపాతీలను తినేశాడట జాన్.దీంతో  జాన్  అబ్రహం స్పీడ్ గా తినడం చూసిన అక్కడ వెయిటర్ నోరెళ్లపెట్టాడట.

ఒకేసారి 64 చపాతీలు.. వెయిటర్ షాక్!

ఇక లాభం లేదు అనుకున్న వెయిటర్ మెల్లగా వచ్చి సార్ మా దగ్గర చపాతీలతో పాటు అన్నం కూడా ఉంది అనగానే ఇవి అయిపోయాక అన్నం కూడా తీసుకురా అని చెప్పి చపాతీలు తినడం పూర్తయ్యాక ఆ అన్నాన్ని కూడా తిన్నానని, తన తొలి రోజుల్లో జరిగిన సరదా సన్నివేశాన్ని చెప్పుకొచ్చాడు జాన్ అబ్రహం.ఇక జాన్ అబ్రహం ఈ షోలో ఆ సరదా ఇన్సిడెంట్  గురించి చెబుతుంటే అక్కడ ఆడియన్స్ తో పాటు నవజ్యోతి సింగ్ సింధు,కపిల్ శర్మలు కూడా నవ్వులు ఆపుకోలేకపోయారు.

ప్రస్తుతం ఈ ఫన్నీ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో  తెగ వైరల్ అవుతుంది. ఇక జాన్  సినిమాలు విషయానికి వస్తే మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఫోర్స్ 3 షూటింగ్లో బిజీగా ఉన్నాడు జాన్.గతంలో 2011లో వచ్చిన ఫోర్స్ ,ఆ తర్వాత 2016 లో వచ్చిన ఫోర్స్ 2  బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.ఇక దాదాపు 10 ఏళ్ల  తర్వాత రాబోతున్న ఈ మూడో భాగంపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇక యాక్షన్ ఫిలింలో టాలెంటెడ్ యాక్టర్ హర్షవర్ధన్ రాణేతో పాటు ‘క్లాస్’ వెబ్ సిరీస్ ఫేమ్ తాన్యా మణిక్తలు కీలక పాత్రలు  పోషిస్తున్నారు.జాన్ గత సినిమాల కంటే  ఈ సినిమా లో హై వోల్టేజ్ ఆక్షన్ సీక్వెన్స్ భారీగా ఉన్నట్టు తెలుస్తుంది .చూడాలి మరి ఈ సినిమాతో అయినా జాన్ హిట్ కొడతాడో లేదో

“ఫోర్స్ 3″తో జాన్ అబ్రహాం బిజీ

జాన్ అబ్రహాం చెప్పిన ఈ సరదా సంఘటన ఆయన నిజ జీవితంలో ఎంత సరదాగా ఉంటాడో తెలియజేస్తుంది. ఈ ఫన్నీ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అభిమానులను అలరిస్తోంది. ఆయన రాబోయే చిత్రం ‘ఫోర్స్ 3’పై కూడా భారీ అంచనాలున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.