
📌 Key Points
- ఒకప్పుడు గోల్డ్ షాపులో సేల్స్ గర్ల్, ఇప్పుడు స్టార్ యాంకర్ స్రవంతి జీవితంలో ఎన్నో కష్టాలు, మలుపులు!
- ఆరో తరగతి నుంచే మెహందీ వేస్తూ డబ్బు సంపాదించిన స్రవంతి.. నటిగా మారాలని ఇండస్ట్రీకి ఎంట్రీ.
- పెళ్లి తర్వాత ఆర్థిక ఇబ్బందులు రావడంతో పంజాగుట్టలోని గోల్డ్ షాపులో సేల్స్ గర్ల్ గా పనిచేసిన స్రవంతి.
- స్నేహితుడు అభిరామ్ ద్వారా యాంకర్ గా అవకాశం.. నేడు సక్సెస్ ఫుల్ కెరీర్ తో దూసుకుపోతున్న స్రవంతి!
టాలీవుడ్ యాంకర్ స్రవంతి చొకారపు గురించి ఓ సంచలన వార్త వైరల్ అవుతోంది. ఆమె ఒకప్పుడు గోల్డ్ షాపులో సేల్స్ గర్ల్ గా పనిచేసిందంటే నమ్ముతారా? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం!
గోల్డ్ షాపులో స్రవంతి.. ఊహించని మలుపు!
Star Anchor : చాలామంది సినీ సెలబ్రిటీలు కెరీర్ ఆరంభంలో కష్టపడిన వాళ్ళే. సినీ పరిశ్రమ రాకముందు బయట జాబ్స్ చేసిన వాళ్లే. తాజాగా ఓ స్టార్ యాంకర్ తను యాంకర్ అవ్వకముందు డబ్బుల కోసం చేసిన పనుల గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్తూ ఎమోషనల్ అయింది.
ఇంతకీ ఆ యాంకర్ ఎవరో అనుకుంటున్నారా? బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకొని, యాంకర్ గా సినిమా ఈవెంట్స్, ఇంటర్వ్యూలు చేస్తూ, సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో వైరల్ అయి పాపులారిటీ తెచ్చుకున్న స్రవంతి చొకారపు.
యాంకర్ గా కెరీర్.. స్రవంతి సక్సెస్ సీక్రెట్స్!
తాజాగా యాంకర్ స్రవంతి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. ఆరో తరగతి నుంచే మెహందీ పెట్టేదాన్ని నేను. బ్యూటీ పార్లర్ తో టై అప్ అయి మెహందీ పని చేసి డబ్బులు సంపాదించేదాన్ని. యాక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాను. కానీ అప్పుడు మా లవర్ తో పెళ్లి కోసం వాళ్ళ ఇంట్లో సినిమాలు అంటే ఒప్పుకోరు అని సినిమాలు వదిలేసా.
స్రవంతి ఎమోషనల్ ఇంటర్వ్యూ.. వైరల్ అవుతున్న విషయాలు!
పెళ్లి అయ్యాక కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ రావడంతో నేను కూడా జాబ్ చేయాల్సి వచ్చింది. దాంతో గోల్డ్ షాప్ లో సేల్స్ గర్ల్ గా వర్క్ చేశా. ఇక్కడే హైదరాబాద్ పంజాగుట్టలో ఓ షాప్ లో పనిచేశా. కానీ ఆ జాబ్ కి ఎక్కువ సేపు నిల్చోవాలి. ఎక్కువ సేపు నిల్చోవడంతో హెల్త్ ఇష్యూస్ వచ్చి నా వల్ల కావట్లేదు అని మా ఆయనకు చెప్పి మానేసాను. ఆ తర్వాత మా ఆయన ఫ్రెండ్ అభిరామ్ అనే వ్యక్తితో పరిచయం అయి ఓ ఛానల్ లో యాంకర్ గా మొదలుపెట్టాను. అక్కడ్నుంచి యాంకర్ గా నా కెరీర్ స్టార్ట్ అయింది అని చెప్తూ ఎమోషనల్ అయింది.
స్రవంతి జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని స్టార్ గా ఎదిగింది. ఆమె పడిన కష్టం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


