|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన యాంకర్ స్రవంతి రొమాంటిక్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ – దొరికిన ప్రేమలేఖ

Published: 10-08-2025, 4:50 AM
ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన యాంకర్ స్రవంతి రొమాంటిక్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ - దొరికిన ప్రేమలేఖ

ప్రముఖ యాంకర్ స్రవంతి నటించిన ‘దొరికిన ప్రేమలేఖ’ అనే రొమాంటిక్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇవాళ ఓటీటీలో విడుదలైంది. భార్య, భర్త, ప్రియురాలు మధ్య సాగే ఈ కథలో ఎన్నో ట్విస్టులు ఉంటాయి.

Key Points

1

యాంకర్ స్రవంతి నటించిన 'దొరికిన ప్రేమలేఖ' ఓటీటీలో విడుదల.

2

రొమాంటిక్ ట్రయాంగిల్ లవ్ స్టోరీతో ఆకట్టుకునే కథ.

4

ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

దొరికిన ప్రేమలేఖ: కథా సారాంశం

ఓటీటీలోకి ప్రతివారం సరికొత్త కంటెంట్‌తో సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతూనే ఉన్నాయి. వీటిలో తెలుగు ఒరిజినల్ కంటెంట్ మూవీస్ కూడా బాగానే వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ ఓటీటీ లోకి వచ్చేసింది తెలుగు రొమాంటిక్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ మూవీ దొరికిన ప్రేమలేఖ.

ప్రముఖ టాలీవుడ్ యాంకర్ స్రవంతి చొక్కారపు , యూట్యూబ్ సిరీస్‌లతో క్రేజ్ తెచ్చుకున్న విరాజిత, సిద్ధు దివాకర్ ప్రధాన పాత్రలు పోషించారు. వీరితోపాటు జయరాజ్, అఖిల్ గొల్ల, రోహిత్ భరద్వాజ్ అద్దంకి, మాస్టర్ హనువీర్ ఇతర కీలక పాత్రలు పోషించారు.

షో రన్నర్, స్క్రీన్ ప్లే బాధ్యతలను యాటా నిర్వహించగా కొండ రాంబాబు దర్శకత్వం వహించారు. సాయి సత్య గట్రెడ్డి కథ అందించారు. ఇక మిక్కిన్ అరుల్ సంగీతం అందించిన దొరికన ప్రేమలేఖ సినిమా కథ భార్య, ప్రియురాలు, భర్త ముగ్గురు చుట్టూ సాగుతుందని తెలుస్తోంది.

నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు

కాలేజీలో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేని హీరో తన భార్యతో సంతోషంగానే జీవిస్తుంటాడు. కానీ, ఓ సమయంలో తన ప్రేయసి మళ్లీ కనిపించి హీరోతో బతకాలని కోరుకుంటుంది. మరోవైపు భర్త, ప్రియురాలికి సంబంధించిన ఓ ప్రేమలేఖ హీరో భార్యకు దొరుకుతుంది.

భర్త-ప్రియురాలి అభిరుచులు

ఆ అమ్మాయి ఎవరు, ఏం చేస్తుంది, తనపై భర్తకు ప్రేమ ఉందా వంటి విషయాలు తెలుసుకోవాలని భార్య ప్లాన్స్ వేస్తుంటుంది. ఈ క్రమంలోనే భర్త ప్రియురాలితో స్నేహం చేస్తుంది. భర్త, ప్రియురాలి అభిరుచులు ఒకేలా ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తాయి.

ఓటీటీ విడుదల వివరాలు

ఇలా సాగుతుండగా హీరో ఏం చేశాడు. ప్రేయసితో వెళ్లాడా, భార్యతోనే జీవించాడా అనేది తెలియాలంటే దొరికిన ప్రేమలేఖ సినిమాను చూడాల్సందే. ఇవాళ్టీ నుంచి (ఆగస్ట్ 10)దొరికిన ప్రేమలేఖ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈటీవీ విన్‌ లో దొరికిన ప్రేమలేఖ ఓటీటీ రిలీజ్ అయింది.

అయితే, ప్రతివారం సరికొత్త కాన్సెప్ట్‌లతో ఈటీవీ విన్‌లో కథా సుధా వీక్లీ సిరీస్ డిజిటల్ ప్రీమియర్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వారం రొమాంటిక్ లవ్ స్టోరీతో ఈటీవీ విన్ కథా సుధాలో భాగంగా దొరికిన ప్రేమలేఖ ఓటీటీ రిలీజ్ అయింది. కేవలం 35 నిమిషాల 9 సెకన్ల రన్ టైమ్‌తో దొరికిన ప్రేమలేఖ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

భర్త ప్రేమలేఖతో భార్య జీవితంలో ఎదురయ్యే సంఘర్షణలు, చివరికి ఆమె ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలుసుకోవాలంటే ‘దొరికిన ప్రేమలేఖ’ చూడండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.