|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కన్నప్ప ఓటీటీ రిలీజ్ డేట్.. మంచు విష్ణు మూవీ వచ్చేది ఈ వారమే.. నెల రోజుల్లోపే..!

Published: 21-07-2025, 12:17 PM
కన్నప్ప ఓటీటీ రిలీజ్ డేట్.. మంచు విష్ణు మూవీ వచ్చేది ఈ వారమే.. నెల రోజుల్లోపే..!

మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వారం విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్‌లో నిరాశపరిచింది.

Key Points

1

కన్నప్ప సినిమా ఓటీటీలోకి వస్తున్నట్లు వార్తలు

2

ఈ వారమే అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతుందని ప్రచారం

4

ప్రభాస్, మోహన్ లాల్ లాంటి వారి అతిథి పాత్రలు ఉన్నా బాక్సాఫీస్ వద్ద విఫలం

కన్నప్ప ఓటీటీ రిలీజ్ తేదీ

విష్ణు మంచు లీడ్ రోల్లో.. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి వాళ్లు అతిథి పాత్రల్లో నటించిన సినిమా కన్నప్ప. గత నెల 27న థియేటర్లలో రిలీజైంది. తొలి రోజే మంచి ఓపెనింగ్స్ వచ్చినా.. తర్వాత బాక్సాఫీస్ దగ్గర కుప్పకూలి డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇప్పుడీ సినిమా ఈ వారమే ఓటీటీలోకి వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

విష్ణు మంచు కథ అందించి, లీడ్ రోల్లో నటించిన కన్నప్ప మూవీ ఈ శుక్రవారం (జులై 25) అమెజాన్ ప్రైమ్ వీడియో లోకి అడుగుపెట్టనున్నట్లు ఓ బజ్ క్రియేటైంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను పెద్ద మొత్తానికే ఈ ఓటీటీ దక్కించుకున్నట్లు తెలిసింది. అయితే ఆ మొత్తం ఎంత అన్నది మాత్రం వెల్లడి కాలేదు.

బాక్స్ ఆఫీస్ పరాజయం తర్వాత ఓటీటీ

జూన్ 27న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా నెల రోజుల్లోపే ఓటీటీలోకి అడుగుపెట్టేలా కనిపిస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఈ మధ్యే కుబేర మూవీ కూడా నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చిన విషయం తెలిసిందే. నిజానికి ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించినా.. ఊహించిన దాని కంటే త్వరగానే ఓటీటీలోకి వచ్చింది.

భారీ అంచనాల మధ్య రిలీజైన మూవీ కన్నప్ప . ఎంతో ప్రతిష్టాత్మకంగా మోహన్ బాబు ఈ సినిమాను నిర్మించాడు. ముకేశ్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేశాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాత్రం బోల్తా పడింది. ఏకంగా రూ.200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించినా.. ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.46 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. సినిమాపై ఉన్న బజ్, ప్రభాస్ స్పెషల్ అప్పియరెన్స్ కారణంగా తొలి రోజు భారీ ఓపెనింగ్స్ లభించినా.. తర్వాత దారుణంగా పడిపోయాయి. దీంతో ఈ మూవీ ఓ డిజాస్టర్ గా మిగిలిపోయింది.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల

కన్నప్ప మూవీ శివుడి భక్తుడైన తిన్నడి స్టోరీ. ఓ నాస్తికుడిగా ఉన్న వ్యక్తి వాయులింగానికి పరమ భక్తుడిగా ఎలా మారాడన్నదే ఈ కన్నప్ప మూవీ ప్రధాన కథాంశం. ముకేశ్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేయగా.. విష్ణు మంచు కథ అందించాడు. ఇందులో అతనితోపాటు ప్రీతి ముకుందన్, మోహన్ బాబు, శరత్ కుమార్ లాంటి వాళ్లు నటించారు.

ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ లాంటి వాళ్ల అతిథి పాత్రలు సినిమాకు మంచి హైప్ ఇచ్చాయి. అయితే వాళ్లు కూడా ఈ మూవీని బాక్సాఫీస్ దగ్గర కాపాడలేకపోయారు. మరి ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

కన్నప్ప సినిమా బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచినప్పటికీ, ఓటీటీలో దీనికి ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి. ప్రభాస్, మోహన్ లాల్ లాంటి స్టార్స్ ఉన్నా సినిమా విజయం సాధించలేదు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.