|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Andhra King Taluka: రాజమండ్రిలో ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రీకరణ ప్రారంభం

Published: 29-06-2025, 11:42 AM
Andhra King Taluka: రాజమండ్రిలో ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రీకరణ ప్రారంభం

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రం రాజమండ్రిలో చిత్రీకరణ ప్రారంభించింది. రామ్ పోతినేని, ఉపేంద్రలతో పాటు ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

Key Points

1

రామ్ పోతినేని హీరోగా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రం ప్రారంభం.

2

రాజమండ్రిలో కీలక సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభమైంది.

4

భారీ స్థాయి నిర్మాణంతో, అద్భుతమైన నటీనటులతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.

‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రీకరణ ప్రారంభం

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, మహేష్ బాబు పి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ అనే ఓ కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇందులో లేటెస్ట్ సెన్సేషన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే.. రామ్ సరసన కథానాయికగా నటిస్తోంది.

రామ్ పోతినేని, ఉపేంద్ర కీలక పాత్రలు

టాప్ టెక్నిషియన్స్ తో ఈ ప్రాజెక్ట్ అత్యున్నత స్థాయి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతోంది. సిద్ధార్థ నుని సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నారు. వివేక్-మెర్విన్ మ్యూజిక్ అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా.. ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా వ్యవహరిస్తున్నారు. ఇక చిత్రంలో ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సే, రావు రమేష్, మురళి శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేష్ వంటి వారు కీలక పాత్రలో కనిపించనున్నారు.

రాజమండ్రిలో షూటింగ్

ట్యాలెంటెడ్ స్టార్ కాస్ట్, అద్భుతమైన కథాంశం, హై ప్రొడక్షన్ వాల్యూస్ తో ‘ఆంధ్ర కింగ్ తాలూక’ ఒక అద్భుతమైన ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. అయితే తాజాగా నేడు ఈ చిత్ర షూటింగ్ షెడ్యూల్ రాజమండ్రిలో ప్రారంభమైంది. రామ్ పోతినేని, కన్నడ స్టార్ ఉపేంద్రలపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ ఆసక్తికరమైన కథాంశంలో రామ్ డై హార్డ్ అభిమాని పాత్రను పోషిస్తుండగా, ఉపేంద్ర సూపర్ స్టార్ గా పాత్రలో కనిపిస్తారు. ఇటీవల విడుదలైన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ టైటిల్ గ్లింప్స్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే.

‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రం అత్యున్నత సాంకేతిక విలువలతో, అద్భుతమైన నటీనటులతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.