
రామ్ పోతినేని నటించిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రం నుంచి తొలి పాట ప్రోమో విడుదలైంది. అనిరుధ్ రవిచందర్ ఆలపించిన ఈ రొమాంటిక్ పాటకు రామ్ స్వయంగా సాహిత్యం అందించారు. వివేక్-మెర్విన్ సంగీత ద్వయం ఈ పాటను అందించారు.
Key Points
రామ్ పోతినేని నటించిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల.
అనిరుధ్ రవిచందర్ ఆలపించిన ‘నువ్వుంటే చాలే’ పాట ప్రోమో ఆకట్టుకుంటోంది.
వివేక్-మెర్విన్ సంగీతం, రామ్ పోతినేని సాహిత్యం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ.
ఫుల్ సాంగ్ జూలై 18న విడుదల కానుంది.
‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్ ప్రోమో
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’(Andhra King Thaluka). ఇక దర్శకుడు పి.మహేష్ కుమార్(P. Mahesh Kumar) అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, Y. రవిశంకర్‌లు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అందాల భామ భాగ్యశ్రీ బోర్సే(Bhagya Sree Borse) హీరోయిన్‌గా నటిస్తోండగా ఉపేంద్ర(Upendra) ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్ర షూటింగ్ చివరి షెడ్యూల్‌ను మేకర్స్ వీలైనంత త్వరగా ముగించేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్‌కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటను పూర్తి రొమాంటిక్ సాంగ్‌గా మ్యూజిక్ ద్వయం వివేక్-మెర్విన్ కంపోజ్ చేశారు. ఇక ఈ పాటకు సాహిత్యం రామ్ స్వయంగా అందించడంతో మరింత అంచనాలు క్రియేట్ అయ్యాయి. ‘నువ్వుంటే చాలే’ అంటూ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ పాటను పాడిన తీరు ఆకట్టుకుంటుంది. ప్రోమోనే సాంగ్‌పై హైప్ క్రియేట్ చేసింది. దీంతో ఫుల్ సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ సాంగ్ ప్రోమోను చూసేయండి. కాగా ఫుల్ సాంగ్ జూలై 18న రాబోతుంది. Link
అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్
రామ్ పోతినేని సాహిత్యం
‘నువ్వుంటే చాలే’ పాట ప్రోమో అంచనాలను పెంచింది. పూర్తి పాట జూలై 18న విడుదల కానుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదలకు మరింత ఉత్కంఠ పెరిగింది.


