|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అనిల్ రావిపూడి, జబర్దస్త్ అభి: వారి మధ్య ఉన్న బంధం వెనుక అసలు కథ ఇదే!

Published: 04-05-2026, 1:46 AM
అనిల్ రావిపూడి, జబర్దస్త్ అభి: వారి మధ్య ఉన్న బంధం వెనుక అసలు కథ ఇదే!
  • డైరెక్టర్ అనిల్ రావిపూడి, జబర్దస్త్ అభి మధ్య పాత స్నేహబంధం ఉంది.
  • అనిల్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ‘గౌతమ్ ఎస్ఎస్సి’ సినిమాతో అభి పరిచయమయ్యారు.
  • ఆ సినిమా సమయంలో అభి, అనిల్ కు డైలాగ్ రైటింగ్‌లో, ముఖ్యంగా తెలంగాణ యాసలో సహాయం చేశారు.
  • వారి స్నేహబంధం గురించి అనిల్ రావిపూడి గతంలో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు, అది ఇప్పుడు వైరల్ అవుతోంది.

టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, జబర్దస్త్ కమెడియన్ అదిరే అభిల మధ్య ఉన్న ఆసక్తికరమైన స్నేహబంధం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వారి కెరీర్ తొలినాళ్లలో ఎలా కలిశారు, అభి అనిల్ కు ఎలా సహాయపడ్డారో ఇప్పుడు తెలుసుకుందాం.

అనిల్ రావిపూడి, అభిల స్నేహబంధం ఎలా మొదలైంది?

Director AnilRavipudi : టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకరు.. ఈయన ఇప్పటివరకు దర్శకత్వం వహించిన సినిమాలు అన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సీనియర్ హీరోలతో ఈయన చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటుగా కలెక్షన్స్ సునామీ సృష్టించాయి. ఈ ఏడాది చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో మరో బిగ్గెస్ట్ హెడ్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఈయన కొత్త సినిమాను తెరకెక్కిస్తున్నారు.. సినిమాల సంగతి పక్కన పెడితే.. డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. జబర్దస్త్ లో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అదిరే అభి కి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కి ఉన్న రిలేషన్ గురించి ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి.. వీరిద్దరి మధ్య ఉన్న ఆ రిలేషన్షిప్ ఏంటో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్లు అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. స్టార్ హీరోలు అందరితోనూ ఈయన చేసిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే అనిల్ రావిపూడి గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు.. అయితే ఈయన డైలాగ్ గా తన కెరీర్ ని ప్రారంభించి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. నవదీప్ హీరోగా నటించిన గౌతమ్ ఎస్ఎస్సి మూవీతో అసిస్టెంట్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ టైంలో ఆ సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించిన జబర్దస్త్ అదిరే అభి తో మంచి సాన్నిత్యం ఏర్పడిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ బయటపెట్టారు.. అప్పుడు వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ అయినట్లు డైరెక్టర్ చెప్పారు. ఇద్దరు కలిసి కూర్చుని డైలాగులు రాయడం అలా వాళ్ళిద్దరి మధ్య తెలియకుండానే మంచి బంధం ఏర్పడిందని అనిల్ రావిపూడి అన్నారు. డైలాగులు తెలంగాణ యాసలో రాయడానికి అభి చాలా హెల్ప్ చేశాడు అంటూ తన ఫ్రెండ్ గురించి చాలా గొప్పగా చెప్పారు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వీరిద్దరి మధ్య ఉన్న స్నేహబంధం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

గౌతమ్ ఎస్ఎస్సి సినిమాతో బలపడిన బంధం

అభి సహాయం, అనిల్ రావిపూడి విజయం

టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇంజనీరింగ్ పూర్తి చేసి సినిమాలపై ఆసక్తి ఉండడంతో కుటుంబ సభ్యులను ఒప్పించి ఇటుగా అడుగులు వేశారు. అనిల్ రావిపూడి బాబాయి అరుణ ప్రసాద్ ఒక సినిమా డైరెక్టర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు. అతని దగ్గరే దర్శకత్వ విభాగంలో చేరాడు. 2005 లో విడుదలైన నవదీప్ గౌతమ్ ఎస్ఎస్సి మూవీ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. తర్వాత ఎన్నో సినిమాలకు రచయితగా కూడా పని చేశారు. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన పటాస్ మూవీతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో డైరెక్టర్గా వరుసగా సినిమాలు చేస్తూ సత్తాని చాటుతున్నాడు. సుప్రీం, రాజా ది గ్రేట్ సినిమాలు అతనికి మంచి సక్సెస్ ని అందించాయి. ఇక వెంకటేష్ తో చేసిన ఎఫ్2 మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. రీసెంట్ గా వచ్చిన మన శంకర్ ప్రసాద్ గారు వరకు ఆయన చేసిన అన్ని సినిమాలు మంచి సక్సెస్ ని సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్టులను తెరకెక్కించే పనిలో ఉన్నారు అనిల్ రావిపూడి. కేవలం సినిమాలకు దర్శకత్వం వహించడం మాత్రమే కాదు బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు స్పెషల్ షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తూ వస్తున్నారు..

అనిల్ రావిపూడి, జబర్దస్త్ అభిల మధ్య ఉన్న ఈ పాత స్నేహబంధం వారి కెరీర్‌లో ఎంత కీలక పాత్ర పోషించిందో ఈ కథనం స్పష్టం చేస్తుంది. ఇద్దరి మధ్య ఉన్న అవినాభావ సంబంధం నిజంగా అభినందనీయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.