|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అనిల్ రావిపూడి సంచలన ప్రకటన! తన సినిమాపై వస్తున్న పుకార్లకు చెక్!

Published: 10-02-2026, 11:35 AM
అనిల్ రావిపూడి సంచలన ప్రకటన! తన సినిమాపై వస్తున్న పుకార్లకు చెక్!
  • దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాపై వస్తున్న పుకార్లను ఖండించారు.
  • వెంకటేష్‌తో సినిమా ఉంటుందనే వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.
  • స్క్రిప్ట్, నటీనటులు, టైటిల్ ఇంకా ఖరారు కాలేదని అనిల్ తెలిపారు.
  • త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తానని ఆయన పేర్కొన్నారు.

దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి సినిమా గురించి వస్తున్న వార్తలపై స్పందించారు. వెంకటేష్‌తో సినిమా ఉంటుందనే వార్తల్లో నిజం లేదని ఆయన కొట్టిపారేశారు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని ఆయన తెలిపారు.

అనిల్ రావిపూడి క్లారిటీ

Anil Ravipudi: పటాస్ సినిమా ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన అనిల్ రావిపూడి ఇప్పటివరకు తన కెరియర్ లో తొమ్మిది సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈ తొమ్మిది సినిమాలు కూడా మంచి సక్సెస్ కావడంతో అనిల్ రావిపూడి పేరు ప్రస్తుతం ఇండస్ట్రీలో మారు మోగిపోతుంది. ఇక అనిల్ రావిపూడి తదుపరి సినిమా గురించి ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈయన తన పదవ సినిమాని విక్టరీ వెంకటేష్ తో చేయబోతున్నారంటూ వార్తలు బయటకు వచ్చాయి ఇక ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డే లేదా కీర్తి సురేష్ నటించబోతున్నారంటూ వార్తలు బయటకు వచ్చాయి.

ఈ సినిమాలో విలన్ పాత్రలో నటుడు ఫహద్ ఫాజిల్ నటించబోతున్నారంటూ వార్తలో నెట్టింట చక్కర్లు కొట్టడంతో అభిమానులు కూడా ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచుకున్నారు. ఇలా ఈ సినిమా గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్నా అనిల్ రావిపూడి నుంచి ఏ విధమైనటువంటి స్పందన లేకపోవడంతో అభిమానులు కూడా ఈయన సినిమా విషయంలో ఎన్నో సందేహాలను వ్యక్తం చేశారు. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు శ్రీమతి లత వెంకటరెడ్డి అనే టైటిల్ ఫిక్స్ చేశారంటూ కూడా వార్తలు బయటకు వచ్చాయి. ఈ సినిమా గురించి తరచూ ఏదో ఒక వార్త బయటకు వస్తున్న నేపథ్యంలో నేరుగా అనిల్ రావిపూడి స్పందించారు.

ఈ సందర్భంగా అనిల్ రావిపూడి తన అధికారక ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ..”నేను పేపర్ మీద కలం కూడా పెట్టలేదు ఇంకా నటినటులు, కధ, టైటిల్ కూడా పెట్టేసారు. ఈ ఫ్లో చూస్తుంటే . యాక్షన్..కట్ కూడా చెప్పేస్తారేమో మీ ఉత్సాహన్ని నేను అర్థం చేసుకోగలను….అలాగే నేను చేసే సినిమా ఏంటి ఎవరితో అనేది అతి త్వరలో…నిజమైన పూర్తి వివరాలు మీకు అందిస్తాం” అంటూ ఈ సినిమా గురించి వస్తున్నటువంటి వార్తలపై ఈయన క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ సినిమా పనులు ఇంకా పూర్తి కాలేదని ఈయన ఎవరిని ఎంపిక చేయలేదు అంటూ స్పష్టత వచ్చింది.

వెంకటేష్‌తో సినిమాపై పుకార్లు

నేను పేపర్ మీద కలం కూడా పెట్టలేదు ఇంకా 😭🙏

నటినటులు కధ టైటిల్ కూడా పెట్టేసారు ఈ ఫ్లో చూస్తుంటే .యాక్షన్..కట్ కూడా చెప్పేస్తారేమో 😉😉😉😊😄 మీ ఉత్సాహన్ని నేను అర్థం చేసుకోగలను…. అలాగే నేను చేసే సినిమా ఏంటి ఎవరితో అనేది అతి త్వరలో…నిజమైన పూర్తి వివరాలు… మీకు… pic.twitter.com/bfhQ4NrOfu

— Anil Ravipudi (@AnilRavipudi) February 10, 2026

పూర్తి వివరాలు త్వరలో వెల్లడి

ఇక అనిల్ రావిపూడి ఈ వార్తలను పూర్తిగా ఖండించడంతో ఈ సినిమా విషయంలో మరిన్ని సందేహాలు కూడా తలెత్తుతున్నాయి మరి వెంకటేష్ తో కాకపోతే అనిల్ రావిపూడి సినిమా ఎవరితో ఉండబోతోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది అనిల్ రావిపూడిని బెదిరింపులకు కూడా గురి చేస్తున్నారు. ఈ వార్తలలో ఏ ఒక్కటి నిజమైన నీకు మాత్రం ఉంటది అంటూ వార్నింగులు ఇవ్వగా మరికొందరు రామ్ పోతినేనితో చేయండి, పవన్ కళ్యాణ్ తో చేయండి అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు. మరి అనిల్ రావిపూడి తదుపరి సినిమా ఏ హీరోతో ఉండబోతుంది? కథ నేపథ్యం ఏంటి అనేవి విషయాలు తెలియాల్సి ఉంది.

అనిల్ రావిపూడి ప్రకటనతో ఆయన తదుపరి సినిమాపై నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది. త్వరలోనే ఆయన సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. అప్పటి వరకు వేచి చూడాల్సిందే.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.