
మెగాస్టార్ చిరంజీవి, నయనతార కాంబోలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ‘మన శంకరవర ప్రసాద్ గారు’ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్స్ వచ్చాయి. దసరాకు స్పెషల్ సర్‌ప్రైజ్ ఉండగా, ఇవాళ నయనతార ఫస్ట్ లుక్ ‘శశిరేఖ’గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Key Points
'మన శంకరవర ప్రసాద్ గారు' సినిమాలో నయనతార శశిరేఖ క్యారెక్టర్‌లో నటిస్తోంది.
ఇవాళ (అక్టోబర్ 1) నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు.
దసరా సందర్భంగా రేపు (అక్టోబర్ 2) మూవీ నుంచి మరో సర్ ప్రైజ్ రానుంది.
మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ లుక్ గ్లింప్స్ ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ చేసింది.
నయనతార ‘శశిరేఖ’గా అదరహో!
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో వస్తున్న ఫస్ట్ సినిమా ‘మన శంకరవర ప్రసాద్ గారు’. ఇందులో నయనతార హీరోయిన్. సైరా నరసింహా రెడ్డి, గాడ్ ఫాదర్ తర్వాత చిరంజీవి, నయనతార కలిసి నటిస్తున్న మూవీ ఇది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేలా ఈ మూవీ షూటింగ్ చేస్తున్నారు. ఇవాళ (అక్టోబర్ 1) మన శంకరవర ప్రసాద్ గారు హీరోయిన్ నయనతార ఫస్ట్ లుక్ ను అనిల్ రావిపూడి రిలీజ్ చేశాడు.
మన శంకరవర ప్రసాద్ గారు సినిమాలో హీరోయిన్ నయనతార శశిరేఖ క్యారెక్టర్ ప్లే చేస్తుంది. శశిరేఖగా నయనతారను పరిచయం చేస్తూ ఓ పోస్టర్ ను బుధవారం రిలీజ్ చేశాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి .
‘‘ మన శంకరవర ప్రసాద్ గారు నుంచి శశిరేఖగా నయనతారను ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఈ అందమైన పాత్రలో ఆమె ఉండటం, ఆమెతో పని చేయడం అంతులేని ఆనందాన్ని అందిస్తుంది. రేపు మన శంకరవర ప్రసాద్ గారు నుంచి సర్ ప్రైజ్ కోసం రెడీగా ఉండండి’’ అని అనిల్ ఎక్స్ లో పేర్కొన్నాడు.
చిరు గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్
మన శంకరవర ప్రసాద్ గారు సినిమా నుంచి దసరా సందర్భంగా రేపు (అక్టోబర్ 2) సర్ ప్రైజ్ ఉంటుందని డైరెక్టర్ అనిల్ రావిపూడి అనౌన్స్ చేశాడు. అయితే ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ మంచి హైప్ కలిగించాయి. చిరును వింటేజీ లుక్ లో చూపించేసరికి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి దసరా సందర్భంగా ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేస్తారా? లేకపోతే సాంగ్ ఏదైనా విడుదల చేస్తారా? అన్నది చూడాలి.
శంకరవరప్రసాద్ గారు గ్లింప్స్
దసరాకు ‘మన శంకరవర ప్రసాద్ గారు’ నుంచి సర్‌ప్రైజ్
మెగాస్టార్ చిరు పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన మన శంకరవరప్రసాద్ గ్లింప్స్ మరింత ఆకట్టుకుంటోంది. గ్లింప్స్‌లో చిరంజీవిని డిఫరెంట్ లుక్స్‌తో కొన్ని షాట్స్ చూపించారు. సూట్ వేసుకుని సిగరెట్ తాగుతూ కారులో నుంచి దిగే సీన్, పెద్ద గ్యాంగ్‌తో గ్యాంగ్‌స్టర్‌లా రావడం, మెట్లపై నుంచి గన్ పట్టుకుని స్టైలిష్‌గా నడుచుకుంటూ రావడం అన్ని అదిరిపోయేలా ఉన్నాయి.
గ్లింప్స్‌లో “మన శంకరవరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు” అని డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పడం ఆకట్టుకుంది. ఇలా అన్ని రకాలుగా మెగా 157 టైటిల్ గ్లింప్స్ అదిరిపోయేలా ఉంది. ఇకపోతే వచ్చే ఏడాది సంక్రాంతికి మన శంకరవరప్రసాద్ గారు సినిమా రిలీజ్ కానుంది.
‘మన శంకరవర ప్రసాద్ గారు’ సినిమాపై చిరంజీవి, నయనతార అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. దసరా సర్‌ప్రైజ్‌తో పాటు, సంక్రాంతి రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలని ఆశిద్దాం.


