|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అనిల్ రావిపూడికి ఊహించని బహుమతి! ఫామ్ హౌస్ గిఫ్ట్ గా ఇచ్చిన నిర్మాత.. అసలేం జరిగిందంటే?

Published: 13-01-2026, 11:15 AM
అనిల్ రావిపూడికి ఊహించని బహుమతి! ఫామ్ హౌస్ గిఫ్ట్ గా ఇచ్చిన నిర్మాత.. అసలేం జరిగిందంటే?
  • దర్శకుడు అనిల్ రావిపూడికి నిర్మాత సాహు గారపాటి ఫామ్ హౌస్ గిఫ్ట్ గా ఇవ్వనున్నారు.
  • చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాను 25 రోజుల్లో పూర్తి చేసిన అనిల్ రావిపూడి.
  • యుఎస్ ప్రీమియర్ వన్ మిలియన్ క్రాస్ చేస్తే కారు కొనిస్తానని సాహుతో బెట్ కాసిన అనిల్.
  • నాలుగు మిలియన్లు క్రాస్ అవ్వడంతో అనిల్ రావిపూడికి ఫామ్ హౌస్ గిఫ్ట్ గా రానుంది.

దర్శకుడు అనిల్ రావిపూడికి ఊహించని బహుమతి లభించింది. నిర్మాత సాహు గారపాటి ఆయనకు ఫామ్ హౌస్ ను గిఫ్ట్ గా ఇవ్వనున్నారు. చిరంజీవితో కలిసి పనిచేసిన సినిమా మంచి విజయం సాధించడంతో ఈ బహుమతి లభించింది. ఈ విషయానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అనిల్ రావిపూడికి ఫామ్ హౌస్ గిఫ్ట్

Anil Ravipudi: పటాస్ సినిమా ద్వారా దర్శకుడుగా పరిచయమైన అనిల్ రావిపూడి(Anil Ravipudi) ప్రతి ఏడాది ఒక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ సూపర్ హిట్ సక్సెస్ తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఇప్పటివరకు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తొమ్మిది సినిమాలు ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే అపజయ మెరుగని దర్శకుడిగా రాజమౌళి తరువాత అంతటి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. తాజాగా చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు(MSVPG) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్ అందుకున్నారు.

ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వడంతో చిత్రబృందం సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ… మన శంకర వరప్రసాద్ గారు సినిమా కథను తాను కేవలం 25 రోజులలో పూర్తి చేశానని తెలిపారు. ఫస్ట్ హాఫ్ 15 రోజులు సెకండ్ హాఫ్ పది రోజులలో పూర్తి చేశాను ఇంత తొందరగా స్క్రిప్ట్ పూర్తి చేశాను అంటే అందుకు కారణం చిరంజీవి గారని, నా కెరియర్లో చాలా త్వరగా స్క్రిప్ట్ పూర్తి చేసిన సినిమా ఇదేనని తెలిపారు.

చిరంజీవితో సినిమాను త్వరగా పూర్తి చేసిన అనిల్

ఇక ఈ సినిమా విషయంలో చాలామంది ఎన్నో విమర్శలు చేశారు ఈ సినిమా ద్వారా నేను ఎక్కడ దొరుకుతానా అంటూ ఎదురు చూశారు కానీ వారికి అవకాశం రాలేదని తెలియజేశారు. ఇక ఈ సినిమాతో నిర్మాత సుష్మిత కొణిదెల లక్ష్యం కూడా నెరవేరిందని అనిల్ రావిపూడి తెలిపారు. మరొక నిర్మాత సాహూ గురించి మాట్లాడుతూ.. సాహు గారు తన సొంత బ్రదర్ లాంటివారని తెలిపారు. అయితే ఈ సినిమా విషయంలో ఇద్దరి మధ్య ఒక బెట్ నడిచిందని యుఎస్ ప్రీమియర్ వన్ మిలియన్ క్రాస్ అవుతే తాను సాహు గారికి కారు కొనిస్తానని చెప్పాను అయితే నాలుగు మిలియన్లు క్రాస్ అవుతే ఆయన నాకు ఫామ్ హౌస్ (Farm House)కొనిస్తానని చెప్పారు ఇప్పుడు ఫోర్ మిలియన్స్ క్రాస్ అవుతున్నాయని సాహు గారు నాకు ఫామ్ హౌస్ కొనిస్తారు అంటూ ఈ సందర్భంగా అనిల్ రావిపూడి తెలిపారు.

నేషనల్ అవార్డు అందుకున్న అనిల్ రావిపూడి..

బెట్టింగ్ లో గెలిచిన అనిల్ రావిపూడి

సాహు గారికి నేను ఇచ్చే కారు కావాలి అంటే ఆయన నాకు ఫామ్ హౌస్ ఇవ్వాల్సి ఉంటుంది అంటూ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో సాహూ గారపాటి అనిల్ రావిపుడికి కారును బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న నేపథ్యంలో అనిల్ రావిపూడికి నిర్మాత కారును బహుమతిగా ఇచ్చారు. ఇక ఈ సినిమాకు ఏకంగా నేషనల్ అవార్డు కూడా వచ్చిన సంగతి తెలిసిందే.

అనిల్ రావిపూడి, సాహు గారపాటి మధ్య ఉన్న అనుబంధం ఈ సంఘటనతో మరోసారి రుజువైంది. సినిమా సక్సెస్ మీట్ లో ఈ విషయాన్ని వెల్లడించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో వీరి కాంబినేషన్లో మరిన్ని విజయాలు వస్తాయని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.