
📌 Key Points
- చిరంజీవిని సినిమాలో పూర్తిగా ఉపయోగించుకున్నానని అనిల్ రావిపూడి స్పష్టం చేశారు.
- నయనతార తన అదృష్టం, మంచి సమయం వల్లే సినిమా ఒప్పుకుందని అనిల్ వెల్లడించారు.
- ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతికి నవ్విస్తుందని డైరెక్టర్ ధీమా వ్యక్తం చేశారు.
- చిరంజీవి, నయనతారలను కలిపి చూపించడం తన అదృష్టమని అనిల్ రావిపూడి తెలిపారు.
డైరెక్టర్ అనిల్ రావిపూడి తన తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి పాత్రను పూర్తిగా ఉపయోగించుకున్నానని, నయనతార సినిమా ఒప్పుకోవడం తన అదృష్టమని తెలిపారు. ఈ సంక్రాంతికి సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
చిరంజీవి పాత్రపై అనిల్ రావిపూడి వ్యాఖ్యలు
డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. చిరంజీవిని ఈ సినిమా పిండేశానని ఆయనే చెప్పారని, సంక్రాంతికి వస్తున్నాంలాగే మన శంకర వరప్రసాద్ గారు కూడా నవ్విస్తుందని చెప్పాడు.
టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మరోసారి సంక్రాంతికి తన సినిమాతో వస్తున్నాడు. ఈసారి చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు మూవీతో రెడీ అయ్యాడు. ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా అనిల్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై తనదైన స్టైల్లో స్పందించాడు.
నయనతార అంగీకారం వెనుక రహస్యం
“మేకింగ్ వీడియో రిలీజ్ చేసినప్పుడు అందులో చిరంజీవి గారు మాట్లాడుతూ.. పిండేస్తున్నాడమ్మ అబ్బాయి అని అన్నారు కదా. వాడటం అంటే ఏదీ వదల్లేదు నేను. అది ఆయనదే. ఆయన స్ట్రెంత్ అన్నారు కదా. ఎ టు జెడ్ ఎంతయితే అంత చిరంజీవిగారిని ఎలా చూస్తే ఆడియెన్స్ లైక్ చేస్తారో అలా చూపించడానికి నా 100 శాతం ఎఫర్ట్స్ పెట్టాను. ఈ సినిమాలో ఆయన విపరీతంగా నచ్చుతారు” అని అనిల్ చెప్పాడు.
“చాలామంది అడిగారు.. నయనతార ఎలా ఒప్పుకున్నారు అని.. నా టైమ్ బాగుండి ఒప్పుకున్నారామె. టైమ్ బాగుంది.. గ్రహ ఫలాలు బాగున్నాయి.. ఒప్పేసుకుందామె. కాన్సెప్ట్ కూడా ఆమెకు బాగా నచ్చింది. ఇక చిరంజీవి గారు గుర్రాన్ని పట్టుకున్నారు, ఎక్కారు. ఇది కథలో ఫ్లాష్‌బ్యాక్ లో ఎలా కలుసుకున్నారు అని చెప్పే పాట కోసం అలా చేశాం” అని అనిల్ చెప్పాడు.
రెండు దిగ్గజాలను కలిపిన అదృష్టం
ఆ ఇద్దరినీ కలిపి చూపించడం నా అదృష్టం
అనిల్ రావిపూడి తన సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవిని, నయనతారను ఒకే తెరపై చూపించే అవకాశం దక్కినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


