|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అనిల్ రావిపూడి సినిమాలో మలయాళ స్టార్ ఫిక్స్: టాలీవుడ్‌లో సంచలనం!

Published: 04-02-2026, 12:05 AM
అనిల్ రావిపూడి సినిమాలో మలయాళ స్టార్ ఫిక్స్: టాలీవుడ్‌లో సంచలనం!
  • అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్‌లో ఇది మూడో చిత్రం.
  • ఈ సినిమాలో కార్తీక్ స్థానంలో ఫహద్ ఫాజిల్ నటించనున్నారు.
  • పుష్పలో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రతో ఫహద్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
  • సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి వెంకటేష్‌తో కలిసి సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషించనున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇది మూడవ చిత్రం కావడం విశేషం.

వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబో రిపీట్!

Anil Ravipudi: టాలీవుడ్‌లో కమర్షియల్ ఎంటర్‌టైనర్లకు కేరాఫ్ అడ్రస్ అంటే ముందుగా వినిపించే పేరు అనిల్ రావిపూడి. వరుస విజయాలతో ‘హిట్ మెషీన్’గా పేరు తెచ్చుకున్న ఈ దర్శకుడు, పండగ సీజన్‌ను తనకి అనుకూలంగా మార్చుకోవడంలో దిట్ట. ‘సంక్రాంతికి వస్తున్నా’, ‘మన శంకర వరప్రసాద్’ సినిమాలతో సంక్రాంతికి బ్లాక్‌బస్టర్ హిట్లు అందుకున్న అనిల్, ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి ఆయన తన ఫేవరెట్ హీరో, విక్టరీ వెంకటేష్‌తో జతకట్టబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ సంక్రాంతిక వస్తున్నాం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నవ్వుల పువ్వులు పూయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ సక్సెస్‌ఫుల్ కాంబో రిపీట్ కాబోతోంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమాకు ‘అదిరిపోద్దీ సంక్రాంతి’ అనే టైటిల్ చర్చల్లో ఉందని తెలుస్తోంది.

Read also- Siva Karthikeyan: హోస్ట్ నుంచీ స్టార్ వరకూ.. 14 ఏళ్ల ప్రయాణంలో ఎంతో మార్పు!

కార్తీక్ స్థానంలో ఫహద్ ఫాజిల్

అనిల్ రావిపూడి సినిమాల్లో మల్టీస్టారర్ ఎలిమెంట్స్ చాలా కీలకంగా ఉంటాయి. ఈ తాజా చిత్రంలో కూడా వెంకీ మామతో పాటు మరో కీలకమైన పాత్ర ఉంది. ఈ పాత్ర కోసం చిత్ర యూనిట్ మొదట కోలీవుడ్ స్టార్ హీరో కార్తీని సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఇప్పుడు ఆ స్థానంలోకి మాలీవుడ్ సెన్సేషన్, వెర్సటైల్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ వచ్చి చేరినట్లు తెలుస్తోంది. పుష్ప చిత్రంలో ‘భన్వర్ సింగ్ షెకావత్’గా తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఫహద్ ఫాజిల్, ఇప్పుడు అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైనర్‌లో కనిపించబోతుండటం విశేషం. ఫహద్ తనదైన ఇంటెన్స్ పర్ఫార్మెన్స్‌తో, వెంకటేష్ తన టైమింగ్ కామెడీతో ఈ సినిమాను ఏ రేంజ్‌కు తీసుకెళ్తారో అని అభిమానులు అప్పుడే అంచనాలు మొదలుపెట్టారు.

Read also- Podarillu Today Episode : కన్నీళ్లు పెట్టుకున్న మహా.. మాధవ్ కు నిజం చెప్పిన మహా.. గాయత్రి మాటతో మహా షాక్..

సంక్రాంతికి అదిరిపోయే ఎంటర్టైన్మెంట్

అనిల్ రావిపూడికి సంక్రాంతి సీజన్ చాలా బాగా అచ్చువచ్చింది. పండగ పూట ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా వినోదాన్ని పంచడంలో ఆయనది ప్రత్యేక శైలి. విక్టరీ వెంకటేష్ కూడా సంక్రాంతి హీరోగా పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరికీ తోడు ఇప్పుడు ఫహద్ ఫాజిల్ లాంటి స్టార్ పవర్ తోడవ్వడంతో, ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. కామెడీ, యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కలగలిపి ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కించబోతున్నారట. పూర్తి వివరాలు త్వరలో రానున్నాయి. ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అనిల్ రావిపూడి, వెంకటేష్‌ల కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఫహద్ ఫాజిల్ కూడా చేరడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.