
📌 Key Points
- అఖిల్, శ్రీలీల జోడితో అనిల్ రావిపూడి సినిమా ఫిక్స్ అయినట్టేనా?
- మెగాస్టార్ చిరంజీవి కాంబోలో అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు!
- అఖిల్ తో సినిమా చేస్తే అనిల్ రావిపూడికి డిజాస్టర్ తప్పదా?
- శ్రీలీల ఐరన్ లెగ్ అని ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు!
టాలీవుడ్ లో ఒక సంచలనం! అనిల్ రావిపూడి ఇప్పుడు అఖిల్ అక్కినేనితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
అనిల్ రావిపూడి, అఖిల్ కాంబో నిజమేనా?
టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా దూసుకు వెళ్తున్నారు అనిల్ రావిపూడి. ఈ మధ్య సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరోతో కూడా హిట్ కొట్టారు అనిల్ రావిపూడి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమానే మన శంకర వరప్రసాద్ గారు. ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా మెరువగా… విక్టరీ వెంకటేష్ 20 నిమిషాల పాటు స్పెషల్ రోల్ చేసి, కుమ్మేశాడు. ఈ సినిమా 300 కోట్ల క్లబ్ లో చేరినట్లు చెబుతున్నారు. ఈ సినిమా హిట్ అందుకున్న అనిల్ రావిపూడి… ఒక్క డిజాస్టర్ లేని దర్శకుడిగా చరిత్ర సృష్టించాడు. ఈ లిస్టులో రాజమౌళి, సందీప్ రెడ్డి, నాగ అశ్విన్ ఉన్న సంగతి తెలిసిందే.
శ్రీలీల హీరోయిన్ ఫిక్స్ అయిందా?
చిరంజీవితో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి, అక్కినేని అఖిల్ తో కూడా సినిమా చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఇందులో శ్రీ లీల హీరోయిన్ అంటూ ప్రచారం మొదలుపెట్టారు. అయితే ఈ ప్రాజెక్టుపై ఇప్పటి వరకు అనిల్ రావిపూడి స్పందించలేదు కానీ.. పోస్టులు మాత్రం పెడుతున్నారు. అఖిల్ అక్కినేని హిట్ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్నారు. మొన్నటికి మొన్న ఏజెంట్ అనే సినిమా చేసి, నిరాశను ఎదుర్కొన్నారు.
నెటిజన్ల ట్రోల్స్… ఫలితం ఎలా ఉండబోతుంది?
అటు శ్రీలీల కూడా భగవంత్ కేసరి లాంటి సినిమా తర్వాత మళ్లీ పెద్ద హిట్ అందుకోలేదు. అలాంటి ఆమెను అఖిల్ అక్కినేని సినిమాలో హీరోయిన్ గా సెట్ చేసి.. అనిల్ రావిపూడి సినిమా చేయబోతున్నట్లు పోస్టులు పెడుతున్నారు. అయితే దీనిపై చాలామంది ట్రోల్స్ కూడా చేస్తున్నారు. చిరంజీవి సినిమాలో దొరకని అనిల్.. కచ్చితంగా అఖిల్ సినిమా సందర్భంగా దొరుకుతాడని సెటైర్లు పేల్చుతున్నారు. అఖిల్ అక్కినేని ఐరన్ లెగ్ అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. అతనితో ఎంత సక్సెస్ఫుల్ డైరెక్టర్ సినిమా చేసినా, కష్టమే అని ర్యాగింగ్ కూడా చేస్తున్నారు. క్లిక్
అనిల్ రావిపూడి, అఖిల్ కాంబినేషన్ పై మీ అంచనాలు ఏమిటి? ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


