
📌 Key Points
- అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఆయనకు డిమాండ్ భారీగా పెరిగింది!
- వెంకటేష్, రానా కాంబినేషన్‌లో సినిమా రాబోతుందని వస్తున్న వార్తలపై అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు.
- ఇంకా పేపర్ మీద కలం పెట్టకముందే నా సినిమా గురించి రూమర్లు క్రియేట్ చేస్తున్నారంటూ అనిల్ సెటైర్లు వేశారు.
- త్వరలోనే కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన చేస్తానని అనిల్ రావిపూడి తెలిపారు.
టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి గురించి ఒక సంచలన వార్త బయటకు వచ్చింది. ఆయన తన తదుపరి సినిమాపై క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్స్
అనిల్ రావిపూడి (Anil Ravipudi).. ఈ పేరు చెబితేనే ఇండస్ట్రీ షేక్ అవుతుంది. ఇప్పటివరకు అనిల్ తీసిన ప్రతి సినిమా బంపర్ హిట్ కావడంతో.. సీనియర్ హీరోల నుంచి కుర్ర హీరోలందరూ అతనితో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. రెమ్యూనరేషన్ తక్కువ అయినా సరే, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక్క సినిమా పడితే చాలు అని చాలా మంది హీరోలు ప్లాన్ చేసుకుంటున్నారట. ఏడాదిలో ప్రతి సంక్రాంతికి అనిల్ రావిపూడి కొత్త సినిమా రావడం, బంపర్ హిట్ అందుకోవడం జరుగుతోంది.
రూమర్స్‌పై అనిల్ రావిపూడి సీరియస్ కామెంట్స్
అనిల్ రావిపూడి ఈ సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమాతో వచ్చి బంపర్ హిట్ అందుకున్నారు. అది కూడా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ ఈ సినిమా రావడం ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇచ్చినట్లైంది. కిందటి సంక్రాంతి సమయంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో హిట్ అందుకున్న అనిల్.. ఈసారి చిరంజీవితో ఇండస్ట్రీని షేక్ చేశాడు. మన శంకర వరప్రసాద్ గారు సినిమా కూడా సక్సెస్ కావడంతో… అనిల్ రావిపూడి తర్వాతి సినిమాపై అనేక రకాల వార్తలు వస్తున్నాయి. విక్టరీ వెంకటేష్, రానా కాంబినేషన్ లో కొత్త సినిమా రాబోతుందని కొంతమంది ప్రచారం కూడా చేశారు.
కొత్త సినిమాపై అనిల్ రావిపూడి ప్రకటన ఎప్పుడంటే?
అనేక రూమర్స్ వస్తున్న నేపథ్యంలో తన కొత్త సినిమాపై అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. తాను ఇంకా పేపర్ మీద కలం కూడా పెట్టలేదు… కానీ అనేక రూమర్స్ మాత్రం వైరల్ చేస్తున్నారని కౌంటర్ పోస్టర్ పెట్టాడు అనిల్. మీరే కథ ఫిక్స్ చేస్తున్నారు… నటీనటులు, టైటిల్ అన్ని పెట్టేశారు… ఇక మీరే యాక్షన్, కట్ చెప్పేసేయండి అంటూ సెటైర్లు పేల్చారు. మీ ఉత్సాహాన్ని తాను అర్థం చేసుకుంటాను… అతి త్వరలోనే కొత్త సినిమా పైన ప్రకటన చేస్తాను అంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో అనిల్ రావిపూడి పోస్ట్ పై రకరకాల కామెంట్లు వస్తున్నాయి.
అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాపై త్వరలోనే ప్రకటన చేయనున్నారు. ఏ హీరోతో సినిమా ఉంటుందో వేచి చూడాలి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


