
📌 Key Points
- అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వరప్రసాద్ గారి సినిమా రూ. 300 కోట్ల వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్!
- దిల్ రాజుతో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్ చేసే ఆలోచనలో అనిల్ రావిపూడి, ఒకవేళ ఇతర ప్రాజెక్టులు సెట్ కాకపోతే ఇదే దారి!
- అనిల్ రావిపూడితో సినిమా కోసం నిర్మాతలు సాహు గారపాటి, వెంకట్ సతీష్ కిలారు పోటీ పడుతున్నారు, హీరో ఎవరైతే వారితో సినిమా!
- ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించడంలో అనిల్ రావిపూడి దిట్ట, అందుకే ఆయన సినిమాలకి తిరుగులేదు!
టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇప్పుడు హాట్ టాపిక్. మన శంకర వరప్రసాద్ గారు సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఆయన నెక్స్ట్ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన ఎవరితో సినిమా చేస్తారో అనే ఉత్కంఠ నెలకొంది.
అనిల్ రావిపూడి నెక్స్ట్ టార్గెట్ ఎవరు?
Anil Ravipudi: మాస్, యాక్షన్ సినిమాలతో ఎవరైనా ఇండస్ట్రీ హిట్స్ కొడతారు. కానీ, ఫ్యామిలీ సినిమాలతో ఇండస్ట్రీ హిట్స్ కొట్టేవాడికే ఒక రేంజ్ లో ఉంది. వాడే దర్శకుడు అనిల్ రావిపూడి. అసలు ఎం మంత్రం వేస్తున్నాడో తెలియడం లేదు కానీ. ప్రతీ సంక్రాంతికి వచ్చి సింపుల్ గా ఇండస్ట్రీ హిట్స్ కొట్టేసి వెళ్ళుపోతున్నాడు ఈ దర్శకుడు. ఆయన బలం ఫ్యామిలీ ఆడియన్స్.
కథలో పెద్దగా మలుపులు ఏముండవ్.. జస్ట్ రెగ్యులర్ కథకి కామెడీ, ఎమోషన్స్ ని యాడ్ చేసి హిట్ కొడతాడు అనిల్. రీసెంట్ గా వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో అది మరోసారి ప్రూవ్ అయ్యింది. ఈ సినిమా విడుదలై 10 రోజులు గడుస్తున్నా థియేటర్స్ దగ్గర సందడి మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
దిల్ రాజు ప్లాన్స్ ఏమిటి?
ఈ నేపధ్యంలోనే అనిల్ రావిపూడి(Anil Ravipudi) నెక్స్ట్ సినిమా గురించి ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈయనతో సినిమా చేసేందుకు ఇద్దరు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అందులో ఒకరు సాహు గారపాటి, మరొకరు వెంకట్ సతీష్ కిలారు. ఈ ఇద్దరితో సినిమాలు చేయాల్సిన కమిట్మెంట్ ఉంది అనిల్ రావిపూడికి. అయితే, ఈ ఇద్దరిలో ముందు ఎవరితో సినిమా చేస్తాడు అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.
నిర్మాతల మధ్య పోటీ!
ఇప్పటికే ఈ ఇద్దరు నిర్మాతలు అనిల్ కోసం హీరోలను వెతికే పనిలో ఉన్నారు. ఎవరు ముందుగా హీరోని పెట్టేస్తే వారితోనే సినిమా సెట్ అన్నమాట. ఇక మరోపక్క దిల్ రాజు కూడా అనిల్ తో సినిమా చేసేందుకు సిద్ధం గా ఉన్నాడు. దిల్ రాజుతో అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం సినిమా సీక్వెల్ చేయాల్సి ఉంది. ఒకవేళ ఏది సెట్ కాకపోతే సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ ను మొదలుపెట్టే అవకాశం ఉంది అనిల్. మరి ఇన్ని ఆఫర్స్ మధ్య అనిల్ రావిపూడి ఎవరితో సినిమా చేస్తున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది.
అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఎవరితో సినిమా ఉంటుందో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి!


