|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: నాగార్జునతో అనిల్ రావిపూడి సంచలన మూవీ? వినాయక్ కూడా టచ్ చేయని రేర్ రికార్డ్!

Published: 12-01-2026, 6:00 AM
షాకింగ్: నాగార్జునతో అనిల్ రావిపూడి సంచలన మూవీ? వినాయక్ కూడా టచ్ చేయని రేర్ రికార్డ్!
  • అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వరప్రసాద్ చిత్రం బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది!
  • చిరంజీవి సినిమాతో అనిల్ రావిపూడి మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.
  • వెంకటేష్, బాలయ్య, చిరంజీవి లతో సినిమాలు చేసిన అనిల్, ఇప్పుడు నాగార్జునతో సినిమాకి సిద్ధమవుతున్నారు!
  • వి.వి. వినాయక్ కి సాధ్యం కాని అరుదైన రికార్డును అనిల్ రావిపూడి అందుకోనున్నారు!

టాలీవుడ్ లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్! అనిల్ రావిపూడి తదుపరి సినిమా ఎవరితో? మెగాస్టార్ చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత, అనిల్ రావిపూడి ఏ హీరోతో సినిమా చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అనిల్ రావిపూడి నెక్స్ట్ టార్గెట్ ఎవరు?

8 సినిమాలు చేస్తే అన్నీ హిట్లు.. ఇప్పుడు 9 వ చిత్రం రిలీజ్ అయింది. అది కుడి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. ఇలాంటి తరుణంలో ఆ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ ఏంటి అని అభిమానులు ఆసక్తికరంగా చర్చించుకోవడం సాధారణమే. ఇదంతా ఎవరి గురించి ఇప్పటికే అర్థమై ఉంటుంది. తన సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ని కట్టి పడేస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి గురించే.

అనిల్ రావిపూడి తాజాగా తెరకెక్కించిన మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ మొదలైంది. అనిల్ రావిపూడి సినిమాల్లో కథ కంటే వినోదం ప్రధానంగా ఉంటుంది. చిరంజీవి సినిమాకి కూడా అనిల్ అదే మ్యాజిక్ రిపీట్ చేశారు. మన శంకర్ వరప్రసాద్ చిత్రానికి హిట్ టాక్ వచ్చేసింది కాబట్టి ఇక కాసుల వర్షం ఖాయం అనిట్రెండ్ పండితులు చెబుతున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ తొలి రోజు వసూళ్ల జోరు కూడా ఒక రేంజ్ లో ఉంది.

నాగార్జునతో సినిమా నిజమేనా?

గతేడాది సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్.. ఈ ఏడాది చిరంజీవి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా ఏంటి ? ఏ హీరోతో చేయబోతున్నారు ? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అనిల్ రావిపూడి సీనియర్ హీరోలందరినీ చుట్టేస్తున్నారు. వెంకటేష్ తో ఆల్రెడీ 3 సినిమాలు చేశారు. బాలయ్యతో భగవంత్ కేసరి, చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు చిత్రాలు తెరకెక్కించారు.

నియర్లలో ఇక మిగిలింది నాగార్జున మాత్రమే. అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ నాగ్ తోనేనా ? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి ఇండస్ట్రీలో. నాగార్జున, అనిల్ రావిపూడి కాంబినేషన్ సెట్ అయినట్లు చెబుతున్నారు. అయితే అఫీషియల్ గా ఇంకా ప్రకటించలేదు. నాగ్ తో మాత్రం సినిమా చేస్తే అనిల్ రావిపూడి రేర్ రికార్డ్ అందుకున్న దర్శకుడిగా మారిపోతారు. డైరెక్టర్ బాబీ చిరంజీవి, బాలయ్యలతో సినిమాలు చేశారు.గోపీచంద్ మలినేని వెంకటేష్ బాలయ్య లతో చేశారు.

వి.వి. వినాయక్ రికార్డు బ్రేక్ చేసేనా?

ఈ తరం దర్శకులు ఎవరికీ ఈ నలుగురు హీరోలతో సినిమాలు చేసిన రికార్డ్ లేదు. ఆ రికార్డ్ కి అత్యంత చేరువలో ఉన్నది మాత్రం అనిల్ రావిపూడే అని చెప్పాలి. డైరెక్టర్ వివి వినాయక్ కు సైతం ఆ రికార్డ్ మిస్ అయింది. ఆయన చిరంజీవి, వెంకీ, బాలయ్యలతో సినిమాలు చేశారు కానీ నాగ్ తో చేయలేదు. పాత తరం దర్శకులలో రాఘవేంద్ర రావు, కోదండరామిరెడ్డి, కోడి రామకృష్ణ, ఈవీవీ సత్యనారాయణ లాంటి వారు ఈ నలుగురితో సినిమాలు చేశారు.

అనిల్ రావిపూడి, నాగార్జున కాంబినేషన్ నిజమైతే టాలీవుడ్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం. దీని గురించి మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.