|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: యంగ్ హీరోతో అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ? ఇది మామూలు రిస్క్ కాదుగా!

Published: 23-01-2026, 6:35 AM
షాకింగ్: యంగ్ హీరోతో అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ? ఇది మామూలు రిస్క్ కాదుగా!
  • అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీలో యంగ్ హీరో! ఇది నిజంగా షాకింగ్ అప్డేట్.
  • `Manashankara Varaprasad Garu` మూవీ 300 కోట్లు కొల్లగొట్టింది, ఇప్పుడు నెక్స్ట్ మూవీపై అంచనాలు.
  • అఖిల్ అక్కినేనికి హిట్టు ఇవ్వాలని నాగార్జున ప్రయత్నాలు, అనిల్ రావిపూడితో సినిమా ఫిక్స్!
  • ఈ కాంబినేషన్ టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తుందా? వేచి చూడాల్సిందే.

టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఆయన నెక్స్ట్ సినిమా ఎవరితో అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆయన ఒక యంగ్ హీరోతో సినిమా చేయబోతున్నారట. ఇది నిజంగా ఒక సాహసమే అంటున్నారు సినీ విశ్లేషకులు.

అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ ఎవరితో?

అనిల్‌ రావిపూడి గత సంక్రాంతికి `సంక్రాంతికి వస్తున్నాం` మూవీతో హిట్‌ కొట్టాడు. ఈ సంక్రాంతికి `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీతో మరో బ్లాక్‌ బస్టర్‌ కొట్టాడు. ఈ మూవీ రీజనల్‌ చిత్రాల్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇప్పటికే ఇది మూడు వందల కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. నాలుగు వందల కోట్ల దిశగా అడుగులు వేస్తోంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా సినిమా ఉండటంతో ఫ్యామిలీ ఆడియెన్స్ క్యూ కడుతున్నారు. ఇప్పటికీ సినిమాకి విశేష ఆదరణ లభించడం విశేషం.

ఈ క్రమంలో అనిల్‌ రావిపూడి నెక్ట్స్ సినిమా ఎవరితో అనేది ఆసక్తికరంగా మారింది. పవన్‌ కళ్యాణ్‌తో సినిమా ఇప్పట్లో లేదనే విషయాన్ని అనిల్‌ రావిపూడి తెలిపారు. వెంకటేష్‌ తో `సంక్రాంతికి వస్తున్నాం` సీక్వెల్‌ లేదన్నారు. అదే సమయంలో కొత్తగా ఇంకా ఎవరితోనూ అనుకోలేదని తెలిపారు. ఇటీవలే ఒక టైటిల్‌ అనుకున్నాడట. అది చాలా క్రేజీగా ఉంటుందని, ఆడియెన్స్ ఆశ్చర్యపోతారని తెలిపారు. అదిరిపోయేలా ఉంటుందని, ప్రస్తుతం దీనిపై వర్క్ చేస్తున్నట్టు తెలిపారు. `మన శంకర వర ప్రసాద్‌ గారు` సక్సెస్‌ సెలబ్రేషన్‌ నుంచి బయట పడ్డాక కొత్త సినిమాపై అప్‌ డేట్‌ ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. హీరోల డేట్స్ ని బట్టి కొత్త సినిమా ఉంటుందన్నారు.

అఖిల్ తో సినిమా: రిస్క్ చేస్తున్నారా?

అనిల్‌ రావిపూడికి నెక్ట్స్ హీరో దొరికాడట. ఈ సారి స్టార్‌ హీరో కాకుండా కుర్ర హీరోతో సినిమా చేయబోతున్నాడట. నాగార్జునతో అనిల్‌ నెక్ట్స్ మూవీ ప్లాన్‌ చేస్తున్నట్టుగా ఆ మధ్య ప్రచారం జరిగింది. ఇప్పటి వరకు సీనియర్‌ హీరోల్లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌లతో సినిమాలు చేశారు. ఇక మిగిలింది నాగార్జుననే. ఆయనతో సినిమా చేయబోతున్నట్టు వార్తలొచ్చాయి. కానీ నాగార్జునతో కాదు, అఖిల్‌తో అనిల్‌ సినిమా చేయబోతున్నాడట. అఖిల్‌కి ఇప్పటి వరకు సరైన హిట్‌ లేదు. ఆయన ఎలాంటి సినిమాలకు సెట్‌ అవుతాడనేది క్లారిటీ లేదు. చేసుకుంటూ వెళ్తున్నాడు, వరుసగా ఆయా సినిమాలు డిజప్పాయింట్‌ చేస్తున్నాయి.

ఈ క్రమంలో అఖిల్‌కి ఒక కమర్షియల్‌ హిట్‌ ఇవ్వాలని నాగార్జున తపిస్తున్నాడు. అందులో భాగంగానే అఖిల్‌తో అనిల్‌ రావిపూడి సినిమాని సెట్‌ చేసినట్టు సమాచారం. వరుసగా హిట్లతో జోరు మీదున్న అనిల్‌ రావిపూడితో సినిమా అయితే అఖిల్‌కి హిట్‌ వస్తుందని నాగ్‌ నమ్ముతున్నారట. అందులో భాగంగానే ఈ ప్రాజెక్ట్ సెట్‌ అయినట్టు సమాచారం. అయితే ఇదే నిజమైతే ఇది పెద్ద రిస్క్ ప్రాజెక్టే అంటున్నారు నెటిజన్లు. అఖిల్‌కి అనిల్‌ రావిపూడి జోనర్ సెట్‌ అవుతుందా అనేది సస్పెన్స్ గా మారింది. అఖిల్‌ కామెడీ చేయగలడా అనేది డౌట్‌గా మారింది. దర్శకుడు చేయించుకున్నా, ఆడియెన్స్ ఎలా రిసీవ్‌ చేసుకుంటారనేది పెద్ద డౌట్‌. మొత్తంగా ఈ ప్రాజెక్ట్ నిజమైతే మాత్రం పెద్ద రిస్క్‌ అని అటు విశ్లేషకులు, ఇటు నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.  మరి ఏం జరుగుతుందో చూడాలి. ప్రస్తుతం అఖిల్‌ `లెనిన్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఇది మేలో రిలీజ్‌ కానుంది.

నాగార్జున ప్లాన్ సక్సెస్ అవుతుందా?

ఇదిలా ఉంటే అనిల్‌ రావిపూడి.. వెంకటేష్‌తోనూ ఓ మూవీ అనుకుంటున్నారట. `సంక్రాంతికి వస్తున్నాం` సీక్వెల్‌ ఉండబోదని తెలిపారు. దీంతో వెంకీతో ఓ కొత్త ప్రాజెక్ట్ అనుకుంటున్నారట. ఇందులో రానా నటించే అవకాశం ఉందట. మరి అనిల్‌ నెక్ట్స్ అఖిల్‌తోనా? లేక వెంకీతోనా అనేది చూడాలి. ప్రస్తుతం వెంకటేష్‌.. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో `ఆదర్శకుటుంబం`(ఏకే 47) చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత `దృశ్యం 3` ఉండబోతుందట. అనంతరం అనిల్‌తో సినిమా ఉంటుందని సమాచారం.

అనిల్ రావిపూడి, అఖిల్ కాంబినేషన్ టాలీవుడ్‌లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమా అఖిల్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందా లేదా వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.