|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

యంగ్ హీరోయిన్ మూవీకి అనిల్ రావిపూడి జై కొట్టారు! టాలీవుడ్ లో సెన్సేషన్!

Published: 08-02-2026, 2:35 AM
యంగ్ హీరోయిన్ మూవీకి అనిల్ రావిపూడి జై కొట్టారు! టాలీవుడ్ లో సెన్సేషన్!
  • యంగ్ హీరోయిన్ సినిమాకు అనిల్ రావిపూడి ఫిదా!
  • ‘విత్ లవ్’ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన అనిల్ రావిపూడి.
  • అనస్వర, అభిషన్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం!
  • ఫిబ్రవరి 6న విడుదలైన ‘విత్ లవ్’ యూత్ ఆడియన్స్ ఫేవరెట్!

టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎప్పుడూ మంచి చిత్రాలను ప్రోత్సహిస్తూ ఉంటారు. ఆయన తాజాగా ఒక చిన్న సినిమాను చూసి ఆశ్చర్యపోయారు. ఆ సినిమా గురించి ఆయన ఏమన్నారో తెలుసా?

అనిల్ రావిపూడి ప్రశంసలు!

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)ఎప్పుడూ మంచి సినిమాలను ప్రోత్సహించడంలో ముందుంటారు. తాజాగా ఆయన అనస్వర రాజన్(Anaswara Rajan), అభిషన్ జీవింత్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘విత్ లవ్’ (With love)చిత్రాన్ని చూసిన ఆయన చిత్ర యూనిట్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. ‘‘ఈ మధ్య కాలంలో నేను చూసిన అత్యంత ఆహ్లాదకరమైన రొమాంటిక్ కామెడీ ఇది. సినిమా చాలా నీట్‌గా, మనసుకు హత్తుకునేలా ఉంది. అనస్వర,అభిషన్ తమ పాత్రల్లో ఒదిరిపోయారు. వారి ఫెర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంది. షాన్ రోల్డన్ అందించిన సంగీతం చాలాబాగుంది. దర్శకుడిగా మదన్‌కు మంచి భవిష్యత్తు ఉంది.’’ అని రాసుకొచ్చారు.

అనిల్ రావిపూడి లాంటి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ నుండి ప్రశంసలు రావడంతో ‘విత్ లవ్’ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. తనదైన మార్క్ కామెడీ సినిమాలతో ప్రేక్షకులను అలరించే అనిల్ రావిపూడి, ఇలాంటి ఒక స్వచ్ఛమైన ప్రేమకథను అభినందించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా.. నిర్మాత సౌందర్య రజనీకాంత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో రానా దగ్గుబాటి, సురేష్ ప్రొడక్షన్స, ఏషియన్ సినిమాస్ సంయుక్తంగా విడుదల చేశాయి. ఫిబ్రవరి 6న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం యూత్ నుండి పాజిటివ్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటోంది. అనిల్ రావిపూడి ప్రశంసలు ఈ సినిమాకు మరింత బూస్ట్‌ను ఇస్తాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి ‘విత్ లవ్’ తన క్యూట్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను మాత్రమే కాకుండా సినీ ప్రముఖులను కూడా ఫిదా చేస్తోంది.

యూత్ ఆడియన్స్ ఫేవరెట్ మూవీ!

‘విత్ లవ్’ సినిమాకు బూస్ట్!

మొత్తానికి ‘విత్ లవ్’ సినిమా తన క్యూట్ లవ్ స్టోరీతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇలాంటి మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.